HOME »NEWS »TRENDING »this pune restaurant is giving royal enfield bikes for finish this bullet thali ms

Viral: బుల్లెట్ గెలుచుకోవాలనుందా..? ఫుల్లుగా తింటే చాలు.. బైక్ ఇచ్చేస్తారు.. ఎక్కడో తెలుసా..?

Viral: బుల్లెట్ గెలుచుకోవాలనుందా..? ఫుల్లుగా తింటే చాలు.. బైక్ ఇచ్చేస్తారు.. ఎక్కడో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం

Pune Restaurant Thali Contest: 60 నిమిషాల వ్యవధిలో ఈ పోటీని పూర్తి చేయాలి. నాలుగు కిలోల మటన్ తో పాటు చికెన్.. రొయ్యలు వంటివి మొత్తం కలిపి.. గంట సేపట్లో ఆ ప్లేట్ ఖాళీ చేస్తే రూ. 1.65 లక్షల విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గెలుపొందొచ్చు.

  • News18
  • Last Updated: January 20, 2021, 15:58 IST
  • Share this:
    మీకు బుల్లెట్ బైక్ గెలుచుకోవాలనుందా..? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా..? అయినా ఆ కోరిక ఎవరికుండదు. ముఖ్యంగా యువతకైతే బుల్లెట్ బైకంటే క్రేజ్ మాములుగా ఉండదు. అయితే దాని ధర కూడా మామూలుగా ఉండదు మరి. సాధారణ బైక్ ల కంటే దాని ధర రెండింతలు అధికంగానే ఉంది. అయితే ఒక రెస్టారెంట్ మాత్రం మీకు ఉచితంగానే బుల్లెట్ బైక్ ను అందిస్తున్నది. మీరు చేయాల్సిందల్లా ఫుల్లుగా తినడమే. ఒక ప్లేట్ నిండా పెట్టిన ఆహార పదార్థాలను ఖాళీ చేస్తే చాలు... బుల్లెట్ మీ సొంతం.. ఇదెక్కడో విదేశాల్లో కాదు.. మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోనే...

    అసలు విషయానికొస్తే... పూణెకు చెందిన ఒక రెస్టారెంట్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పూణె శివార్లలోని వాడ్గావ్ మావల్ ప్రాంతంలో ఉణ్న శివరాజ్ హోటల్ నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఈ పోటీకి పేరు ‘విన్ ఎ బుల్లెట్ బైక్’. దీని ప్రకారం... ఒక ప్లేట్ లో 12 రకాల వంటలుంటాయి. అందులో చికెన్ తందూరి, మటన్ కర్రీ, ఫ్రైడ్ ఫిష్, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, రొయ్యుల బిర్యానీ వంటివి ఉంటాయి. దీనిని బుల్లెట్ థాలి అంటారు.



    60 నిమిషాల వ్యవధిలో ఈ పోటీని పూర్తి చేయాలి. నాలుగు కిలోల మటన్ తో పాటు చికెన్.. రొయ్యలు వంటివి మొత్తం కలిపి.. గంట సేపట్లో ఆ ప్లేట్ ఖాళీ చేస్తే రూ. 1.65 లక్షల విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గెలుపొందొచ్చు. సాధారణంగా అయితే ఈ థాలి ధర రూ. 2,500.

    ప్రతీకాత్మక చిత్రం


    స్థానికంగా ఫేమస్ అయిన ఈ హోటల్ లో బుల్లెట్ థాలి తో పాటు స్పెషల్ రావణ్ థాలి.. మల్వాని ఫిష్ థాలి, పహెల్వాన్ మటన్ థాలి, బకాసూర్ చికెన్ థాలి, సర్కార్ మటన్ థాలి వంటివి ఉంటాయి. 8 కిలోలున్న రావణ్ థాలిని గంటలోనే పూర్తి చేయాలి. దీని ధర రూ. 5 వేలు. కాగా.. బుల్లెట్ థాలిని సోలాపూర్ జిల్లాకు చెందిన సోమనాథ్ పవార్ రాయల్ ఎన్ఫీల్డ్ గెలుచుకున్నాడు.
    Published by:Srinivas Munigala
    First published:January 20, 2021, 15:55 IST