వైరల్ వీడియోకి షాక్ ఇచ్చిన నెటిజన్లు... దిమ్మతిరిగేలా సమాధానం

సోషల్ మీడియాలో ప్రజల్ని మోసం చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. టాలెంట్ పేరు చెప్పి... నకిలీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియోకి నెటిజన్లు చెక్ పెట్టారు.

news18-telugu
Updated: March 9, 2020, 2:44 PM IST
వైరల్ వీడియోకి షాక్ ఇచ్చిన నెటిజన్లు... దిమ్మతిరిగేలా సమాధానం
వైరల్ వీడియోకి షాక్ ఇచ్చిన నెటిజన్లు... దిమ్మతిరిగేలా సమాధానం (credit - YT - How to organise nails)
  • Share this:
అది పెద్ద వీడియో ఏమీ కాదు. అంతా కలిపి 28 సెకండ్లు ఉంది. అందులో... ఓ బాక్సులో చిందర వందరగా ఉన్న మేకులున్నాయి. ఓ వ్యక్తి (చేతులు మాత్రమే కనిపిస్తున్నా్యి) ఆ బాక్సును అటూ ఇటూ కదుపుతుంటే... ఆ మేకులు ఆటోమేటిక్‌గా ఓ పద్ధతైన వరుస క్రమంలోకి వచ్చేసాయి. ఆ తర్వాత ఆ బాక్సును అక్కడ ఆ రెండు చేతులూ పెట్టేశాయి. మొదట ఈ వీడియోని చూసిన వాళ్లు... ఇది నిజమే అనుకుంటారు. కానీ... నమ్మలేరు. ఎందుకంటే... ప్రపంచంలో ఎక్కడా అలా డబ్బాను ఊపితే... మేకులు పద్ధతిలోకి రావు. దీన్ని యూట్యూబ్‌లో పెట్టి... మేకుల్ని క్రమ పద్ధతిలో పెట్టడం ఎలా అని కాప్షన్ పెట్టారు యూట్యూబర్ రాబ్ బెస్చిజ్జా.ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు ఇది నిజమైన వీడియో కాదనీ... రివర్స్ వీడియో అని తేల్చేశారు. తమను మోసం చేయలేరంటూ... అసలు నిజాన్ని బయటపెట్టారు. క్రమపద్ధతిలో ఉన్న మేకుల బాక్సును తీసుకొని... దాన్ని ఊపేసి... మేకుల్ని చిందరవందర అయ్యేలా చేశారు. ఇదంతా వీడియో తీసి... రివర్స్ చేశారు.ఇప్పుడీ యూట్యూబ్ వీడియో తప్పుడు వీడియో అయినప్పటికీ... ఇది వైరల్ అయ్యింది. చాలా మంది ముందుగా దీన్ని చూస్తున్నారు. ఆ తర్వాత అసలైన రివర్స్ కాని వీడియోను చూసి... ఇదా మేటరూ... అంటున్నారు. ఇంతకీ యూట్యూబ్ వీడియో అసలైనది కాదని ఎలా తేల్చారంటే... మామూలుగా బాక్సును ఆ వ్యక్తి తనకు దూరంగా... జరిపినప్పుడు... భూమివైపు జారాల్సిన మేకులు... పైకి జారాయి. అది గురుత్వాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి... నెటిజన్లు కనిపెట్టేశారు. నెటిజన్లు తెలివైన వారు... అని మరోసారి నిరూపించుకున్నారు.
Published by: Krishna Kumar N
First published: March 9, 2020, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading