సఫారీలో షాక్... కారు డోర్ తీసిన సింహం... వైరల్ వీడియో...

సింహాలు ఇలా చెయ్యగలవని తాము ఎప్పుడూ అనుకోలేదని ఆ ఫ్యామిలీ తెలిసింది.

news18-telugu
Updated: May 24, 2020, 10:44 AM IST
సఫారీలో షాక్... కారు డోర్ తీసిన సింహం... వైరల్ వీడియో...
సఫారీలో షాక్... కారు డోర్ తీసిన సింహం... వైరల్ వీడియో... (credit - twitter)
  • Share this:
సపోజ్ మీరు ఓ కారులో ఉన్నారు. చుట్టూ సింహాలున్నాయి. కారు విండో గ్లాసెస్ క్లోజ్ చేసి ఉన్నాయి. కాబట్టి... ఏ టెన్షనూ లేదని మీరు అనుకుంటారు. మరి సింహాలు కారు డోర్ ఓపెన్ చేస్తే... అక్కడ అదే జరిగింది. దక్షిణ ఆఫ్రిలాలో... ఆ ఫ్యామిలీ సఫారీ రైడ్ కోసం కారులో వెళ్లింది. కొంత దూరం వెళ్లే వరకూ క్రూర మృగాలేవీ కనిపించలేదు. "ఇదేంటీ ఏవీ కనిపించవేం" అనుకుంటూ... మరికాస్త ముందుకి వెళ్లారు ఎత్తుపల్లాల మట్టి రోడ్డుపై. అక్కడ ఓ మైదాన ప్రాంతంలో... చెట్టుకింద చల్లటి నీడలో... సేదతీరుతూ సింహాల గుంపు కనిపించింది. "అవిగో... సింహాలు... ఎలా కూర్చున్నాయో చూడు" అనుకుంటూ వాటిని తదేకంగా చూసింది ఆ ఫ్యామిలీ.

వెనక సీట్లో కూర్చున్న ఓ పాప... ఓ సింహం లేచి రావడాన్ని చూసింది. తన మొబైల్‌లో వీడియో తీయసాగింది. ముందు సీట్లో కూర్చున్న పేరెంట్స్ సింహాల్ని ఫొటోలు తీయసాగారు. సింహం దగ్గరకు వస్తుంటే... కారును కొద్దిగా ముందుకి పోనిచ్చి ఆపారు. మళ్లీ ఫొటోలు తీయసాగారు. ఇంతలో ఆ సింహం... వెనక సీట్లో ఉన్న పాపను చూసింది. ఈ రోజు నాకు బిర్యానీ దొరికినట్లే అనుకుంది. పాపవైపు నిశితంగా చూసింది. ఆ పాపేమో... కారు డోర్ క్లోజ్ చేసి ఉంది కదా అని సింహంవైపు నవ్వుతూ చూసింది.

కానీ ఆ సింహానికి తెలివితేటలు ఎక్కువే... కారు డోరును ఎలా తియ్యాలో దానికి తెలుసు. నోటితో కొరికి... డోర్ తీసేసింది. అంతే... ఆ పాప ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టింది. అక్కడితో ఈ వైరల్ వీడియో కట్ అయ్యింది. కారు డోర్స్ లాక్ చేయకపోవడంతో... ఆ సింహం ఈజీగా డోర్ తీయగలిగిందని తెలిసింది.ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇలా మీకూ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వన్యప్రాణులకు దూరంగా ఉండండి అని ఆయన తెలిపారు. ఇతకీ ఈ ఘటనలో నెక్ట్స్ ఏం జరిగిందన్నది చాలా మందికి డౌట్ వచ్చింది. ఆ పాప అరవడంతో... సింహం కాస్త వెనక్కి తగ్గిందట. వెంటనే డోర్ వేసేసి లాక్ చేశారట. అలా ప్రాణాలు దక్కాయని తెలిసింది. లక్కంటే అదే అనుకుందామా.
Published by: Krishna Kumar N
First published: May 24, 2020, 10:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading