HOME »NEWS »TRENDING »this man has been licking atm machines in live videos to prove coronavirus is not dangerous gh srd

Coronavirus: కరోనా అబద్ధమని చెప్పేందుకు వింత ప్రవర్తన.. కేసు నమోదు చేసిన పోలీసులు

Coronavirus: కరోనా అబద్ధమని చెప్పేందుకు వింత ప్రవర్తన.. కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం

Coronavirus: కరోనా మహమ్మారి వెలుగు చూసి ఒక సంవత్సరం దాటింది. అయినా వైరస్‌పై ప్రజల్లో అపోహలు పూర్తిగా పోలేదు. తాజాగా ఒక వ్యక్తి కరోనా వైరస్ ప్రమాదకరం కాదని నిరూపించేందుకు వింతగా ప్రవర్తించాడు.

  • Share this:
కరోనా మహమ్మారి వెలుగు చూసి ఒక సంవత్సరం దాటింది. అయినా వైరస్‌పై ప్రజల్లో అపోహలు పూర్తిగా పోలేదు. తాజాగా ఒక వ్యక్తి కరోనా వైరస్ ప్రమాదకరం కాదని నిరూపించేందుకు వింతగా ప్రవర్తించాడు. ఏటీఎం మిషన్‌ కీబోర్డులను నాకుతూ, వైరస్ వ్యాపించినా ఎవరికీ ఏమీ కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ వింత ప్రవర్తనను అతడు ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో స్ట్రీమింగ్ కూడా చేశారు. కాసేపటి తరువాత వీడియోను ఫేస్‌బుక్‌ నుంచి డిలీట్ చేశాడు. ఈ సంఘటన ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ ప్రాంతంలో జరిగింది. ఈ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సౌత్ యార్క్‌షైర్‌ పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకొని ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. ఆ తర్వాత కీబోర్డులోని ప్రతి కీని నాకుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ వ్యక్తిని ఇంకా గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ వీడియోలో అనుమానితుడు మరికొన్ని విషయాలు చెప్పాడు. లాక్ డౌన్ ప్రరంభమైనప్పటి నుంచి ప్రతిరోజూ బయటకు వెళ్తున్నానని, రెండు ఏటీఎం మెషిన్లలో అన్ని కీలను నాకినట్లు అతడు చెప్పాడు. ఈ వీడియో చూసిన ఒక వ్యక్తి, దీని గురించి సౌత్ యార్క్ షైర్ పోలీసులకు చెప్పారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ముందు దర్నాల్‌ ప్రాంతంలో ఒక క్యాష్ మెషిన్‌ కీబోర్డులను నాకాడని, ఆ తరువాత వేరే ఏటీఎంకు వెళ్లాడని ఒక మహిళ చెప్పింది. దీన్ని రికార్డు చేసి, వీడియోను ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేశాడని ఆమె తెలిపింది.

* గతంలోనూ జరిగాయి


గత వారం కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. గ్లౌసెస్టర్ షైర్‌లో ఒక మహిళ కరోనావైరస్ ఒక అబద్ధం అని ఆసుపత్రిలో ప్రచారం చేసింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇలాంటిదే మరో సంఘటన కూడా జరిగింది. ఒక మహిళ విమానంలోని టాయిలెట్ సీటును నాకుతూ వీడియో తీసింది. దీన్ని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసి, కొత్తగా కరోనావైరస్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. తనలాగే అందరూ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని వీడియోలో కోరింది. ఆ తరువాత ఆమె అస్వస్థతకు గురైంది.

* అందుకే కేసుల్లో పెరుగుదల
మరో సంఘటనలో ఇద్దరు వ్యక్తులు వింతగా ప్రవర్తించిన సంఘటన సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యింది. ఒక దుకాణంలో ఇద్దరు వ్యక్తులు వారి చేతులను నాకుతూ, అదే చెయ్యితో ఫ్రిజ్‌ హ్యాండిల్స్‌ పట్టుకుంటున్నట్లు రికార్డ్ అయ్యింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వాల్ మార్ట్ లోపల వస్తువులను నాకుతూ, వీడియోలు తీసిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జలుబు, ఫ్లూ మాదిరిగానే కరోనావైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి ద్వారా, రోగుల లాలాజలం ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని డాక్టర్లు, వైద్య నిపుణులు చెబుతున్నా పాశ్చాత్య దేశాల ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అక్కడ కేసులు, కోవిడ్ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Published by:Sridhar Reddy
First published:January 27, 2021, 17:46 IST