Home /News /trending /

THIS CHINESE COMPANY FINES ITS EMPLOYEES FOR GOING TO BATHROOM ALLEGES THE WORKERS ARE LAZY NEWS WENT VIRAL MS

రోజుకు ఒక్కసారే యూరిన్ పోసుకోవాలట.. మళ్లీ వస్తే ఫైన్ కడితేగానీ వెళ్లనివ్వరట.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీటిని తాగడం.. విసర్జించడం.. ఇది ఒక మంచి ఆరోగ్య జీవనశైలి. కానీ ఇక్కడ అలా కుదరదు. నీళ్లు ఎంత తాగినా రోజుకు ఒక్కసారే మూత్రానికి వెళ్లాలి. ఆ ఒక్కసారి మాత్రమే ఉచితంగా టాయిలెట్ ను వాడుకోనిస్తారు. కాదు, కూడదు.. మేం మళ్లీ వెళ్తాం అంటే మాత్రం...

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :
  ఆరోగ్యమైన జీవనశైలికి అంతే ఆరోగ్యకరమైన అలవాట్లు ఎంతో అసవరం. ఆవశ్యకం. ఈ క్రమంలో మనిషి నీటిని ఎక్కువ తాగాలని అంటారు వైద్య నిపుణులు. ఇరవై ఏళ్ల పైబడిన వ్యక్తి రోజుకు 8 లీటర్ల నీటిని తాగాలని చెబుతారు వైద్యులు. నీటిని తాగడం.. విసర్జించడం.. ఇది ఒక మంచి ఆరోగ్య జీవనశైలి. కానీ ఇక్కడ అలా కుదరదు. నీళ్లు ఎంత తాగినా రోజుకు ఒక్కసారే మూత్రానికి వెళ్లాలి. ఆ ఒక్కసారి మాత్రమే ఉచితంగా టాయిలెట్ ను వాడుకోనిస్తారు. కాదు, కూడదు.. మేం మళ్లీ వెళ్తాం అంటే వెళ్లనిస్తారు.. కానీ ఉచితంగా కాదోయ్.. జరిమానా కట్టి.. జరిమానా అంటే అదేదో రూపాయో.. పది రూపాయలో అనుకునేరు. సుమారు రూ. 220 పై మాటే. ఈ లెక్కన చూసుకుంటే నెల జీతం మొత్తం మూత్రం పాలే అవ్వడం ఖాయం. అంతేకాదు.. ఇంకా అప్పు కూడా చేయాలి. ఇంతకీ ఈ విధానం ఎక్కడ అమల్లో ఉందో తెలుసా..? మీ అంచనా కరక్టే. నియంత్రుత్వ పాలనలో ఉన్న మన పొరుగు దేశం చైనాలో..

  అసలు విషయానికొస్తే.. చైనాలోని అన్పు ఎలక్ట్రిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ (anpu electric science and technology) సంస్థలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలోని డాంగ్ గువాంగ్ లో ఉన్న ఈ సంస్థ తీసుకొచ్చిన నిబంధనలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి రోజుకు ఒక్కసారి మాత్రమే ఫ్రీగా యూరిన్ గా వెళ్లాలి. అంతకుమించి వెళ్లకూడదు. ఒకవెళ అర్జెంటైతే.. అతను లేదా ఆమె వెళ్లిన ప్రతిసారి 20 యువన్లు (భారత కరెన్సీలో రూ. 226.55) చెల్లించాలి. ఇలా ఎన్నిసార్లు వెళ్లితే అన్ని రూ. 225 లు ఖర్చు చేయాల్సిందే మరి.

  కాగా.. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ పలువురు ఉద్యోగులు సంస్థ ఎదుట ధర్నాకు కూడా దిగారు. కానీ సదరు సంస్థ మాత్రం వాటిని ఖాతరు చేయలేదు. పోగా.. వారిలో ఏడుగురు ఉద్యోగులను తొలగించడం గమనార్హం. ఇక ఈ విధానంపై అన్పు సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఉద్యోగులు సోమరిపోతుల్లా తయారవుతున్నారని ఆరోపించారు. వారి నుంచి సోమరితనాన్ని దూరం చేయడానికే తాము ఇలా చేయాల్సి వస్తుందని అన్నారు. చాలా మంది ఉద్యోగులు.. యూరిన్ కని వెళ్లి గంటల పాటు టాయ్లెట్ లో ముచ్చట్లు పెడుతూ.. విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని.. దానిని మార్చుకోవాలని చాలా సార్లు చెప్పి చూసినా వాళ్లు మారలేదని అన్నారు.

  అందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చామని... దీని ద్వారా అయినా వారికున్న సోమరితనాన్ని వదిలించుకుని బుద్దిగా పనిచేసుకుంటారని ఆశిస్తున్నామని ఆ ప్రతినిధి తెలిపారు.  ఒకటి కంటే ఎక్కువసార్లు మూత్రశాల కు వెళ్లే వ్యక్తులు జరిమానా చెల్లించాల్సిందేనని అన్నారు. ఇందులో ఇంకో తిరకాసు ఉందండోయ్...!! అలా వెళ్లాలనుకునే ఉద్యోగులు ముందు మేనేజర్ వద్దకో లేదా సంస్థ యజమాని దగ్గరికో వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలట. నీళ్లు తాగకుండా ఉండటమే దీనికి పరిష్కారమేమో.. ఏమో చైనా ప్రభువుల నియంత పాలన మాదిరే అక్కడి సంస్థలలో నిరంకుశత్వం పెరిగిపోతున్నదనడానికి ఈ ఘటనే ఉదాహరణ. అందుకే అన్నారు యథా రాజా.. తథా ప్రజా..
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: China, OMG, Social Media, Trending, Viral, VIRAL NEWS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు