హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Baby Shark Dance: యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ఆ పాటకే.. సరి కొత్త రికార్డు సృష్టించిన ఆ సాంగ్ ఇదే..

Baby Shark Dance: యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ఆ పాటకే.. సరి కొత్త రికార్డు సృష్టించిన ఆ సాంగ్ ఇదే..

పాటకు చెందిన వీడియోలోని ఓ దృశ్యం

పాటకు చెందిన వీడియోలోని ఓ దృశ్యం

యూట్యూబ్ ను తాజాగా ఓ చిన్నారుల కోసం రూపొందించన పాట షేక్ చేస్తోంది. ఓ చిన్నారుల పాట 7 బిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. "Baby Shark Dance" పాట యొక్క ఇంగ్లీష్ వర్షన్ సోమవారం ఏడు బిలియన్ల వ్యూస్ ను పొంది సంచలనం సృష్టించింది.

ఇంకా చదవండి ...

యూట్యూబ్ ను తాజాగా చిన్నారుల కోసం రూపొందించిన ఓ పాట షేక్ చేస్తోంది. ఆ చిన్నారుల పాట 7 బిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. "Baby Shark Dance" పాట యొక్క ఇంగ్లీష్ వర్షన్ సోమవారం నాడు ఏడు బిలియన్ల వ్యూస్ ను పొందింది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ పొందిన వీడియోగా లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీకి చెందిన ‘డెస్పాసిటో’ ఉంది. ఆ రికార్డును ఈ చిన్నారుల పాట అధిగమించింది. పిల్లలతో పాటు, పెద్దలనూ ఇంతగా అలరించిన ఈ పాటను 2016 జూన్ లో మొదటగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

ఇది సియోల్‌కు చెందిన నిర్మాణ సంస్థ పింక్‌ఫాంగ్ చేత రూపొందించబడిన అమెరికన్ క్యాంప్‌ఫైర్ పాట యొక్క రీమిక్స్. ఈ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించడంతో గ్లోబల్ మ్యూజిక్ చార్ట్ లోనూ స్థానం సంపాధించుకుంది. 2019 జనవరిలో బిల్బోర్డ్ హాట్ 100లో 32వ స్థానం దక్కించుకుని ఆ సమయంలో రికార్డు పొందింది. చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ పాటకు ఫిదా అయ్యారు. దీంతో ఆధ్యాంతం వినసొంపుగా ఉండే ఈ పాట అందరి అభిమానాలను అందుకుంది.

' isDesktop="true" id="650656" youtubeid="XqZsoesa55w" category="international">

వాషింగ్టన్ నేషనల్స్ బేస్ బాల్ టీమ్ ఈ పాటను తమ అంతెంగా ఎంచుకోవడం విశేషం. అనంతరం వారు వరల్డ్ సిరీస్ లో విజయం సాధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో వైట్ హౌస్ లోనూ ఈ పాటను ప్లే చేయడం మరో విశేషం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ పాటను చిన్నారులకు అవగాహన కల్పించేందుకు అనుగుణంగా మార్చారు. ‘వాష్ యువర్ హాండ్స్’ అంటూ ఈ పాటకు మరో వర్షన్ విడుదల చేసి తద్వారా చిన్నారుల్లో పరిశుభ్రత పెంచేలా ప్రోత్సహించారు.

First published:

Tags: Children, Youtube, Youtube star

ఉత్తమ కథలు