హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Robot For Dog: కుక్కకు సహాయంగా రోబో.. లక్నో యువకుడి ఘనత.. ఫిదా అవుతున్న నెటిజన్లు

Robot For Dog: కుక్కకు సహాయంగా రోబో.. లక్నో యువకుడి ఘనత.. ఫిదా అవుతున్న నెటిజన్లు

చాలా సందర్భాల్లో గాయాలతో ఉన్న కుక్కలను చూసి చూడనట్లు వెళ్తుంటాం. కానీ, లక్నోకు చెందిన ఒక వ్యక్తి మాత్రం అందరిలా ఆలోచించకుండా, ఆ కుక్కను అక్కున చేర్చుకున్నాడు. దాని సంరక్షణకు ఏకంగా ఒక గొప్ప కార్యాన్నే చేపట్టాడు.

  కుక్క అంటే విశ్వాసానికి ప్రతీక. ఇది మనిషికి తోడుగా ఉంటూ అనేక విధాలుగా తన విశ్వాసాన్ని చూపిస్తుంది. అయితే, కొంతమంది మనుషులు మాత్రం కుక్కపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎక్కడైనా కుక్క కనిపిస్తే చాలు దాన్ని గాయపరుస్తుంటారు. ఇటువంటి సంఘటనలు మన చుట్టు పక్కల జరుగుతూనే ఉంటాయి. మనం కూడా చాలా సందర్భాల్లో గాయాలతో ఉన్న కుక్కలను చూసి చూడనట్లు వెళ్తుంటాం. కానీ, లక్నోకు చెందిన ఒక వ్యక్తి మాత్రం అందరిలా ఆలోచించకుండా, ఆ కుక్కను అక్కున చేర్చుకున్నాడు. దాని సంరక్షణకు ఏకంగా ఒక గొప్ప కార్యాన్నే చేపట్టాడు.

  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన మిలింద్ రాజ్ అనే యువకుడికి లాక డౌన్ సమయంలో రోడ్డు పక్కన గాయాలతో ఉన్న జోజో అనే ఒక కుక్క కనిపించింది. దీంతో చలించిపోయిన మిలింద్ ఆ కుక్కను వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. వైద్య పరీక్షల్లో ఆ కుక్క చెవిటి, గుడ్డిదని తేలింది. అంతేకాక, మనుషులు దగ్గరకు వస్తే అది భయానికి లోనవుతుందని డాక్టర్లు చెప్పారు.

  దీంతో ఆ కుక్క అవసరాలు తీర్చేందుకు తనకున్న పరిజ్ఞానంతో లాక్ డౌన్ లో ఒక రోబోట్ ని తయారు చేశాడు. ఈ రోబోతో జోజోకు పునర్జన్మ లభించిందని చెప్పవచ్చు. మిలింద్ ఇంట్లో లేనప్పుడు రోబో జోజోకు సహాయకారిగా ఉంటుంది. జోజోకు ఆహారం వడ్డిస్తుంది. అంతేకాక, దాని ఆరోగ్యాన్ని ఎల్లవేళలా మానిటర్ చేస్తుంది. ప్రతి క్షణం జోజోను ఓ కంట కనిపెడుతూ దానికి రక్షణగా నిలుస్తుంది.

  భయం పోగొట్టాలనే అలా..

  కుక్క కోసం రోబో తయారీపై మిలింద్ రాజ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘‘కోవిడ్–19 మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో రోడ్డు పక్కన గాయాలతో ఉన్న ఈ కుక్కను కనుగొన్నాను. వెంటనే దాన్ని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాను. డాక్టర్ దాని పరిస్థితి గురించి నాకు వివరించారు. జోజో నాతో పాటు మనుషులు ఎవరు దగ్గరికొచ్చినా భయపడుతుంది. కాబట్టి, దానికి ఆహారం వడ్డించడానికి, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి స్వయంగా ఒక రోబోను తయారు చేశాను.” అని పేర్కొన్నాడు.

  జోజో ఆరోగ్యంపై వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ “జోజోకు క్రమం తప్పకుండా మందులు వేస్తే కంటి చూపు మెరుగవుతుంది. క్రమంగా దాని ఆరోగ్యం కూడా బాగవుతుంది. మిలింద్ చేసిన పని అభినందనీయం. అతడు జోజోను జాగ్రత్తగా చూసుకోవాలని ఆశిస్తున్నాము.”అని అన్నాడు. కాగా, రోబో జోజోకు ఆహారం వడ్డిస్తున్న వీడియోను మిలింద్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మిలింద్ ని అభినందిస్తున్నారు.

  First published:

  Tags: Dog, Lucknow, Robot, Trending, Twitter, Up news, Viral

  ఉత్తమ కథలు