హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వెంట్రుక వాసిలో తప్పించుకున్న జింక.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

వెంట్రుక వాసిలో తప్పించుకున్న జింక.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

జింక పైన దాడి చేస్తున్న మొసలి

జింక పైన దాడి చేస్తున్న మొసలి

Viral video:  అడవిలో జింక ఒకటి తన గుంపు నుంచి కాస్త దూరంగా వెళ్లింది. ఇంతలో దానికి దాహాం వేసినట్టుంది. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న నీళ్ల దగ్గరకు వెళ్లింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

సాధారణంగా మొసళ్లు ఎక్కువగా ఆగి ఉన్న నీళ్లలో ఉంటాయి. వాటికి నీళ్లలో ఉన్నప్పుడు బలం ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి నీళ్లు తాగడానికి వచ్చిన జీవులను వేటాడుతుంటాయి. కొన్నిసార్లు మొసళ్లు.. ఏనుగులు, చిరుతలు... వంటి బలమైన క్రూర జంతువులను కూడా నీళ్లలోనికి లాక్కెళ్లి చంపేస్తుంటాయి. మరికొన్నిసార్లు.. జింకలు, కోతులు, వీల్డర్ బీస్ట్ లు ఇతర జంతువులు అడవిలో నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు మొసళ్లు దాడులు చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు.. జీవులు వాటిని ఆహారమైతే.. మరికొన్నిసార్లు.. మొసలి బారి నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. అడవిలో ఒక జింకకు దాహాం వేసినట్టుంది. అది మెల్లగా దాని దగ్గరగా ఉన్న ప్రవహిస్తున్న నీటిదగ్గరకు చేరుకుంది. ఆ తర్వాత.. అక్కడ మెల్లగా నీళ్లను తాగుతుంది. ఇంతలో జింకను మొసలి (Crocodile) గమనించింది.వెంటనే దాని దగ్గరకు నీళ్లలోపలి నుంచి చేరుకుంది. దాని రాకను తొలుత పాపం.. జింక గమనించలేదు. అప్పుడు మొసలి మెల్లగా జింక దగ్గరకు వెళ్లింది.

ఈ క్రమంలో.. మెల్లగా అదినీళ్లు తాగేటప్పుడు దాడిచేయడానికి ప్రయత్నించింది. వెంటనే జింక మొసలిని గమనించి అమాంతంగాల్లో ఎగిరింది. మొసలి దాడి నుంచి వెంట్రుక వాసిలో బతికిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Virl video) మారింది.

ఇదిలా ఉండగా కర్ణాటకలో (karnataka) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివమొగ్గ జిల్లా భద్రావతి లోనిన బొమ్మన కట్టలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. బొమ్మన కట్టలో ఒక పాము ఇంటి ఆవరణలో కన్పించింది. దీంతో స్నేక్ సోసైటికి సమాచారం అందించారు. అయితే.. ఒక వ్యక్తి పామును పట్టుకున్నాడు.అక్కడ చుట్టుపక్కల ఉన్న వారంతా భయంభయంగా దాన్ని చూస్తున్నారు. ఇంతలో పామును పట్టుకున్నాక.. అతను దాన్ని ముద్దాడాలకున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

పాము ఒక్కసారిగా అతడిచేతిలో నుంచి ముఖంపై కాటు వేసింది. దీంతో అతను భయంతో పామును వదిలేశాడు. అక్కడున్న మరికొందరు భయంతో దూరంగా వెళ్లిపోయారు. అప్పుడు మరోక వ్యక్తి పామును బంధించాడు. వెంటనే పాముకాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crocodile, Viral Video

ఉత్తమ కథలు