దెయ్యాలతో గడిపే దమ్ముందా... ఇలా చెయ్యండి...

సినిమాల్లో ఎలాగైతే... ఇళ్లలో దెయ్యాలు ఉన్న ఫీల్ కలుగుతుందో... ఆ ఇంట్లో కూడా అదే ఫీల్ కలుగుతోంది. ఎందుకో తెలుసుకోండి మరి...

news18-telugu
Updated: May 3, 2020, 1:01 PM IST
దెయ్యాలతో గడిపే దమ్ముందా... ఇలా చెయ్యండి...
దెయ్యాలతో ఓ రోజు గడిపే దమ్ముందా... ఇలా చెయ్యండి... (credit - YT - Baron Craze)
  • Share this:
మే 9, 2020... ఈ రోజు దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు లేవు అనే వారికి ఏదో ఒక సమాధానం దొరికే రోజు. ఎందుకంటే... ఆ రోజున ఆ ఇంట్లో జరిగే ప్రతీదీ... వారం పాటూ లైవ్ స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఆ ఇంటి స్పెషాలిటీ ఏంటంటే... అందులో దెయ్యాలు నివసిస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. సహజంగా మనం తలుపులు వాటంతట అవే తెరచుకోవడం, గోడలపై నల్లటి నీడలు అలా వెళ్లిపోవడం, ఉన్నట్టుండి బుక్స్ కింద పడటం, టేబుల్‌పై గ్లాస్ పక్కకు జరగడం... వంటివి హర్రర్ మూవీస్‌లో చూస్తుంటాం. సినిమాల్లో అవి గ్రాఫిక్స్ కాబట్టి... మనం వాటిని ఎంజాయ్ చేస్తాం. నిజంగా మన ఇంట్లోనే అలా జరిగితే... మనకు నిద్ర పడుతుందా? ఆ ఇంట్లో నిజంగానే అలా జరుగుతోందట.

1973లో వచ్చిన ది ఎగ్జార్సిస్ట్ (The Exorcist) ఇప్పటికీ ది బెస్ట్ హర్రర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలుస్తూనే ఉంది. చిత్రంగా ఆ సినిమాపై చాలా వివాదాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటూ... అలాంటి కథలతో చాలా దెయ్యం సినిమాలు వచ్చాయి. మన జనరేషన్‌లో అలాంటి అత్యంత భయంకరమైన హర్రర్ ఫిల్మ్‌గా 2013లో వచ్చిన ది కంజ్యూరింగ్ (The Conjuring)ను చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇదే సినిమాకి చాలా సీక్వెల్స్ వచ్చాయి. అలాగే చాలా హర్రర్ ఫిల్మ్స్ ఇలాంటివి వచ్చాయి. కంజ్యూరింగ్ సినిమా తియ్యడానికి మూలం ఆ భవనమే.

1970లో ఓ ఫ్యామిలీ ఓ పాత అందమైన భారీ భవనంలో నివసించింది. అందులో వారికి రకరకాల దెయ్యాల అరుపులు, శబ్దాలు, వింత వింత అనుభవాలన్నీ లైవ్‌లో ఎదురవ్వడంతో... బాగా భయపడి... ఆ ఇంటిని వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న ఓ పారానార్మల్ (దెయ్యాలపై పరిశోధనలు చేసే వారు) ఫ్యామిలీ... ఆ ఇంట్లో తాజాగా దిగింది. అప్పుడెప్పుడో దెయ్యాలున్నాయి గానీ... ఇప్పుడు అవి ఉంటాయా అనుకున్నారట. తీరా చూస్తే... అప్పటి ఫ్యామిలీకి ఎలాగైతే... చుక్కలు కనిపించాయో... అలాగే వీళ్లకూ జరుగుతోంది. వీళ్లకు అసలే దెయ్యాలపై పరిశోధనలంటే ఆసక్తి కదా... అందుకే... తమ ప్రయోగాల్నీ, తమకు ఎదురయ్యే భయాల్నీ ప్రపంచం మొత్తం చూడండి అంటూ... మే 9న ఇంట్లోనే ఉంటూ... ఇల్లు మొత్తాన్నీ లైవ్ స్ట్రీమింగ్ పెడుతున్నారు.

ది డార్క్ జోన్ (The Dark Zone) వెబ్‌సైట్‌లో మీరు ఈ లైవ్ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు. దీనికి ముందుగా మే 8న చిన్న ప్రివ్యూ కూడా ఇస్తారు.

ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా? : ఇదివరకు ఆ ఇంట్లో దాదాపు 8 తరాల ప్రజలు నివసించారు. చాలా హత్యలు కూడా జరిగాయట. కొంతమంది సూసైడ్లు చేసుకున్నారట. వాళ్లంతా దెయ్యాలు అయ్యారన్నది ప్రస్తుత ఫ్యామిలీ చెబుతున్న మాట. ఆసక్తి ఉన్నవారు... తమతోపాటూ... లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ... దెయ్యాలు ఉన్నదీ, లేనిదీ స్వయంగా ఫిక్స్ చేసుకోమంటున్నారు.
First published: May 3, 2020, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading