బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు.. 7వ తరగతి విద్యార్థి పాఠాలు

బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే.. కచ్చితంగా ప్రొఫెసర్లు అయ్యుండాలి. అందుకోసం పీహెచ్‌డీలు చేయాలి. కానీ అవేమీ లేకుండానే ఈ బుడతడు.. అవలీలగా గ్యాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠాలు చెప్పేస్తున్నాడు. అదెక్కడో కాదు.. హైదరాబాద్‌లో.

news18-telugu
Updated: February 6, 2019, 7:41 PM IST
బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు.. 7వ తరగతి విద్యార్థి పాఠాలు
మహ్మద్ హసన్ అలీ
  • Share this:
(బాలకృష్ణ. ఎం, న్యూస్18 సీనియర్ కరెస్పాండెంట్)
పొద్దున్నే స్కూలుకు వెళ్లడం.. సాయంకాలం ఇంటికి రావడం.. కాసేపు ఆడుకోవడం.. ఆ తర్వాత ట్యూషన్‌కు వెళ్లడం, వీలైతే ఇంట్లోనే హోమ్‌వర్క్ పూర్తి చేయడం.. ఆ తర్వాత కార్టూన్ నెట్‌వర్క్స్ చూడడం.. మారాం చేస్తూ నాలుగు ముద్దలు తినడం.. తెలియకుండానే నిద్రలోకి జారిపోవడం... 7వ తరగతి చదివే  11 ఏళ్ల కుర్రాడికి ఇంతకన్నా దినచర్య ఇంకేముంటుంది? నిజమే.. కానీ హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఉండే మహ్మద్ హస్సన్ అలీది మాత్రం విభిన్నమైన లైఫ్ స్టైల్. ఉదయాన్నే 8 గంటలకు స్కూలుకు వెళ్తాడు.. సాయంత్రం 3 గంటలకు తిరిగి వస్తాడు. తనపనుల్ని పూర్తి చేసుకుని.. సాయంత్రం 6 గంటల నుంచి తన దగ్గరికొచ్చే బీటెక్, స్టూడెంట్ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టేస్తాడు. 7 ఏళ్ల కుర్రాడు.. బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అదే హస్సన్ స్పెషాలిటీ. ఆ టాలెంట్‌తోనే అంతర్జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షిస్తున్నాడు.

ఎలా సాధ్యమైంది?
7వ తరగతి చదివే పిల్లాడు బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఎలా సాధ్యమైందంటే మాత్రం.. అదంతా ఇంటర్నెట్ మహత్తేనని చెప్పొచ్చు. అందరు పిల్లలూ ఇంటర్నెట్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావిస్తే ఈ బుడ్డోడు మాత్రం విజ్ఞానకేంద్రంగా మలచుకున్నాడు. రెండేళ్ల క్రితం వరకు అతను కూడా అందరిలా మామూలు పిల్లాడే. అయితే, సరైన స్కిల్స్ లేకపోవడం వల్ల యువత ఉద్యోగాలు సంపాదించుకోలేక పోతోందంటూ..  ఓ న్యూస్ చానెల్‌లో వచ్చిన కథనం హస్సన్‌ను పూర్తిగా మార్చేసింది. అప్పట్నుంచి.. అసలా స్కిల్స్ అంటే ఏమిటి? అని శోధన మొదలెట్టాడు. యూట్యూబ్ సహా ఇతరత్రా మాధ్యామాల్లో రకరకాల కోర్సుల గురించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అవపోసన పట్టాడు. అలా తెలుసుకున్న విషయాలనే అంతగా అవగాహనలేని బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు తెలియజేస్తున్నాడు. సాయంత్రం కాగానే పదుల సంఖ్యలో బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్ అతని దగ్గరికి వచ్చేస్తారు. అలాగని, అతనేం వేలకువేలు ఫీజులు తీసుకొని తెగ సంపాదించేయట్లేదు. అంతా ఉచితమే. ఎందుకంటే దేశంకోసం అంటాడు.

CHILD PRODIGY, HASSAN ALI, COMPUTER TEACHER, బాల మేధావి, హసన్ అలీ, కంప్యూటర్ టీచర్
కోచింగ్ ఇస్తున్న హాసన్


ఆటో క్యాడ్, 2డీ, 3డీ, రెవిట్ ఆర్కిటెక్చర్, ఎంఈపీ, స్టాడ్ ప్రో, ప్రైమావెరా మెకానికల్ క్యాడ్, స్కెచ్‌అప్, త్రీ డైమన్షన్.. ఇలా ఒకటేమిటి బోలెడన్ని కోర్సులు ఈజీగా అర్థమయ్యేలా చెబుతున్నాడీ బుడతడు. తాను నేర్చుకున్న ఈజీ టెక్నిక్స్‌ను అందరికీ నేర్పిస్తున్నాడు. దీంతో చిన్నవాడైనా ఇతని దగ్గర కోచింగ్ తీసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఇంజినిరీంగ్, ఎంటెక్ విద్యార్థులు. ఈ ప్రతిభే హాసన్‌ను అంతర్జాతీయంగా పాపులర్ చేసింది. అవార్డులు, రివార్డులతో పాటు ప్రముఖుల మన్ననలను అందుకునేలా చేసింది. అలాగని బాల్యాన్నేం మిస్ అవ్వట్లేదు హాసన్. దేని దారి దానిదే అంటాడు. పిల్లలందరితో కలిసి ఆడతాడు, పాడతాడు. ఆ తర్వాతే కోచింగైనా, ఇంకేదైనా అంటాడు.

CHILD PRODIGY, HASSAN ALI, COMPUTER TEACHER, బాల మేధావి, హసన్ అలీ, కంప్యూటర్ టీచర్
కోచింగ్ ఇస్తున్న హాసన్
’’ఇంజినీరింగ్ చదివినా యువతకు సరైన ఉద్యోగాలు లభించకపోవడం నన్ను కలిచివేసింది. స్కిల్స్ లేకపోవడమే అందుకు కారణం కావడం మరింత బాధించింది. అందుకే అవసరమైన స్కిల్స్, ఈజీ టెక్నిక్స్‌ మీద స్టడీ చేశాను. నాకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెబుతున్నాను. భవిష్యత్తులో ఐఏఎస్‌గా దేశానికి సేవలందించడమే నా లక్ష్యం‘‘ అంటున్నాడీ చిన్నోడు. ఆల్ ది బెస్ట్ హాసన్.
First published: February 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading