కుక్క బీగిల్ డాన్స్ వేస్తే ఎట్టుంటదో తెలుసా...

Bailey loves Reggeaton : బెయిలీ లవర్స్ రెగ్గీటన్ కాప్షన్‌తో రిలీజైన ఈ వీడియోను ఇప్పటివరకూ 3 కోట్ల మందికి పైగా చూశారు. 13 లక్షల మంది షేర్ చేశారు. 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

news18-telugu
Updated: December 16, 2019, 10:39 AM IST
కుక్క బీగిల్ డాన్స్ వేస్తే ఎట్టుంటదో తెలుసా...
కుక్క బీగిల్ డాన్స్ వేస్తే ఎట్టుంటదో తెలుసా... (credit - FB - Wendy Berenguer)
  • Share this:
కుక్కలకు టాలెంట్ ఎక్కువే. మనుషుల్ని గుర్తించడం, విశ్వాసం చూపడమే కాదు. కొత్త విషయాలు నేర్చుకోవడంలోనూ చురుగ్గానే ఉంటాయి. అందుకే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కుక్కలపై వేల కొద్దీ అకౌంట్లు ఉన్నాయి. కుక్కల రక్షణ సంస్థలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా బెయిలీ అనే కుక్క ప్రత్యేకమైన డాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కిచెన్ ఫ్లోర్‌పై... ప్యూర్టోరికో సాంగ్ వింటూ... ఓ మహిళతో కలిసి... రెండు కాళ్లపై నిలబడి... అదిరిపోయే బీగిల్ డాన్స్ స్టెప్పులు వేసింది. 20 సెకండ్లపాటూ వేసిన ఈ డాన్స్ అందరికీ తెగ నచ్చేస్తోంది. బెయిలీ లవర్స్ రెగ్గీటన్ కాప్షన్‌తో రిలీజైన ఈ వీడియోను ఇప్పటివరకూ 3 కోట్ల మందికి పైగా చూశారు. 13 లక్షల మంది షేర్ చేశారు. 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. 2.89 లక్షల మంది కామెంట్స్ చేశారు. ఈ తుఫాను కొనసాగుతోంది. మరి మీరు కూడా ఆ వీడియోని అలా అలా చూసేయండి మరి.


First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు