హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: తప్పిపోయిన కుక్కను భుజాలపై మోస్తూ.. పది కిలోమీటర్లు నడిచారు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: తప్పిపోయిన కుక్కను భుజాలపై మోస్తూ.. పది కిలోమీటర్లు నడిచారు.. వైరల్ అవుతున్న వీడియో

చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో కుక్క అక్కడికి తప్పిపోయి వచ్చిందని వాళ్లు భావించారు. ఆ కుక్క నడవడానికి ఇబ్బంది పడుతుంటడంతో దాన్ని భుజాలపైనే కొండ నుంచి కిందకు మోసుకువెళ్లారు. మొత్తానికి దాని యజమానిని కనిపెట్టి.. ఆ మూగజీవిని ఆమె వద్దకు చేర్చారు.

ఇంకా చదవండి ...

  మంచు కొండల్లో చిక్కుకుపోయిన ఒక కుక్కను పది కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్లి, దాన్ని రక్షించిన ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకుంది. ఆ దేశంలోని విక్లో పర్వతాల్లో పర్యటనకు వెళ్లిన ఒక జంటకు మంచులో కుక్క కనిపించింది. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో అది అక్కడికి తప్పిపోయి వచ్చిందని వారు భావించారు. ఆ కుక్క నడవడానికి ఇబ్బంది పడుతుంటడంతో దాన్ని భుజాలపైనే కొండ నుంచి కిందకు మోసుకువెళ్లారు. మొత్తానికి దాని యజమానిని కనిపెట్టి.. ఆ మూగజీవిని ఆమె వద్దకు చేర్చారు. టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఒక వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "నా సహోద్యోగి పెంచుకుంటున్న కుక్క రెండు వారాల క్రితం విక్లో పర్వతాల్లో తప్పిపోయింది. దాన్ని ఇద్దరు భార్యాభర్తలు కనుగొన్నారు. దాని ప్రాణాలు కాపాడటంతో పాటు కుక్కను యజమానితో కలిపారు. అప్పుడు తీసిన వీడియోనే ఇది" అని వీడియోకు ట్యాగ్ పెట్టారు.

  45 సెకన్లు ఉన్న ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఒక వ్యక్తి తన భుజంపై కుక్కను మోస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ కుక్కకు స్వెటర్ కప్పారు. ఆ ప్రాంతమంతా మంచుతో కప్పి ఉంది. చలి ఎక్కువగా ఉండటంతో కుక్క నడవలేకపోయింది. దీంతో దాన్ని మోసుకెళ్లాల్సి వచ్చింది.

  ఇలా సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు నడిచి.. కొండ ప్రాంతం నుంచి కిందికి వెళ్లారు. ఎలాగోలా కుక్కను కాపాడిన తరువాత దాని యజమాని గురించి ఆరా తీశారు. మొత్తానికి ఆమె ఆచూకీ కనుక్కొని కుక్కను ఆమె వద్దకు చేర్చారు.

  ఆన్‌లైన్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కుక్కను రక్షించడానికి ఆ వ్యక్తి చేసిన పనిని ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. మానవత్వానికి అసలైన అర్థం చెప్పారని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. కుక్కను కాపాడటానికి వారు ఎంతో కష్టపడ్డారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఒక ప్రాణాన్ని కాపాడటానికి వారు పడిన తాపత్రయం అభినందనీయమని ఇంకొక వ్యక్తి కామెంట్ పెట్టారు. ఇలా వందలాదిమంది నెటిజన్లు ఆ జంటను మెచ్చుకుంటున్నారు.

  First published:

  Tags: Dog, Social Media, Trending, Trending videos, Twitter, Viral, VIRAL NEWS, Viral Video

  ఉత్తమ కథలు