Home /News /trending /

THIS IS THE TRUE LOVE STORY OF SWAPNA AND MANU FROM CHIKKAMAGALURU INSPIRES YOU GH SRD

True love Story: వైకల్యాన్ని ఎదురించి ఒక్కటయ్యారు..నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంట..

వైకల్యాన్ని ఎదురించి ఒక్కటయ్యారు..నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంట..

వైకల్యాన్ని ఎదురించి ఒక్కటయ్యారు..నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంట..

True love Story : ఈ ప్రపంచంలో తమ ప్రేమ చాలా ప్రత్యేకం అని ప్రతీ ప్రేమికుడు భావిస్తాడు. తన ప్రేమ అందరి కంటే గొప్పదని కలలు కంటాడు. కానీ, ఆచరణలో ఫలితం శూన్యం. కానీ, ఈ కథలోని ప్రేమికుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలైన ప్రేమంటే ఎంటో ఇతన్ని చూస్తే అర్ధమవుతోంది.

ఇంకా చదవండి ...
ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొని నిలిచేదే ప్రేమ.. అందుకే అలాంటి ప్రేమ గురించి ఎంతో మంది కవులు, రచయితలు అద్భుతంగా వర్ణించి చెప్పారు. కానీ అలాంటి ప్రేమ గొప్పదనాన్ని చెప్పే ఓ చక్కటి ప్రేమ కథ ఇది. చదవడానికి అచ్చం సినిమా కథలా అనిపించినా ఇది నిజ జీవిత కథ.. ప్రేమ గొప్పదనాన్ని చెప్పే కథ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే.. వైకల్యాన్ని కూడా కాదని తమ నిజమైన ప్రేమను గెలిపించుకున్న జంట కథ.. చిక్ మంగళూరు జిల్లాలోని భక్తరహళ్లి గ్రామానికి చెందిన స్వప్న, మను ఇద్దరూ ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పీయూసీ (10+2) వరకూ చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో అక్కడితో చదివి ఆపేశారు. చదువు ఆపేసిన తర్వాత మను సిటీలోని ఓ హార్డ్ వేర్ షాపులో ఉద్యోగంలో చేరి, ఆ డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. స్వప్న కూడా అక్కడే ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ లో టైపింగ్ నేర్చుకోవడానికి క్లాసులో చేరింది. ఒకరోజు క్లాసుకు వెళ్లిన తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏమైందో తెలియలేదు.. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లినా అసలు సమస్యేంటో గుర్తించలేకపోయారు. ఈ సమస్యతో స్వప్న కాళ్లు కూలబడిపోవడం వల్ల ఆమె ఎక్కడికి వెళ్లలేకపోయేది.తాను ఎంతగానో ప్రేమించిన స్వప్నకి ఇలా అవ్వడం చూసి మను తట్టుకోలేకపోయాడు. తాను చేసే ఉద్యోగం వదిలేసి తిరిగి గ్రామానికి చేరుకున్నాడు.

ఆమెను ఎంతో మంది డాక్టర్లకు చూపించాడు. ఎంతో మంది ఆయుర్వేద వైద్యుల వద్దకు కూడా తీసుకెళ్లాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అసలు సమస్య ఏంటనేది ఎవరూ గుర్తించలేకపోయారు. తాను ఇలా నడవలేకుండా అయిపోయినందుకు స్వప్న ఎంతగానో బాధపడింది. తన వల్ల మను జీవితం పాడవ్వకూడదని నిర్ణయించుకుంది. తనని మర్చిపోయి వేరే వ్యక్తిని పెళ్లాడమని అతడిని ఎంతగానో చెప్పి చూసింది. కానీ ఆమె మాటలను మను అస్సలు పట్టించుకోలేదు. ఈ బుధ వారం వీరిద్దరూ తమ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహమాడారు. ఈ ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారైనా ఇద్దరి తల్లిదండ్రులు ఒప్పుకొని వివాహం జరిపించారు. ఈ పెళ్లికి ఊరంతా తరలి వచ్చి వారి ప్రేమను ఆశీర్వదించింది. సాధారణంగా గ్రామాల్లో కులాంతర వివాహాలను అందరూ వ్యతిరేకిస్తుంటారు. కానీ వీరి విషయంలో మాత్రం వీరి ప్రేమను గ్రామం మొత్తం అంగీకరించి వారిని ఆశీర్వదించింది.

ఈ పెళ్లి గురించి పెళ్లి కొడుకు మను న్యూస్ 18 తో మాట్లాడుతూ మేమిద్దరం ప్రేమించుకున్నప్పుడు స్వప్నకి ఎలాంటి లోపమూ లేదు. మధ్యలో ఆమె కాళ్లు పడిపోయాయని నేను ఆమెను వదిలేస్తే మా ప్రేమను నేను మోసం చేసిన వాడినవుతాను. నేను ఆమె మనసును ప్రేమించాను కానీ ఆమె శరీరాన్ని కాదు. ఆమె ప్రస్తుత పరిస్థితి నాకేమీ ఇబ్బందిని కలిగించట్లేదు. పరిస్థితులు ఎలా మారినా ఎప్పుడూ తన చేతిని పట్టుకొని ముందుకు నడవాలన్నది నా కోరిక అని చెప్పాడు.

వైకల్యాన్ని ఎదురించి ఒక్కటయ్యారు..నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంట..


ఇక పెళ్లి కూతురు స్వప్న మాట్లాడుతూ.. నా పరిస్థితి ఇలా అయిన తర్వాత నన్ను వదిలేసి వేరే ఏ లోపం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోమని ఎన్నో సార్లు మనుకి నచ్చజెప్పి చూశాను. కానీ తను వినలేదు. నా పరిస్థితి తనకు అర్థమయ్యేలా చెప్పి చూశాను. నేను ఇంకెప్పుడూ నడవలేకపోవచ్చని కూడా వివరించాను. అయినా తన అభిప్రాయం మారలేదు. నన్ను పెళ్లికి ఒప్పించాడు. ఈరోజు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో నేను చాలా లక్కీ అనిపిస్తోంది. అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Love, Love marriage, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు