HOME »NEWS »TRENDING »this dessert from bihar being sold for rs 7500 per kg in usa srd

Bihar Dessert : ఆ బీహార్ స్వీట్ కి అమెరికాలో యమా క్రేజ్.. కేజీ స్వీట్ ధర వింటే షాకవ్వాల్సిందే..!

Bihar Dessert : ఆ బీహార్ స్వీట్ కి అమెరికాలో యమా క్రేజ్.. కేజీ స్వీట్ ధర వింటే షాకవ్వాల్సిందే..!
Khaja Sweet (From Twitter)

Bihar Dessert : మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన స్వీట్లు, చిరుతిళ్లు ఫేమస్ అవుతాయి. అయితే బీహార్ లో తయారవుతున్న ఓ కాజాకి మాత్రం అమెరికాలో యమా డిమాండ్ వుంది. ఎంతలా అంటే.. ఈ స్వీట్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. స్వీట్ అండ్ సాల్ట్ గా ఉండే ఈ 52 పొరల కాజా ధర ఎంతో తెలుసా..?

  • Share this:
    మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన స్వీట్లు, చిరుతిళ్లు ఫేమస్ అవుతాయి. తెలంగాణలో సకినాలు, బొబ్బట్లు,... ఏపీలో కాకినాడ కాజాలు, బందరు లడ్డూలు, అలాగే బెంగాల్‌లో రసగుల్ల ఇలా... మన దేశంలో లభించే స్వీట్ల రకాలు చాలా దేశాల్లో లభించవు. వివిధ పండుగలకు వివిధ రకాల స్వీట్లను తయారుచేస్తుంటారు. మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల స్వీట్లలో కాజా కూడా ఒక‌టి. ఏపీలో ప‌లు ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా త‌యారు చేయ‌బ‌డిన కాజాలు మ‌న‌కు అనేక స్వీట్ షాపుల్లో ల‌భిస్తాయి. అయితే కేవ‌లం ఏపీ మాత్ర‌మే కాదు.. బీహార్‌, ఒడిశా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల‌లోనూ కాజాల‌ను త‌యారు చేస్తారు. కాక‌పోతే రుచి వేరేగా ఉంటుంది. అయితే బీహార్ లో తయారవుతున్న ఓ కాజాకి మాత్రం అమెరికాలో యమా డిమాండ్ వుంది. ఎంతలా అంటే.. ఈ స్వీట్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. స్వీట్ అండ్ సాల్ట్ గా ఉండే ఈ 52 పొరల కాజా ధర ఎంతో తెలుసా..?

    అమెరికా నుంచి చాలా మంది ఈ బీహార్ కాజాలను ఆర్డ‌ర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేజీ కాజాల ధ‌ర అమెరికాలో ఏకంగా రూ.7500 ప‌లుకుతోంది. అయితే కాజాల‌కు ఇంత క్రేజ్ స‌డెన్‌గా ఎందుకు పెరిగిందో అర్థం కావ‌డం లేదు. అయితే, భార‌త మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పాయికి కాజాలు అంటే చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని ఆయ‌న అప్ప‌ట్లోనే స్వ‌యంగా చెప్పారు. ఇక ప్ర‌స్తుత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా కాజా అంటే ఇష్ట‌మ‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే దీనికి అమెరికాలో ఇంత డిమాండ్ రావ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందో తెలియ‌డం లేదు. కానీ కేజీ కాజాలు మాత్రం ఏకంగా రూ.7500 వ‌రకు ధ‌ర ప‌లుకుతున్న‌ాయ్.



    అయితే పూరీలోని జ‌గ‌న్నాథ్ ఆల‌యంలో కాజాల‌ను భ‌క్తులు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తార‌ని, అందుక‌నే ప్ర‌సాదంగా భావించి కొంద‌రు కొంటున్నారని తెలుస్తోంది. కానీ బీహార్ నుంచే ఎక్కువ‌గా ఈ స్వీట్‌ను అమెరికా వాసులు తెప్పించుకున్నారని స‌మాచారం. ఏపీ కాకుండా ప‌లు ఇత‌ర రాష్ట్రాల్లో కాజాలు ల‌భిస్తాయి కానీ వాటిని భిన్న ర‌కాల ప‌దార్థాల‌తో త‌యారు చేస్తారు. అందువ‌ల్ల రుచి వేరుగా ఉంటుంది. ఏది ఏమైనా కాజాకు ఇంత‌లా డిమాండ్ పెర‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:December 25, 2020, 15:37 IST