• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • THIS FARMER STARTS GOAT ZOOM CALLS IN OFFICE MEETINGS PEOPLE LOVED IT MS

Viral: మేకలతో Zoom వీడియో కాల్... సరదాకు స్టార్ట్ చేసిన పని ఆదాయమార్గమైంది..

Viral: మేకలతో Zoom వీడియో కాల్... సరదాకు స్టార్ట్ చేసిన పని ఆదాయమార్గమైంది..

ప్రతీకాత్మక చిత్రం

లాక్డౌన్ పుణ్యమా అని అప్పటిదాకా వారి గుమ్మం దాటి బయట తెలియనివాళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా పేమస్ అయ్యారు. ఇదే అదునుగా చేసుకుని పలువురు ఔత్సాహికులు ఆదాయ మార్గాలను కూడా వెతుక్కున్నారు. తాజాగా ఒక ఉద్యోగిని మేకలను చూపుతూ ఆదాయం పొందుతున్నది.

  • News18
  • Last Updated:
  • Share this:
    లాక్డౌన్ కారణంగా సాధారణ జీవితం అతలాకుతలమైంది. ఇక ఉద్యోగులైతే ఆఫీసులు మానేశారు. అంతా ఆన్లైన్ వేదికగానే కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ కాలంలోనే పలువురు ఉద్యోగులు ఆన్లైన్ మీటింగులు జాయిన్ అవుతున్న సమయంలో వారి హావభావాలు, ఇంట్లో వారు చేస్తున్న పనులు, పిల్లల అల్లరికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పటిదాకా వారి గుమ్మం దాటి బయట తెలియనివాళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా పేమస్ అయ్యారు. ఇదే అదునుగా చేసుకుని పలువురు ఔత్సాహికులు ఆదాయ మార్గాలను కూడా వెతుక్కున్నారు. తాజాగా ఇటువంటి వార్తే ఒకటి సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతున్నది.

    ఇంగ్లాండ్ లోని లాంక్ షైర్ కు చెందిన ఒక రైతు డాట్ మెక్ కార్తి చేసిన పని ఆమెకు 50 వేల డాలర్ల ఆదాయం సంపాదించి పెట్టింది. సరదాకు చేసిన పని ఆమెకు ఆదాయ మార్గమైంది. సాధారణంగా జూమ్ మీటింగులకు హాజరయ్యే సమయంలో ఆమె వీడియోను తన పొలంలో ఉన్న మేకలవైపునకు తిప్పేది. దాంతో మీటింగులలో ఉన్న ఇతర సభ్యులు ఆ మేకలను ఆసక్తిగా చూసేవారు. అలా కొద్దిసేపు ఉంచేది మెక్ కార్తి. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఒకసారి నెట్ లో అప్లోడ్ చేసింది. దీంతో ఇది నెటిజన్లను విపరీతంగా నచ్చింది.





    దాంతో ఆమె మేకలు ఉన్నఫళంగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడామె మేకలను వీడియోకాల్ లో చూపించేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ నే ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా, రష్యా, చైనా, యూఎస్ లో ఈ మేకలకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ దేశాలనుంచి ఫోన్ చేసి మేకలతో సరదాగా ముచ్చటించడం వంటివి చేస్తుంటారట నెటిజన్లు. ఇందుకోసం ఆమె కొంత మొత్తాన్ని చార్జ్ చేస్తున్నది. దీనిపై మెక్ కార్తి స్పందిస్తూ.. ‘నేను దాదాపు రోజంతా ఫోన్ లోనే ఉంటాను. ఆఫీసు మీటింగుల సమయంలో ఒకసారి మా ఫామ్ లో ఉన్న మేకను చూపించాను. కానీ అది అందరికీ నచ్చింది. దీంతో నేను ఇది కంటిన్యూ చేశాను. దీనిని మా బాస్ కూడా గమనించలేదు...’ అని తెలిపింది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు