• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • THIS MINI FOLDING CHAIR SHAPED BAG IS BEING SOLD ONLINE FOR RS 67000 KNOW THE REASON BEHIND THIS RATE SK GH

Chair Shaped bag: ఈ హ్యాండ్‌ బ్యాగు ధర రూ.67 వేలు.. ఎందుకంత రేటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

Chair Shaped bag: లెక్సీ బ్రౌన్‌ అనే నెటిజన్‌కు విచిత్రమైన వస్తువుల వివరాలను సేకరించి, ట్వీట్‌ చేయడం అలవాటు. అందులో భాగంగానే ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ ఫొటోను ట్వీట్‌ చేశారు. దీని పేరు పేవ్‌ చెయిన్‌ బ్యాగ్‌.

  • Share this:
కొన్ని అద్భుతాలను చూసినప్పుడు మన మెదడు ఒక 10 సెకన్లు బ్లాక్‌ అయిపోద్ది అని ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ వార్త చదివితే మీకు కూడా అలాంటి ఫీలింగ్‌ కలుగుతుంది. ఎలాంటి వస్తువులు పెట్టుకోలేని అతి చిన్న హ్యాండ్ బ్యాగు ఏకంగా రూ.67 వేల ధర పలుకుతోంది. అసలు హ్యాండ్ బ్యాగుకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా దీనికి లేకపోవడం విశేషం. అది ఒక రకమైన బొమ్మ బ్యాగు. ఇనుప కుర్చీ ప్రతిరూపాన్ని చిన్న సైజులో రూపొందించి అమ్మకానికి పెట్టారు. దీన్ని హ్యాండ్ బ్యాగు మాదిరిగా తీసుకెళ్తున్నారు. ఇటీవల ట్విటర్‌లో వైరల్ అయిన ఒక వైరల్ పోస్టు తరువాత దీని గురించి పూర్తి వివరాలు తెలిశాయి.

ఒక చిన్న కుర్చీ బొమ్మను మెడలో వేసుకున్న అమ్మాయి ఫోటో ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. పరిశీలించి చూస్తే.. ఆ కుర్చీ బొమ్మ ఎందుకూ పనికిరాని హ్యాండ్‌బ్యాగు అని తెలుస్తోంది. దీని ధర 895 డాలర్లు అని రాసి ఉంది. దీంతో ఒక హ్యాండ్‌ బ్యాగు, అందులోనూ ఏమీ దాచుకోవడానికి పనికిరాని దానికి అంత రేటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ బ్యాగ్‌కు క్రిస్టల్స్‌ అతికించి ఉన్నాయి. అందుకే అంత ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది.

లెక్సీ బ్రౌన్‌ అనే నెటిజన్‌కు విచిత్రమైన వస్తువుల వివరాలను సేకరించి, ట్వీట్‌ చేయడం అలవాటు. అందులో భాగంగానే ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ ఫొటోను ట్వీట్‌ చేశారు. దీని పేరు పేవ్‌ చెయిన్‌ బ్యాగ్‌. తాను ఇప్పటి వరకు వెతికి పట్టుకున్న చిత్రమైన వస్తువు ఫొటోల్లో ఇదే బెస్ట్‌ అని చెబుతున్నారు లెక్సీ బ్రౌన్‌. న్యూయార్క్ ఫ్యాషన్‌ వీక్‌లో ఓ మోడల్‌ దీన్ని ధరించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. ఈ కుర్చీ హ్యాండ్ బ్యాగుకు కొన్ని రకాల క్రిస్టల్స్‌ అతికించడం వల్ల, అది మెరుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ట్వీట్‌ను పెద్ద ఎత్తున నెటిజన్లు రిట్వీట్ చేస్తున్నారు.




ట్వీట్‌తో పాటు దానికి వస్తోన్న కామెంట్లు కూడా ఫన్నీగా ఉన్నాయి. ఇలాంటి వింత హ్యాండ్ బ్యాగును ఇప్పటి వరకు చూడలేదని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మనసుపెట్టి వెతకాలే కానీ ఇలాంటి అద్భుతాలు అంతర్జాలంలో చాలా కనిపిస్తాయని నెటిజన్లు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: