హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bridegroom: అల్లుడికి మామ ఊహించని కట్నం.. అది కూడా అల్లుడు ముచ్చటపడి కోరుకున్నదే..!

Bridegroom: అల్లుడికి మామ ఊహించని కట్నం.. అది కూడా అల్లుడు ముచ్చటపడి కోరుకున్నదే..!

అదనపు కట్నం కోసం వేధించే అల్లుళ్ల గురించి తరచుగా వార్తలొస్తుంటాయి. పెళ్లి సమయంలో మామను అది కావాలి.. ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరే అల్లుళ్ల గురించీ వినుంటారు. మంచి సంబంధమనో, అమ్మాయిని కష్టపెట్టకుండా చూసుకుంటాడనో అప్పులు చేసి...

ఇంకా చదవండి ...

  అసిఫాబాద్: అదనపు కట్నం కోసం వేధించే అల్లుళ్ల గురించి తరచుగా వార్తలొస్తుంటాయి. పెళ్లి సమయంలో మామను అది కావాలి.. ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరే అల్లుళ్ల గురించీ వినుంటారు. మంచి సంబంధమనో, అమ్మాయిని కష్టపెట్టకుండా చూసుకుంటాడనో అప్పులు చేసి మరీ లక్షలకు లక్షలు కట్నాలిచ్చి తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతుంటారు. పెళ్లి తర్వాత కూడా మీ నాన్న నాకు బైక్ కొనిస్తాడని చెప్పి మాట తప్పాడని, కారు కొనిస్తానని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పాడని భార్యను వేధించే భర్తలకు కొదవే లేదు. కానీ.. ఈ అల్లుడు మాత్రం ‘మా అల్లుడు వెరీ గుడ్’ అని మామ మెచ్చుకునేలా కట్నం కోరాడు. కట్నంగా డబ్బు తీసుకుంటే కొన్నాళ్లకు ఖర్చయిపోతుంది. కారు బంగళాలు తిరగడానికి, ఉండటానికి తప్ప కుటుంబాన్ని పోషించేందుకు పనికిరావు.

  అందుకే.. ఈ అల్లుడు మామను కూతురితో పాటు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎడ్ల బండి, ఎడ్ల జతను కట్నంగా కోరాడు. కష్టజీవి అయిన ఈ అల్లుడి కోరికకు మామ ఫిదా అయ్యాడు. అల్లుడు కోరినట్టుగానే ఎడ్ల జతను, ఎడ్ల బండిని కూతురితో పాటు కట్నం రూపంలో అల్లుడికి ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకెళితే... కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం కాసిపటేల్ గూడకు చెందిన మెస్రం షేకు అల్లుడికిచ్చిన కట్నం అందరినీ ఆలోచింపజేసింది. అది కూడా అల్లుడు ముచ్చటపడి కోరుకున్నదే కావడం విశేషం.

  ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం ఖైర్ దాట్వ గ్రామానికి చెందిన నగేష్‌కు తన కూతురు రేణుకను ఇచ్చి మెస్రం షేకు వివాహం చేశాడు. అయితే అల్లుడు నగదో, మోటార్ సైకిలో అడగకుండా ఎడ్ల బండి, ఎడ్ల జతను కట్నంగా అడగడంతో పెళ్లి తర్వాత వధువు తండ్రి ఆ కానుకను ముట్టజెప్పాడు. ఊరికే వచ్చే కట్నం కదా అని డబ్బు కోసం ఆశ పడకుండా ఆలోచనతో తన వ్యవసాయానికి పనికి వచ్చే ఎడ్ల బండి, ఎడ్ల జతను కానుకగా అల్లుడు అడగటం అందరిని ఆలోచింపజేసింది.

  First published:

  Tags: Adilabad, Marriage, Telangana

  ఉత్తమ కథలు