ఈజీగా ఉల్లిపాయ తొక్క తీయడం ఎలా... వైరల్ వీడియో

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక... చాలా మంది కొత్త కొత్త టెక్నిక్స్ ట్రై చేస్తున్నారు. ఈ ఉల్లి లొల్లి... నెటిజన్లను బాగానే ఆకర్షిస్తోంది.

news18-telugu
Updated: June 22, 2020, 2:54 PM IST
ఈజీగా ఉల్లిపాయ తొక్క తీయడం ఎలా... వైరల్ వీడియో
ఈజీగా ఉల్లిపాయ తొక్క తీయడం ఎలా... వైరల్ వీడియో (credit - instagram)
  • Share this:
ఇప్పటివరకూ మనం ఉల్లిపాయల తొక్కలు తియ్యాలంటే... బలవంతంగా లాగడమో... అటు ఇటూ కదపడం ద్వారా... పై తొక్కను వదులుగా చేయడమో చేస్తున్నాం. నిజానికి ఉల్లి తొక్క తీయడం అంత తేలికేమీ కాదు. ఒక్కోసారి పై తొక్క తీస్తుంటే... మరో లేయర్ కూడా ఊడొచ్చేస్తుంది. అందువల్ల అనవసరంగా ఉల్లి వేస్టవుతుంది. దాని బదులు ఈజీగా ఉల్లి తొక్క ఎలా తియ్యాలో... ఓ నెటిజన్... చూపించాడు. ఇది నెటిజన్లకు బాగా నచ్చింది. భలే ఉంది... ఈజీ... అనుకుంటూ... అందరూ... అందరికీ షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్స్‌కి ఈ వీడియో బాగా నచ్చేస్తోంది. ఇంట్లో ఉంటూ... ఉల్లిపాయల తొక్కలు తియ్యలేకపోతున్నాం అనుకునే వారు... ఇదే సరైన ట్రిక్ అంటున్నారు.
@1sarahroseThis changed my life! thanks @james_rembo 🧅 ##foodhack ##kitchenhack ##onion ##keepingbusy

♬ original sound - 1sarahroseడెన్వర్‌కి చెందిన జేమ్స్ రెంబో... ఈ ట్రిక్ చేసి చూపించాడు. ఓ ఉల్లిపాయను రెండు ముక్కలుగా చేసి... ఓ సగ భాగంపై చేచితో కొట్టాడు. అంతే... సగం ఉల్లి రెండు ముక్కలై... పై తొక్క ఈజీగా వచ్చేసింది. టిక్ టాక్ యూజర్ సారా రోజ్... దీన్ని నెటిజన్లకు షేర్ చేశారు. అదే ఈ వీడియో.


రెంబో ఈ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. మొత్తానికి చిన్న ట్రిక్... ఎక్కువ మంది నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
First published: June 22, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading