Viral Video : ఇతని డ్యాన్స్ చూస్తే మైకేల్ జాక్సన్ కూడా అసూయ పడేవాడు..! ఇరగదీశాడంతే..

Photo Credit : Twitter

Viral Video : మీరు మొబైల్ ఉపయోగిస్తున్నారా? మొబైల్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయా? అయితే, వెంటనే ఈ వీడియోను చూసేయండి.

  • Share this:
    మీరు మొబైల్ ఉపయోగిస్తున్నారా? మొబైల్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయా? అయితే, వెంటనే ఈ వీడియోను చూసేయండి. సోషల్ మీడియా (Social Media)లో వేలాది వినోదాత్మక వీడియోలు కనిపిస్తుంటాయి. వాటిలో ఒకటి ఇది. అయితే, ఈ వీడియోకు ఒక ప్రత్యేకత ఉంది. టాలెంట్ ఎవరి సొత్తు కాదు..మనలో దాగి ఉన్న కళలు నిజంగా నిజాయితీ ఉంటె కచ్చితంగా గుర్తింపు దొరుకుంది..కానీ మన చుట్టూరా ఉన్నవాళ్లు మనల్ని గుర్తించకపోవచ్చు కానీ సోషల్ మీడియా ద్వారా చాలా మంది గుర్తింపు పొందుతున్నారు. అలాంటి కోవలోకే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి చెందుతాడు. అతడి చేసిన డ్యాన్స్ ఇస్తే వారెవ్వా అనాల్సిందే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎనర్జీ లెవల్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందుకే ఆయన డ్యాన్స్ పై అదిరిపోయే కామెంట్లు చేస్తున్నారు. మైకేల్ జాక్సన్ తో పోలుస్తున్నారు.

    మైకేల్ జాక్సన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ప్రస్తుతం ఈ లోకంలో లేకున్నా.. ఆయన పాటలు, బ్రేక్ డ్యాన్స్ అన్నీ బతికే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన పాటలకు డ్యాన్సులు వేస్తూ.. ఆయన వేసిన స్టెప్పులు వేస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటాం.ముఖ్యంగా.. మైకెల్ జాక్సన్.. డేంజరస్ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు.

    ఆ పాటకు మైకెల్ జాక్సన్ వేసిన స్టెప్పులు చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఆ పాటకు ఓ వ్యక్తి వేసిన డ్యాన్స్ చూసి అందరూ ఫిదా కావాల్సిందే. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని మరోసారి నిరూపితం అయింది. మైకెల్ జాక్సన్ అన్నలా ఉన్నాడే అంటూ అతడి డ్యాన్స్ చూసి అందరూ మైమరిచిపోతున్నారు. 1991 లో రిలీజ్ అయిన డేంజరస్ ఆల్బమ్.. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో రికార్డ్ సృష్టించింది. పాప్ సింగర్ మైకెల్ నుంచి వచ్చిన ఎనిమిదో ఆల్బమ్ అది.


    ఆ పాటకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిదా కాని వాళ్లు లేరు. జనరేషన్లు మారిన.. ఆ పాటకు ఉన్న క్రేజ్ కూడా తగ్గడం లేదు. ఇక లేటెస్ట్ గా ఆ పాటకు ఓ వ్యక్తి వేసిన డ్యాన్స్ చూస్తే.. మైకెల్ జాక్సన్ మళ్లీ పుట్టాడా అనిపిస్తుంది. నెటిజన్లు అయితే.. అదే అంటున్నారు. సూపర్ గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వ్యక్తికి ఎవరైనా అవకాశాలు ఇవ్వండి. ఇతని డ్యాన్స్ చూస్తే మైకేల్ జాక్సన్ కూడా అసూయ పడేవాడు. ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

    ఇక, వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే దాదాపు లక్ష మంది దాకా ఆ వీడియోను వీక్షించారు. వ్యూయ‌ర్స్ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అతడి డ్యాన్స్ కు లైకుల వర్షం కురుస్తూనే ఉంది.
    Published by:Sridhar Reddy
    First published: