హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

యూట్యూబ్‌లో ఎక్కువ సంపాదిస్తున్నది ఎవరో తెలుసా?

యూట్యూబ్‌లో ఎక్కువ సంపాదిస్తున్నది ఎవరో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పుడు ప్రపంచంలో చాలా మందికి యూట్యూబ్ ఛానెల్ ఉంది. చాలా మంది దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

యూట్యూబ్‌కి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టిక్ టాక్ లాంటి షార్ట్ వీడియో మెసేజ్ సర్వీసులు వచ్చినా... యూట్యూబ్ తన మార్క్ చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం సినిమాలు, ట్రైలర్లు, షోలు, ఆర్టిస్టుల ప్రతిభ, చిన్నారులు, వంటలు ఇలా అన్ని రకాల అంశాలపై యూట్యూబ్‌లో వీడియోలున్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది యూట్యూబ్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. దానిపైనే సంపాదిస్తూ... హాయిగా బతుకుతున్నా్రు. మరి ప్రపంచంలో యూట్యూబ్ ద్వారా అత్యంత ఎక్కువగా సంపాదిస్తున్నది ఎవరా అని చూస్తే... ప్యూడైపై (PewDiePie) అని తెలిసింది. ఆయన అసలు పేరు ఫెలిక్స్ క్జెల్బెర్గ్. ఆయన ఛానెల్‌కు 10 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గేమ్స్‌ రివ్యూ చేస్తూ... ఈయన... ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నారు. యూట్యూబ్‌లో వెయ్యి కోట్ల వ్యూస్... ఫెలిక్స్ సొంతం.

ఫెలిక్స్ యూట్యూబ్ ఛానెల్ (credit - YT - PewDiePie)

ఇండియాలో యూట్యూబ్ ద్వారా నెలకు రూ.40 లక్షలు సంపాదిస్తున్నారు మధులిక. తను చేసే వంటల్ని యూట్యూబ్‌లో పెడుతున్నారు ఆమె. ఇక వారెవ్వా చెఫ్‌గా గుర్తింపు పొందిన సంజయ్ తుమ్మ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తన వీడియోల ద్వారా నెలకు రూ.20 లక్షల దాకా సంపాదిస్తున్నారు.

యూట్యూబే కాదు. ట్విట్టర్ ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. ఇందుకు మన అకౌంట్‌కి కనీసం 50 మంది ఫాలోయర్లు ఉండాలి. మీకు తెలుసా... మన బాలీవుడ్ నటుల్లో చాలా మంది తాము పెట్టే ట్వీట్ల ద్వారా రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ట్విట్టర్‌లో అత్యంత ఖరీదైన ట్వీట్లు ఎవరివంటే... అమెరికా నటుడు ఛార్లీ షీన్ వే. ఆయన ఒక్కో ట్వీట్‌కి రూ.32 లక్షలు తీసుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో యూట్యూబ్, ట్విట్టర్... ఎంతో మందికి మనీ వచ్చేలా చేస్తున్నాయి. ఇంకెందుకాలస్యం... మీరు కూడా మీ యూట్యూబ్ అకౌంట్ ద్వారా డబ్బు సంపాదించండి. సంచలనాలు సృష్టించండి.

First published:

Tags: Twitter, Youtube

ఉత్తమ కథలు