ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పుట్టిన ఏడాదికే నెలకు రూ.75వేలు సంపాదిస్తున్నాడు

వరల్డ్ ట్రావెల్ చేస్తూ నెలకు రూ.75వేలు సంపాదిస్తున్న బుడతడు. (Image Credit: whereisbriggs /Instagram)

ఈ బుడ్డోడి తల్లి జెస్.. తన కొడుకును సోషల్ మీడియాలో పరిచయం చేసింది. ఆమె ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడి వింత, విశేషాలపై పార్ట్ టైమ్ టూరిస్ట్స్ బ్లాగ్స్ రన్ చేస్తుంటుంది. ప్రపంచాన్ని చుట్టేయాలన్నిది ఆమె కోరిక.

 • Share this:
  Baby travel influencer : సాధారణంగా చిన్నారులు ఏం చేస్తుంటారు. తల్లిఒడిలో ఆడుకుండూ, ఆకలైతే ఏడుస్తుంటారు. పాలు పట్టించగానే హాయిగా నిద్రపోతారు. కానీ ఈ బుడ్డోడు మాములోడు కాదు. పుట్టిన ఏడాదిలోపే నెలకు రూ.75వేలు సంపాదిస్తున్నాడు. నమ్మశక్యంగా లేదు కదా.. కానీ నిజమే.. అందుకే వీడు సామాన్యుడు కాదని అందరూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన ‘జెస్’ దంపతులకు అక్టోబర్ 14-2020లో బేబి బ్రిగ్స్ జన్మించాడు. ప్రస్తుతం బ్రిగ్స్‌కు సంవత్సరం వయస్సు.. అతనికి ఇన్ స్టాగ్రామ్‌లో 30 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్ అకౌంట్‌లోని తన వీడియోలకు 2లక్షల 80 వేల లైక్స్ ఉన్నాయి. ఏడాది వయస్సులోనే అమెరికా మొత్తం చుట్టేసి బాగా పాపులర్ అయ్యాడు.

  ఈ బుడ్డోడి తల్లి జెస్.. తన కొడుకును సోషల్ మీడియాలో పరిచయం చేసింది. ఆమె ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడి వింత, విశేషాలపై పార్ట్ టైమ్ టూరిస్ట్స్ బ్లాగ్స్ రన్ చేస్తుంటుంది. ప్రపంచాన్ని చుట్టేయాలన్నిది ఆమె కోరిక. అయితే, 2020లో ఆమె గర్భవతి కావడంతో తన కెరీర్ అయిపోయిందని బాధపడిందట.. కానీ తన భర్త ప్రోత్సాహంతో ఏడాది వయస్సున్న బేబి బ్రిగ్స్‌తో తన జర్నీ ప్రారంభించింది.

  గూగుల్ సాయం చేయలేదు...

  బేబీతో ఎలా ట్రావెల్ చేయాలని గుగూల్‌లో వెతకగా ఆమెకు సమాచారం దొరకలేదు.కానీ, ధృడ సంకల్పంతో బేబీతో జర్నీ ప్రారంభించింది. ఏదిఏమైనా చిన్నారితోనే తన ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకుంది. అలా జర్నీ చేస్తూ చిన్నారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చేది. దీంతో క్రమంగా ఫాలోవర్లు పెరిగిపోయారు. లక్షలాది లైక్స్ కూడా వచ్చాయి. దీంతో బేబీ బ్రిగ్స్ ఫేమస్ అయిపోయాడు. స్పాన్సర్ షిప్ కూడా లభించింది. దీంతో ఈ బుడ్డోడు తన వీడియోల ద్వారా ప్రస్తుతానికి నెలకు రూ.75వేలు సంపాదిస్తున్నాడు. వీడికి డైపర్స్ కూడా స్పాన్సర్ చేసేవారు ఉన్నారట..

  భర్త స్టీవ్ ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైందని జెస్ తెలిపింది. కరోనా లాక్‌డౌన్ టైంలోను అనేక జాగ్రత్తలు తీసుకుని పర్యటనలు జరిపారు తల్లి జెస్, బేబీ బ్రిగ్స్.. కానీ, రద్దీగా ఉండే న్యూయార్క్‌ వంటి సిటీల్లో వీరు పర్యటించలేదు. ఈ బుడ్డోడు ఇప్పటివరకు అలాస్కాలోని ఎలుగుబంట్లు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లోని తోడేళ్ళు, ఉటాలోని సున్నితమైన వంపు మరియు కాలిఫోర్నియాలోని బీచ్‌లను చూశాడు. త్వరలోనే యూరప్ అందాలు, లండన్ సిటీని చూసేందుకు రెడీ అవుతున్నాడు ఈ ట్రావెల్ రారాజు బేబీ బ్రిగ్స్.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: