• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • THIS POOR MAN GIVEN HIS ONLY ONE MASK TO HIS LOVED DOG VIDEO GETTING VIRAL IN SOCIAL MEDIA FULL DETAILS HERE HSN GH

Viral Video: ఇది నా బిడ్డ.. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ.. దీనికేం కాకూడదంటున్న ఈ వ్యక్తి వీడియోకు నెటిజన్లు ఫిదా..!

Viral Video: ఇది నా బిడ్డ.. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ.. దీనికేం కాకూడదంటున్న ఈ వ్యక్తి వీడియోకు నెటిజన్లు ఫిదా..!

శునకాన్ని భుజాలపై మోసుకెళ్తున్న వ్యక్తి

మీ దగ్గర ఒకే ఒక్క మాస్కు ఉందనుకోండి. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా దాన్ని ఎవరికైనా ఇచ్చేసి మీరు మాస్కు లేకుండా బయట తిరుగుతారా? కానీ ఓ వ్యక్తి మాత్రం విభిన్నంగా ప్రవర్తించాడు.

  • Share this:
కుక్కకున్న విశ్వాసం మ‌నిషికి కూడా ఉండ‌ద‌ని అంటుంటారు. కానీ ఈ వీడియో చూస్తే మ‌నిషికి కూడా ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుంది. అందుకే సోష‌ల్ మీడియా‌లో ఈ వీడియో వైర‌ల్ అయ్యింది. చూడ‌టానికి నిరుపేదలా క‌నిపించే ఒక వ్యక్తి త‌న ద‌గ్గరున్న ఒకే ఒక మాస్క్‌ను తాను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కుక్క‌కు ఇచ్చేశాడు. ప్ర‌పంచ‌మంతా ప‌ట్టించుకోక‌పోయినా ఈ కుక్క మాత్రం త‌న క‌ష్టాల్లో, సంతోషాల్లో తోడుందేమో గానీ దాని కంటే విశ్వాసంగా ఈ య‌జ‌మాని ప్ర‌వ‌ర్తించాడు. క‌రోనా భ‌యంతో ఎవరికి వారు త‌మ ప్రాణాల‌కు ముప్పు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంటే ఇత‌ను మాత్రం త‌న ప్రాణం పోయినా ఫ‌ర్వాలేదు నా కుక్క బ‌తికుండాల‌ని కోరుకుంటున్నాడు.

గ‌తేడాది క‌రోనా విజృంభించిన‌ప్పుడు ఇళ్ల‌కే ప‌రిమితమై త‌మ పెంపుడు జంతువుల విశేషాల‌ను సోష‌ల్ మీడియాలో నింపేశారు చాలా మంది. ఇప్పుడు రెండో విడ‌త క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంటే మ‌రోసారి హృద‌యానికి హ‌త్తుకునే పోస్టుల‌తో సామాజిక మాధ్య‌మాలు నిండుతున్నాయి. ఒక‌వైపు ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ పెట్టాల్సి వ‌స్తుందేమోన‌ని కంగారు ప‌డుతుంటే, మ‌రోవైపు వ‌ల‌స కూలీలు ఇంకోసారి ఖాళీ క‌డుపుతో తిరుగు ప్ర‌యాణానికి స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. ఇలాంటి త‌రుణంలో త‌న కుక్క‌ను భుజానికెత్తుకొని రోడ్డు వెంట న‌డుస్తున్న ఒక వ్య‌క్తి ఈ వీడియోలో ప్ర‌త్యేకంగా క‌నిపించాడు.

ముఖానికి మాస్క్ వేసుకున్న శున‌కాలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవ్వ‌డం ఇదే మొద‌టిసారి కాక‌పోవ‌చ్చు. రెండో విడ‌త క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ర‌ణ‌ మృదంగం మోగిస్తుంటే త‌మ పెంపుడు జంతువుల‌నూ ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. గ‌తేడాది, ఆగ‌స్టులో ఈక్వెడ‌ర్ లోని అంబాటో ప్రాంతంలో ఒక యువ‌కుడు త‌న పెంపుడు కుక్క‌కు ఫేస్ మాస్క్ ధ‌రించే వీడియో ఇలాగే అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో అంద‌ర్ని క‌దిలించింది. అయితే ప్ర‌స్తుతం మాట్లాడుకుంటున్న ఈ వైర‌ల్‌ వీడియోలోనూ హృద‌యాన్ని క‌దిలించే స‌న్నివేశం ఉంది.ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన‌ ఈ వీడియో ‌సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో చూడ‌టానికి పేద కుటుంబానికి చెందిన‌ట్లుగా ఉన్న పెద్ద‌వ‌య‌సు వ్య‌క్తి ఒక‌రు, కుక్క‌ను భుజానికెత్తుకొని వెళ్తున్నాడు. ఆ శున‌కం మూతికి మాస్క్ వేసి ఉంది గానీ ఇత‌ను మాస్క్ ధ‌రించ‌లేదు. ఈ వీడియో తీసిన వ్య‌క్తి దీని గురించే అడుగుతాడు. కుక్క‌కి మాస్క్ వేసి, నువ్వెందుకు వేసుకోలేద‌ని అడుగుతాడు. ఆ బాట‌సారి హిందీలో స‌మాధానం చెబుతూ‌, `ఇది నా బిడ్డ‌. నాకు ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు గానీ వీడికి మాత్ర‌ం ఎలాంటి హానీ జ‌రగ‌కూడ‌దు` అంటాడు. `నేను చ‌చ్చిపోయినా, నా కుక్కను మాత్రం చ‌చ్చిపోనివ్వ‌ను` అనే ఇత‌ని మాట‌లు మ‌న‌సుకు హ‌త్తుకుంటున్నాయి. త‌న కుక్క‌పై అత‌నికి ఉన్న ప్రేమ‌ను చూసి నెటిజ‌న్లు గుండె ద్ర‌వించింది. వీడియోపై లైక్‌లు, కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది.
ఇది కూడా చదవండి: ఓ ఇంటి ముందు టెంటు వేసి.. కుర్చీలో కూర్చుని కూలింగ్ వాటర్ తాగుతూ నిరసన.. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!
First published:

అగ్ర కథనాలు