పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కొందరు యజమానులు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తూ అన్యోన్యంగా మెలుగుతారు. అయితే ఈ మితిమీరిన ప్రేమ.. ఆ పెంపుడు జంతువులను బద్ధకస్తులుగా మారుస్తుంది. ఈ విషయం నిజమేనని ధ్రువీకరిస్తోంది ఒక పెంపుడు శునకం. తన యజమాని చెప్పిన పని చేయడానికి ఇష్టపడని ఓ శునకం.. వింత హావభావాలతో బద్ధకంగా ప్రవర్తించింది. పైగా యజమాని ఆదేశాన్ని, కోపాన్ని చాలా లైట్‌గా తీసుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
ఓ పెంపుడు కుక్క చాలా లేజీగా తన మండేమూడ్‌ను ప్రదర్శించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఉన్నదేమిటంటే.. ఓ కుక్కకు దాని యజమాని ఓ పార్కులో ట్రైనింగ్ ఇస్తున్నాడు. కొంచెందూరం దాన్ని తిప్పిన తరువాత ఓ చోట చిన్నజంప్ చేయమని ఆదేశించాడు. ఇందుకు జంపింగ్ స్టిక్‌ను వాడాడు. కానీ కుక్క మాత్రం చాలా బద్దకంగా ప్రవర్తిస్తూ.. జంప్‌ను పూర్తి చేయలేకపోయింది. పైగా జంపింగ్ స్టిక్ పై నుంచి తన కాళ్ళను కూడా తీయడానికి ఇష్టపడక అలాగే ఉండిపోయింది.
Some doggos aren’t built for the obstacle course. Wait for it… pic.twitter.com/M50Y3jOBFc
— Rex Chapman?? (@RexChapman) July 21, 2021
I think after the last few years this pup speaks for us all. Epic display of “fuckit.”
— Matt Walton (@themattwalton) July 21, 2021
I don’t know which is funnier the owner’s chuckle or the dog’s refusal to get up after falling. ?
— ShakariSBriggs (@ShakariSBriggs) July 21, 2021
సదరు యజమాని ఎంత అదిలించినా, ఆ శునకం అక్కడి నుంచి అంగుళం కూడా కదలలేదు. అతడు కోపంతో అరిచినా కూడా అది లెక్కచేయలేదు. బహుశా వీకెండ్ తరువాత ఇంతటి ఎక్సర్‌సైజ్ ఏంటి అనుకుందో ఏమో గానీ.. తన లేజీనెస్‌ని బ్రహ్మండంగా ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ కుక్క బద్దకం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
ఈ వీడియోకు వివిధ రకాల కామెంట్లతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. ఈ శునకంతో ప్రేమలో పడిపోయానని, వీడియో బ్రహ్మండంగా ఉందని కామెంట్ పెట్టారు ఒక యూజర్. ఈ ఏడాదిలో ఇదే అద్భుతం అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి పెంపుడు కుక్క కోసం నేను కూడా వెతుకుతున్నానని మరో నెటిజన్ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ శునకం నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బాగానే సంపాదించుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dog, Viral Video