మలేసియా జాలర్లు... రోజూలాగే చేపల్ని పట్టుకొచ్చారు. వాటిలో ఓ చేప చిత్రంగా కనిపించింది. దానికి మనిషి ముఖం లాంటి నోరు, దంతాలూ ఉండటంతో... "ఏంటిది... ఇలా ఉంది"... అంటూ దాన్ని మిగతా చేపలతో అమ్మకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత దగ్గర్లోని ఓ చేపల పరిశోధనా కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ చేపను పరిశోధకుల ముందు పెట్టారు. దాన్ని చూసిన పరిశోధకులు... వావ్... ట్రిగ్గర్ ఫిష్ (Triggerfish)... భలే ఉంది... నీ వల్లో పడిందా?" అని అడిగారు. "అవును... దీని పేరేంటన్నారు... ట్రిగ్గర్ ఫిష్షా... ఇది ఇలా ఎందుకుంది?" అని అడిగాడు ఆ మత్స్యకారుడు. వెంటనే ఆ పరిశోధకుడు "అదే మరి మన భూమికి ఉన్న ప్రత్యేకత. ఇక్కడ రకరకాల జీవుల్ని మనం చూడగలం. వాటిలో ఇదో రకం" అన్నాడు. ఆశ్చర్యపు ఫేస్ పెట్టాడు ఆ ఫిషర్‌మేన్.
ఈ చేపలు కాస్త అరుదైనవే. ఇవి ఆస్నేయ ఆసియా సముద్ర జలాల్లో కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద పెదవులు, బలమైన దవడలు వీటికి ఉంటాయి. దంతాలు అచ్చం మనుషులకు ఉన్నట్లే ఉంటాయి. దీన్ని చూసిన వాళ్లు షాకవుతారు. ఎందుకంటే... చూడ్డానికి కాస్త భయంకరంగానే ఉంటుంది ఈ చేప.
ఈ చేప ఫొటోలు నెట్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు దీనిపై రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమందైతే ఫొటోషాప్‌లో ఎడిటింగ్ చేసిమరీ క్రియేటివిటీ చూపిస్తున్నారు.
మొత్తంగా ఈ చేప బాగుందని ఎవరూ అనట్లేదు. చాలా మందికి ఇది నచ్చట్లేదు. దీని ముఖం ఇలా ఉండటం వల్లే వారికి నచ్చట్లేదు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.