హోమ్ /వార్తలు /trending /

Youtube Video: ఈ వీడియోకు 1000 కోట్ల వ్యూస్ వచ్చాయి.. చరిత్రను తిరగరాసిన ఈ వీడియోలో ఏముందో తెలుసా..

Youtube Video: ఈ వీడియోకు 1000 కోట్ల వ్యూస్ వచ్చాయి.. చరిత్రను తిరగరాసిన ఈ వీడియోలో ఏముందో తెలుసా..

ప్రముఖ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube)లో ప్రతిరోజు లెక్కలేనన్ని వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మిలియన్ల వ్యూస్ సంపాదించి పాపులర్ అయితే.. మరికొన్ని వీడియోలు బిలియన్ల కొద్దీ వీక్షణలు సాధించి సూపర్ పాపులర్ అవుతాయి.

ఇంకా చదవండి ...

  ప్రముఖ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube)లో ప్రతిరోజు లెక్కలేనన్ని వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మిలియన్ల వ్యూస్ సంపాదించి పాపులర్ అయితే.. మరికొన్ని వీడియోలు బిలియన్ల కొద్దీ వీక్షణలు సాధించి సూపర్ పాపులర్ అవుతాయి. యూట్యూబ్‌లో మోస్ట్ పాపులర్ వీడియోల జాబితాలో ఎక్కువగా మ్యూజిక్ వీడియోలే ఉంటాయి. అయితే వాటన్నిటిలో బేబీ షార్క్ డ్యాన్స్ (Baby Shark Dance) అనే వీడియో అత్యధికంగా వ్యూస్ సంపాదించింది. ఈ వీడియోకి కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 10 బిలియన్ (1000 కోట్ల) వ్యూస్ వచ్చాయి. ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టిన బేబీ షార్క్ అనేది చిన్న పిల్లలకు సంబంధించిన వీడియో (children's song) కావడం విశేషం. యూట్యూబ్‌లో 10 బిలియన్ వ్యూస్ మైలురాయిని దాటిన మొట్టమొదటి వీడియో ఇదే కావడం గమనార్హం.

  Investment: స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, లాజిక్స్ ఏంటి..? తెలుసుకోండి..వివరాలివే..

  ఎక్కువ సార్లు వీక్షించిన వీడియోగా “బేబీ షార్క్” సాంగ్ నవంబర్ 2020లో రికార్డు సృష్టించింది. దక్షిణ కొరియా ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన పింక్‌ఫాంగ్ (Pinkfong) ఈ వీడియోని రూపొందించింది. ఇందులో “బేబీ షార్క్, డూ, డూ, డూ.. మామీ షార్క్ డూ, డూ, డూ” అంటూ చక్కటి లయలో సాగే ఓ పాట వస్తుంటే అందుకనుగుణంగా పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటారు. 2016, జులై 18న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 10,014,400,609 వ్యూస్, 32 మిలియన్ల లైకులు వచ్చాయి.

  బేబీ షార్క్ వీడియో తర్వాతి స్థానంలో లూయిస్ ఫోన్సీ రూపొందించిన "డెస్పాసిటో (Despacito)" నిలుస్తోంది. డెస్పాసిటో పాటకు 7.7 బిలియన్ (770 కోట్లు) వ్యూస్ వచ్చాయి. అయితే ఈ పాట బేబీ షార్క్ వీడియోకి మించి వ్యూస్ రాబట్టటం అంత సులభమేమీ కాదు. ఒకవేళ మళ్లీ ఈ పాట వైరల్ అయితే.. అది బేబీ షార్క్ వీడియోని మించి వ్యూస్ సంపాదించవచ్చు దీన్నిబట్టి ఇప్పట్లో బేబీ షార్క్ లాగా ఏ వీడియో కూడా త్వరలో 10 బిలియన్ మార్క్ క్రాస్ అవ్వకపోవచ్చు.' isDesktop="true" id="1166120" youtubeid="XqZsoesa55w" category="national">

  యూట్యూబ్‌లో అత్యధికంగా చూసిన మ్యూజిక్ వీడియోల విషయానికి వస్తే, డెస్పాసిటో తర్వాతి స్థానంలో ఎడ్ షీరన్ (Ed Sheeran) షేప్ ఆఫ్ యు (అఫీషియల్ మ్యూజిక్ వీడియో) నిలుస్తోంది. మ్యూజిక్ వీడియోల్లో విజ్ ఖలీఫా రూపొందించిన సీ యు అగైన్ పాట ft.Charlie Puth (అఫీషియల్ వీడియో) మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుతానికి షేప్ ఆఫ్ యు 5.5 బిలియన్ వ్యూస్, సీ యు అగైన్ 5.3 బిలియన్ వ్యూస్ సంపాదించాయి. 4.4 బిలియన్ల వ్యూస్ తో నాలుగో స్థానంలో మార్క్ రాన్సన్ రూపొందించిన అప్‌టౌన్ ఫంక్ యు అప్ (అఫీషియల్ వీడియో) ft. బ్రూనో మార్స్ (Bruno Mars) నిలుస్తోంది. ఐదవ స్థానంలో PSY గంగ్నమ్ స్టైల్ నిలిచింది.

  First published:

  ఉత్తమ కథలు