Home /News /trending /

Viral Video: ఆహారం కోసం ఆరాటం..ఆకలి తీర్చుకోవడానికి మైండ్ బ్లాక్ అయ్యే పని చేసిన గజరాజు..

Viral Video: ఆహారం కోసం ఆరాటం..ఆకలి తీర్చుకోవడానికి మైండ్ బ్లాక్ అయ్యే పని చేసిన గజరాజు..

Photo Credit : You Tube

Photo Credit : You Tube

Viral Video: మ‌నుషులు అడ‌వుల‌ను ఆక్ర‌మించుకుంటుంటే అడ‌వి జంతువులు జ‌నావాసాల్లోకి చొర‌బ‌డుతున్నాయి. నీరు ఆహారం కోసం అవి త‌మ ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెడుతున్నాయి. అయితే కొన్ని తెలివైన జంతువులు మాత్రం త‌మ బుర్ర‌ను ఉప‌యోగించి ఆహారాన్ని సాధించుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...
మ‌నుషులు అడ‌వుల‌ను ఆక్ర‌మించుకుంటుంటే అడ‌వి జంతువులు జ‌నావాసాల్లోకి చొర‌బ‌డుతున్నాయి. నీరు ఆహారం కోసం అవి త‌మ ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెడుతున్నాయి. అయితే కొన్ని తెలివైన జంతువులు మాత్రం త‌మ బుర్ర‌ను ఉప‌యోగించి ఆహారాన్ని సాధించుకుంటున్నాయి. తాజాగా థాయ్‌లాండ్‌లో ఓ గ‌జ‌రాజు రాత్రివేళ త‌న ఆకలి తీర్చుకోవ‌డానికి ఏకంగా ఓ వంటిల్లు గోడ‌ను ప‌గుల‌కొట్టింది. అనంతరం వంట‌గ‌దిలోని పదార్థాలతో కడుపు నింపుకుంది. ద‌క్షిణ థాయ్‌లాండ్‌లోని చలేర్మికియా గ్రామంలో ఈ సంఘ‌ట‌న‌ జరిగింది. దీన్ని వీడియో తీసిన ఇంటి య‌జ‌మానురాలు, క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. చలేర్మికియా గ్రామంలో ర‌త్స‌దావ‌న ప్యూంగ్రాసోపాన్ అనే మ‌హిళ‌కు చెందిన ఇంటి వంట‌గ‌దిని అర్థ‌రాత్రివేళ ఓ ఏనుగు ధ్వంసం చేసింది. త‌నకు కావాల్సిన ఆహారం కోసం తొండంతో వంటింటినంతా జ‌ల్లెడ ప‌ట్టింది. ఏనుగు గోడ ప‌గుల‌గొట్టిన శ‌బ్దానికి మేల్కొన్న యజమారురాలు, ఏనుగును చూసి ఆశ్చర్యపోయింది. తొండంతో వంటింట్లో పదార్థాలను తీసుకుంటున్న గ‌జ‌రాజును వీడియో తీసింది. వంట‌గ‌దిలో క‌నిపించిన దేన్నైనా స‌రే తిన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నట్లుగా ఏనుగు ప్రయత్నించింది. తిన‌డానికి ఇంకా ఏమైనా దొర‌క‌క‌పోతుందేమో అనే ఆశ‌తో అది వెతుకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఏనుగు థాయ్‌లాండ్‌లోని కాయెంగ్ క్రాచ‌న్ నేష‌న‌ల్ పార్క్‌లో ఉంటుంది. ఈ పార్క్ స‌మీపంలో ఉండే చ‌లేర్మికియా ప్రాంతానికి ఇది త‌ర‌చూ వ‌స్తుంటుంది. ఈ గ‌జ‌రాజు ఇలా ఆహారం కోసం వేటాడ‌టం ఇదేమి మొద‌టి సారి కాదు. ముఖ్యంగా మార్కెట్ తెరిచి ఉంచే సంద‌ర్భాల‌లో ఏనుగులు ఇక్క‌డ‌కు వ‌స్తాయ‌ని, అవి ఆహారాన్ని వాస‌న ద్వ‌రా ప‌సిగ‌ట్ట‌గ‌ల‌వ‌ని పార్క్ సూప‌రింటెండెంట్ ఇత్తిప్ప‌న్ థైమ‌న్‌కోల్ తెలిపిన‌ట్టు గార్డియ‌న్ క‌థనం తెలిపింది.

అడ‌వుల‌లో ఆహారాన్ని వెదుక్కోవ‌డానికి బ‌దులుగా ఏనుగులు ఇలా ఊళ్ళ‌లోకి రావ‌డం వాటి ప్ర‌వ‌ర్త‌నా తీరును తెలియ‌జేస్తోంది. దీంతో ఇక‌పై వంటింట్లో ఎటువంటి ఆహారాన్ని ఉంచ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచించారు. ఎందుకంటే ఆహార‌ప‌దార్థాల వాస‌న ఏనుగుల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని వారు చెప్పారు. ఇక గ‌జ‌రాజు ప‌గుల‌కొట్టిన వంటగ‌ది గోడ ను మ‌ర‌మ్మ‌తు చేయించ‌డానికి ఇంటి య‌జ‌మానురాలికి సుమారు 11,70, 286 రూపాయ‌లు ఖ‌ర్చుచేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Elephant, Thailand, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు