మనం ఇంట్లో వంట వండుకుంటే చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. అదే.. ఏ కర్రీ పాయింట్కో వెళ్లి కొనుక్కుంటే.. వందలు వదిలిపోతాయి. ఇదే ఫార్ములా వస్తువులకూ వర్తిస్తోంది. మన దేశంలోని కొబ్బరిబోండాలు అమ్మే బండి దగ్గరకు వెళ్లి.. బోండం కొనుక్కుంటే దాని ధర మాగ్జిమం రూ.50లోపే ఉంటుంది. అదే కొబ్బరిబోండాను సూపర్ మార్కెట్లలో ప్యాకింగ్ చేసి ఉన్నది కొనుక్కుంటే.. దాని ధర రూ.100కు పైగానే ఉంటుంది. ఇక చుట్టూ చెక్కి.. మధ్యలో స్ట్రా పెట్టి.. ప్యాక్ చేసి.. ఆన్లైన్లో అమ్మే బోండం ధర రూ.500కు పైగానే ఉంటుంది. అందుకు ఎగ్జాంపుల్ ఈ బోండం.
ఇది థాయిలాండ్ బోండం. అక్కడ కొన్ని సంస్థలు.. బోండాలకు ఇలా గ్రీన్ తొక్కను తొలగించి.. ప్లాస్టిక్ పోర్ట్, స్ట్రా పెట్టి.. ప్యాక్ చేసి అమ్ముతున్నాయి. రెడీ టు డ్రింక్ అని చెబుతున్నాయి. బోండం కొనుక్కున్న వారు.. సీల్ తీసి తాగేయడమే అని ఊరిస్తున్నాయి. కానీ వాటి ధర మాత్రం ఆకాశంలో ఉంటోంది. ఈ బోండాలను మనం ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. నాలుగు బోండాలను ఒక ప్యాక్ కింద అమ్ముతున్నారు. నాలుగింటి ధర $28.99. అంటే మన రూపాయిల్లో.. రూ.2371. అంటే ఒక్క బోండం ధర రూ.592 పడుతోంది.
ఈ బోండంకి సంబంధించిన ఫొటోను రెడ్డిట్ యూజర్ ooxooshaweideifegiec .. నవంబర్ 26న పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. ఇవేమీ ప్రత్యేకమైన బోండాలు కావు. సాధారణమైనవే. కాకపోతే వీటిని ఆర్గానిక్ బోండాలు అని అమ్ముతున్నారు. ఆ మాటకొస్తే.. మన ఊళ్లలో అమ్మేవి కూడా ఆర్గానిక్ బోండాలే.
Birth Certificate : ఇకపై జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.. ఈ విషయాలు తెలుసుకోండి
ట్రేడ్ మంత్ర :
జపాన్ సహా చాలా ఆసియా దేశాల్లో పండిన పండ్లను అధిక ధరకు అమ్ముకోగలుగుతున్నారు అక్కడి రైతులు. ఆ విధంగా వారికి ప్రభుత్వాలు తగిన ట్రైనింగ్, మెళకువలు నేర్పుతున్నాయి. వ్యవసాయాన్ని వ్యాపారంలా ఎలా చేయ్యాలో నేర్పుతున్నాయి. ఫలితంగా అక్కడి రైతులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మన దేశంలో అలాంటి విప్లవాత్మక వ్యవసాయం రావట్లేదు. మన రైతులు ఇప్పటికీ పండిన పంటను ఎలా అమ్ముకోవాలో, ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. చాలా సందర్భాల్లో గిట్టుబాటు ధర రాక.. రోడ్డు పక్కన పారేస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఇది విచారకరమే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Thailand