Viral video: ఇండియాలో కరోనా వచ్చిన కొత్తలో మనకు శానిటైజర్ల కొరత ఏర్పడింది. చాలా మంది ఎంత రేటైనా పర్లేదు ఇవ్వండి అని ఎక్కువ రేటు పెట్టి మరీ కొనుక్కున్న రోజులు అవి. ఇప్పుడు శానిటైజర్లు చాలా చోట్ల ఉన్నాయి. షాపింగ్ మాళ్లు, రైల్వే స్టేషన్లు, గుళ్లు, ఏటీఎం కేంద్రాలు ఇలా చాలా చోట్ల సెట్ చేస్తున్నారు. వాటిని మనం ముట్టుకోకుండా... కాలితో తొక్కితే శానిటైజర్ బయటకు వచ్చేలా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇంత చేసినా కొంత మంది దొంగ బుద్ధి చూపిస్తున్నారు. ఏదో ఒక రకంగా శానిటైజర్లు ఎత్తుకుపోతున్నారు. కక్కుర్తి గాళ్లు అనిపించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏటీఎంలలో మనీ చోరీలు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి... ఏటీఎంలోకి వచ్చి... డబ్బు డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత అతని కన్ను పక్కనే ఉన్న శానిటైజర్ బాటిల్‌పై పడింది. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు ఏటీఎం కేంద్రాల్లో సెక్యూరిటీని ఉంచట్లేదు. అక్కడ కూడా సెక్యూరిటీ ఎవరూ లేరు. దాంతో... ఆల్రెడీ నా ముఖానికి మాస్క్ ఉంది... కాబట్టి నన్ను ఎవరూ గుర్తు పట్టలేరు అనుకున్నాడు. వెంటనే ఆ శానిటైజర్ బాటిల్ తీసుకొని తన బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనివాడిలా బయటకు వెళ్లిపోయాడు. ఇదంతా ఏటీఎం సెంటర్‌లోని సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో మీరూ చూడండి.
ఈ వీడియోని IPS ఆఫీసర్ దీపాన్షు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి వాళ్లు ఉంటే... శానిటైజర్లను కూడా సెక్యూర్‌గా ఉంచుకోవడానికి వాటి చుట్టూ ఓ బోను లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. అందుకు రూ.200 నుంచి రూ.300 దాకా అవుతుంది. అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Not same but similar thing happened with me, I was at the bookstore and sanistised my material and kept my sanitiser there only, someone came and had sanitiser with them but took my sanitiser and sprayed all over the body saying yar free ka hai and I was like.. ??
— Nivedita (@basic_struggler) April 30, 2021
ఇది కూడా చదవండి: Covid 19: వామ్మో... ఆ సిగరెట్ పొగతో... 18 మందికి కరోనా పాజిటివ్... ఎలాగంటే...
అతని కనిపెట్టడం చాలా ఈజీ:
అతను ఎవరు అన్నది పోలీసులు, బ్యాంకు ఈజీగా కనిపెట్టగలవు. ఎలా గంటే... అతను చోరీ చేసే ముందు డబ్బు డ్రా చేసుకున్నాడు కదా. సో... ఆ టైమ్‌లో ఆ ఏటీఎంలో ఎవరు డబ్బు డ్రా చేశారో వివరాలు బ్యాంక్ సర్వర్‌లో ఉంటాయి. తద్వారా డబ్బు డ్రా చేసిన వ్యక్తి అకౌంట్ వివరాలు వచ్చేస్తాయి. వాటి ఆధారంగా అతను ఎవరో తెలిసిపోతుంది. అతని మొబైల్ నంబర్ కూడా తెలుస్తుంది. దాంతో... పోలీసులు అతని ఎలాగైనా పట్టుకోగలరు. ఆ తర్వాత ఈ చోరీ కేసులో జైల్లో పెట్టగలరు. సింపుల్ లాజిక్ మిస్సయ్యాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Viral Video