Viral: ఆ వధువు అంతలా పగలబడి నవ్వడానికి కారణం తెలిసిపోయింది.. అది తెలిస్తే అవాక్కవడం ఖాయం..

పగలబడి నవ్వుతున్న వధువు (Image : Twitter)

ఇటీవల సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ క్లిప్ లో.. వధువును ఫోటో తీస్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్ చూపించిన అత్యుత్సాహం.. దానికి అక్కడున్న వరుడికి మండి అతడి తలపై కొట్టిన వీడియో నెట్టింట అందర్నీ నవ్విస్తున్న విషయం తెలిసిందే.

  • News18
  • Last Updated :
  • Share this:
    ఇటీవల సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ క్లిప్ లో.. వధువును ఫోటో తీస్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్ చూపించిన అత్యుత్సాహం.. దానికి అక్కడున్న వరుడికి మండి అతడి తలపై కొట్టిన వీడియో నెట్టింట అందర్నీ నవ్విస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో వీడియో గ్రాఫర్ ను వరుడు కొట్టిన తర్వాత వధువు రియాక్షన్ చూసి అంతా నవ్వుకున్నారు. వరుడు ఆ ఫోటోగ్రాఫర్ ను కొట్టగానే ఆమె పగలబడి నవ్వింది. పెళ్లి కొడుకు చేసిన పనికి నవ్వు ఆపుకోలేక.. కిందపడి మరీ వికటాట్టహాసం చేసింది. అయితే ఆమె నవ్వడానికి గల కారణాలు ఏవైనా.. ఇందుకు సంబంధించిన అసలు విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

    ఫోటో గ్రాఫర్ మీద కోపంతో అతడి తల మీద ఒక్కటి పీకడంతో ఆమె నవ్వుతున్న దానిని వీడియోలో చూడొచ్చు. ఈ వీడయోను రేణుకా మోహన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో జరిగింది నిజమైన పెళ్లి కాదట. సినిమా షూటింగట. ఈ విషయాన్ని ఆ వీడియోలో వధువుగా కనిపిస్తున్న యువతే తెలిపింది. ట్విట్టర్ వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.





    ఇదే విషయమై వీడియోలో వధువుగా ఉన్న అంక్రితి చౌహాన్ (Anikriti Chouhan) స్పందిస్తూ... అది తన మూవీ కోసం తీసిన వీడియో క్లిప్ అని తెలిపింది. ఛత్తీస్గఢ్ కు చెందిన అంక్రితి.. అక్కడ తెరకెక్కుతున్న ‘డార్లింగ్ ప్యార్ జుక్తా నహి’ (darling pyaar jhukta nahi) సినిమా కోసం తీసిందని చెప్పుకొచ్చింది. అది తన పెళ్లి వీడియో అని కొంత మంది అనుకున్నారని.. కానీ అది ఫక్తు షూటింగ్ వీడియో అని స్పష్టం చేసింది.





    కాగా.. ఈ వీడియోను ఇంటర్నెట్ లో ఉంచి వైరల్ చేసినందుకు గానూ రేణుకా మోహన్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక వీడియోను వీక్షించిన అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. అదండీ సంగతి...
    Published by:Srinivas Munigala
    First published: