Hell's Gate : నరకానికి గేటు... లోపలికి వెళ్తే... తిరిగి రారు... భూమిపై ఎక్కడుంది?

Hell's Gate on Earth : ఇది నమ్మేలా లేకపోయినా... ఇలాంటి ప్రదేశం ఒకటి భూమిపై ఉంది. అక్కడ ఏం జరుగుతుందో? అది ఎందుకు నరకానికి దారి అయ్యిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 5, 2020, 8:11 AM IST
Hell's Gate : నరకానికి గేటు... లోపలికి వెళ్తే... తిరిగి రారు... భూమిపై ఎక్కడుంది?
Hell's Gate : నరకానికి గేటు... లోపలికి వెళ్తే... తిరిగి రారు... భూమిపై ఎక్కడుంది? (credit - twitter)
  • Share this:
Hell's Gate on Earth : ఈ భూమిపై ఎన్నో చిత్రమైన ప్రదేశాలున్నాయి. వేర్వేరు కారణాలతో అవి రహస్యాలుగా మారాయి. అలాంటి వాటిలో ఒకటిగా చేరింది టర్కీలోని పురాతన నగరం హీరాపోలీస్ (Hierapolis). అక్కడో అత్యంత పురాతన ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని నరకానికి గేటు అని ప్రజలు పిలుస్తారు. ఆ ఆలయంలోపలికి వెళ్లిన వాళ్లు బయటకు రారు. ఆలయ పరిసరాల్లోకి వెళ్లిన వాళ్లు కూడా తిరిగి రారు. ఎప్పటికీ రారు. స్థానికులు ఏమంటారంటే... ఆ ఆలయం దగ్గరకు మనుషులు గానీ, జంతువులు గానీ ఏవి వెళ్లినా... వెంటనే చనిపోతాయని నమ్ముతారు. ఎన్నో ఏళ్లుగా హీరాపోలీస్ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఆలయం దగ్గరకు వెళ్లిన వాళ్లు గ్రీక్ దైవం నుంచి వచ్చే విష వాయువులు పీల్చి చనిపోతారని స్థానికులు అంటున్నారు.


చరిత్రలో చాలా మంది ఈ మిస్టరీ సంగతి తేల్చుతామని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీన్ని నరకానికి గేటుగా స్థానికులు చెబుతున్నారు. గ్రీక్, రోమన్ కాలంలో... మరణ భయంతో ఆ ఆలయం దగ్గరకు ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ మిస్టరీకి చెక్ పెట్టారు. సైంటిస్టుల ప్రకారం... ఈ ఆలయం కింద నుంచి విషపూరితమైన కార్బన్ డై ఆక్సైడ్ వాయువు కంటిన్యూగా లీక్ అవుతూనే ఉంది. అందుకే... మనుషులు, జంతువులు, పక్షులు చనిపోతున్నాయి.


ఆలయం కింద ఓ గుహ ఉంది. అక్కడి నుంచి భారీగా కార్బన్ డై ఆక్సైడ్ వస్తోంది. మీకు తెలుసా... ఏ వ్యక్తి అయినా తాను పీల్చే గాలిలో 10 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉంటే చాలు... ఆ వ్యక్తి నెక్ట్స్ 30 నిమిషాల్లో చనిపోతారు. ఈ ఆలయ పరిసరాల్లోని గాలిలో... 91 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉంది. అందుకే వెంటనే చనిపోతున్నారు.


ఈ ఆలయం లోపల, బయట... చుట్టుపక్కల ఏ ప్రాణీ బతకట్లేదు. పురుగులు కూడా చనిపోతున్నాయి. ఈ ప్రదేశం ఎప్పుడూ దట్టమైన పొగ మంచు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందువల్ల ఇది జనరల్‌గా ఎవరికీ కనిపించదు. దగ్గరకు వెళ్తేనే కనిపిస్తుంది. కానీ అలా వెళ్తే ప్రాణాలు పోతాయి. చిత్రమేంటంటే... ఈ విషపూరిత ప్రదేశంలో వేల ఏళ్ల కిందట ఆలయాన్ని ఎలా నిర్మించారో? ఆలయం నిర్మించినప్పుడు విష వాయువు లేదనుకోవాలా? ఆలయం నిర్మించాకే అది వెలువడసాగిందా? ఇవన్నీ అదనపు మిస్టరీ ప్రశ్నలు. ఈ ఆలయం గురించి తెలిశాక... దీన్ని చూసేందుకు రావొద్దని స్థానికులు చెబుతున్నారు. ఆసక్తి కొద్దీ వచ్చి... ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: August 5, 2020, 8:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading