• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • THIS CUTE MONKEY HELPS WOMAN IN CUTTING VEGETABLES VIDEO GOES VIRAL AND NETIZENS GIVES FUNNY REPLIES SRD

Viral Video : కట్టుకున్నోడి కన్నా కోతే మేలు..వంట సాయం చేస్తున్న వానరం...

Viral Video : కట్టుకున్నోడి కన్నా కోతే మేలు..వంట సాయం చేస్తున్న వానరం...

Photo Credit : Twitter

Viral Video : కోతి అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. కానీ, ఈ కోతి గారు ఓ మహిళకు నేనున్నానంటూ వంటపనిలో సాయం చేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం.

  • Share this:
    భార్యభర్తలంటే అన్యోన్యంగా మెలగాలి. ప్రేమానురాగాలతో బతకాలి. కాని ఈ కాలం జంటలు... చీటికి మాటికి గొడవలు పడుతున్నారు. ప్రతి పనిలో ఒకరికొకరు సాయపడాల్సిన భార్యభర్తలు ప్రతి దానికి గొడవలు పడుతున్నారు. కానీ, ఇక్కడో కోతి ఓ ఇల్లాలికి సాయం చేసింది. కోతి అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. కానీ, ఈ కోతి గారు ఓ మహిళకు నేనున్నానంటూ వంటపనిలో సాయం చేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఆర్ఎస్ అధికారి అమన్ ప్రీత్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఓ మహిళ కూరగాయలు కట్‌ చేస్తోంది. సాయం చేయడానికి నేనున్నాగా అన్నట్లుగా ఓ కోతి అక్కడే బుద్ధిగా కూర్చుంది. దీంతో ఆమె తన చేతిలో ఉన్న వాటిని కోతి ఎదురుగా ఉన్న గిన్నెలో వేసింది. ఇంకేముందీ వానరం వాటన్నింటినీ చకాచకా చేతితో విరుస్తోంది. దానికి ఇంతకుముందే ట్రైనింగ్‌ ఇచ్చినట్లుగా ఎంతో స్పీడ్‌గా పని చేయడం విశేషం.


    ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. " కోతికున్న వివరం కట్టుకున్నోడికి లేకపాయె" అని ఒకావిడ తన భర్త ఏ సాయమూ చేయడని చురకలంటించగా, దీనికి ఇంత టాలెంట్‌ ఎక్కడ నుంచి వచ్చిందోనని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్లు కోతులతోనే కాదు..ఎవరితోనైనా పని చేయించగలరంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: