హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

‘జీవితమంతా చదివి చదివి ముసలోడినైపోతా..’.. గుక్కపెట్టి ఏడుస్తున్న బాలుడు.. ఫన్నీ వీడియో వైరల్..

‘జీవితమంతా చదివి చదివి ముసలోడినైపోతా..’.. గుక్కపెట్టి ఏడుస్తున్న బాలుడు.. ఫన్నీ వీడియో వైరల్..

క్యూట్ గా ఏడుస్తున్న పిల్లాడు

క్యూట్ గా ఏడుస్తున్న పిల్లాడు

Viral video: పిల్లాడు హింది బుక్స్ చేతిలో పట్టుకుని బెడ్ మీద కూర్చుని హోమ్ వర్క్ చేస్తున్నాడు. ఇంతలో అతనికి కంట్రోల్ చేసుకోలేనంత ఏడుపు వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

మనలో చాలా మంది చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు ఎన్నోరకాలుగా నచ్చ చెప్పి స్కూల్ కు పంపిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లడం, స్కూల్ లో ఇచ్చిన హోమ్ వర్క్ చేయడం అంటే కష్టంగా ఫీలవుతుంటారు. కొన్నిసార్లు.. స్కూల్ కు వెళ్లమని, హోమ్ వర్క్ చేయమంటూ చిన్నారులు ఏడుస్తుంటారు. మరికొందరు పిల్లలైతే తల్లిదండ్రులకు కూడా వినరు. కోపంలో ఏదో ఒకటి అంటుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒక పిల్లాడికి అతని తల్లి కూర్చుండబెట్టి హోమ్ వర్క్ చేయిస్తుంది. అయితే.. అతను బెడ్ మీద కూర్చున్నాడు. తల్లిపక్కన కూర్చుని హింది రాయాలని చెబుతుంది. పాపం.. బుడ్డోడికి ఎక్కడలేని ఫ్రస్టేషన్ వచ్చింది. కోపంలో.. తన తల్లితో, "జిందగీ భర్ పధై కర్తే కర్తే బుద్ధ హో జౌంగా (నా జీవితాంతం చదువుతూనే నేను ముసలివాడవుతాను)" అంటూ ఏడ్చేశాడు.

గుల్జార్ సాహబ్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో బాలుడు ఏడుస్తు తన పెన్సిల్, నోట్‌బుక్‌తో కూర్చున్నట్లు కన్పిస్తుంది. అంతే కాకుండా అతను కోపంలో తల్లినే.. కోప్పడటం కూడా కన్పిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు .

ఇదిలా ఉండగా ముంబైలోని వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మధ్య ముంబాయిలో కొంత మంది క్యాబ్ డ్రైవర్లు తమ సీటు వెనకాల తమను భయ్యా అనిగానీ, అంకుల్ అని పిలవోద్దని రాసి మరీ పేస్ట్ చేశారు. అంతే కాకుండా.. తమ పేర్లతో పిలవాలని కూడా దానిలో సూచించారు.

అయితే.. ఇప్పుడు ఈ సీటువెనుకాల ఉన్న నోట్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు ఒక రేంజ్ లో కామెంట్ లు చేస్తున్నారు. కొన్నిసార్లు... ‘టీనేజ్ అమ్మాయిలు కారులో ఎక్కే చాన్స్ ఉంది.. అలాంటి వాళ్లు భయ్యా.. అంటే పాపం.. మనోడికి ఆశలు కల్లాస్.. ’..అందుకే ఇలా రాశాడోమో.., ‘డ్రైవర్ అమ్మాయా.. లేక అబ్బాయా..?..’.అంటు కామెంట్ లు పెడుతున్నారు.

ఇంకొందరు.. ‘కొందరు యంగ్ గా ఉన్న వాళ్లను కూడా అంకుల్’.. అని పిలుస్తుంటారు.,‘కొందరు తమ రైడింగ్ అయ్యేవరకు అందమైన అమ్మాయిలను లవ్ లో దింపేయాలనుకుంటారు..అలాంటి వాళ్లు ఒక్కసారిగా దిగేటప్పుడు భయ్యా.. అంటే.. ఇంకే మైన ఉందా.. ’.. అందుకే అలా రాశాడేమో..’,‘ఇక నుంచి డ్రైవర్ సాబ్.. పిలవాలి..’.. అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతుంటారు. ఏదీ ఏమైన ఈ డ్రైవర్ సీటువెనుకాల ఉన్న యాడ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు