నిప్పులు కక్కే ఎండాకాలంలో ఒక దుప్పటి మన శరీరాన్ని చల్లబరిస్తే ఎలా ఉంటుంది? అదే దుప్పటి శీతాకాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! ఇలాంటి ఒక మ్యాజికల్ బ్లాంకెట్‌ను రూపొందించారు పరిశోధకులు. వేసవి కాలం వచ్చిందంటే.. ఏసీల వినియోగం పెరుగుతుంది. ఫలితంగా కరెంటు బిల్లుల మోత మోగుతుంది. ఇప్పుడీ కష్టాలకు ఈ దుప్పటితో చెక్‌పెట్టొచ్చు. జపనీస్ ఆర్క్ చిల్ ఫైబర్ సాంకేతికతతో దీన్ని తయారుచేశారు. ఈ సరికొత్త ఫ్యాబ్రిక్ మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శీతల ప్రభావాన్ని కల్పిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతలను రెండు నుంచి ఐదు డిగ్రీల మధ్య తగ్గిస్తుంది. దీనివల‌్ల ఏసీలు, కూలర్ల కరెంట్ చార్జీలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
శీతాకాలంలో వెచ్చగా...
ఈ దుప్పటి అటు వేసవిలోను ఇటు చలికాలంలోనూ పనికొస్తుంది. ఇది డబుల్ సైడెడ్ బ్లాంకెట్. ఒకవైపు బాంబూ కాటన్‌తో తయారుచేశారు. శీతాకాలంలో ఈ దుప్పటి మనకు వెచ్చదనాన్ని కలిగిస్తుంది. ఒకవైపు వెచ్చదనాన్ని మరోవైపు చల్లదనాన్ని ఇచ్చే ఈ బ్లాంకెట్‌ను తేలికగా, మృదువుగా ఉండేలా తయారుచేశారు. మార్చిపవర్ కూలింగ్ బ్లాంకెట్ పేరుతో లభ్యమయ్యే ఈ దుప్పటిని వాషింగ్ మెషీన్‌లోనూ ఉతుక్కోవచ్చు. ఇది బాక్టీరియాను ఆకర్షించదు. కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా ఈ దుప్పటిని వాడుకోవచ్చు.
అమెజాన్‌లో దొరుకుతోంది...
జపాన్‌లో ఆవిష్కృతమైన ఈ కొత్తరకం దుప్పటిని తాజాగా మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ ద్వారా దీన్ని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఈ మ్యాజిక్ బ్లాంకెట్ ధర 10,378 రూపాయలు. ఈ ప్రొడక్ట్‌కు మంచి రివ్యూ, రేటింగులు ఉండటం విశేషం. ఈ దుప్పటిని వినియోగిస్తున్నవారు కూలింగ్ ఎఫెక్ట్ బావుందని రివ్యూలు ఇస్తున్నారు. చాలామంది యూజర్లు పాజిటివర్ రివ్యూలు, మెరుగైన రేటింగ్‌తో దీన్ని రిఫర్ చేస్తున్నారు. ఉక్కపోత సమయంలో తమకో మంచి దుప్పటి లభించిందని అమెజాన్ పోర్టల్‌కు థాంక్స్ చెబుతూ కామెంట్లు రాస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Life Style, Sleep, VIRAL NEWS