Home /News /trending /

THIS BAHUBALI GUJIYA IS PRICED AT RS 1200 PER PIECE AND HERE THE DETAILS OF THE SWEET GH SRD

Bahubali Gujiya : ఈ బాహుబలి కజ్జికాయ ధర రూ. 1200.. ఇది ఎందుకంత స్పెషలంటే..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Bahubali Gujiya : హోలీ రంగురంగుల పండుగ.. స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు తింటూ ఆనందంగా జరుపుకునే పండగ ఇది. మన దగ్గర కాస్త తక్కువే కానీ ఉత్తరాదిలో మాత్రం హోలీ వస్తోందంటే చాలు.. ప్రత్యేకంగా ఎన్నెన్నో వంటకాలను ముందుగా సిద్ధం చేస్తారు.

ఇంకా చదవండి ...
హోలీ రంగురంగుల పండుగ.. స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు తింటూ ఆనందంగా జరుపుకునే పండగ ఇది. మన దగ్గర కాస్త తక్కువే కానీ ఉత్తరాదిలో మాత్రం హోలీ వస్తోందంటే చాలు.. ప్రత్యేకంగా ఎన్నెన్నో వంటకాలను ముందుగా సిద్ధం చేస్తారు. అందులో మిఠాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆ మిఠాయిల్లో గుజియా అదేనండీ మన కజ్జికాయలు తప్పనిసరిగా ఉండాల్సిందే. కోవా, డ్రైఫ్రూట్స్, చక్కెర అన్నీ కలిపిన ఫిల్లింగ్ తో నూనెలో వేయించిన ఈ కజ్జికాయలను అక్కడి వారు చాలా ఇష్టంగా తింటుంటారు. అందుకే అక్కడి వారు ఇందులోనూ ఎన్నో రకాలను తయారుచేశారు. కోవా గుజియా, డ్రైఫ్రూట్ గుజియా, షుగర్ ఫ్రీ గుజియా అంటూ రకరకాల కజ్జికాయలను అందుబాటులో ఉంచుతారు స్వీట్ షాపుల వారు. తాజాగా లక్నోలోని చప్పన్ భోగ్ అనే మిఠాయి దుకాణం సరికొత్త గుజియాని తయారుచేసింది. పద్నాలుగు అంగుళాలు అంటే ఒక అడుగు కంటే ఎక్కువగానే ఉండే ఈ కజ్జికాయ బరువు 1.5 కిలోలు. ఇంత పెద్ద కజ్జికాయలో ఫిల్లింగ్ ఏముంటుందనే కదా మీ ఆలోచన.. ఈ ఫిల్లింగ్ లో కోవా, కుంకుమ పువ్వు, బాదం, పిస్తా, జీడిపప్పు, చక్కెర అన్నీ కలిపిన మిశ్రమం నింపి తయారుచేస్తారు. ఇంత పెద్దగా, బరువుగా ఉంటుంది కాబట్టే ఈ కజ్జికాయ నూనెలో వేగాలంటే కనీసం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందట. అంత సమయం పాటు తక్కువ వేడిలో దీన్ని వేయించి బయటకు తీసి వేడివేడిగా సర్వ్ చేస్తారు కాబట్టే ఈ కజ్జికాయ ధరను రూ. 1200 గా నిర్ణయించారు. సాధారణంగా కజ్జికాయ మహా అయితే రూ. 20 ఉంటుందేమో.. దానికి ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ ఇది ఎంతో స్పెషల్ కాబట్టి దీనికి అంత ధర సరైనదే అని చెప్పుకోవచ్చు. ఈ పెద్ద సైజు కజ్జికాయకు వారు బాహుబలి గుజియా అని పేరు కూడా పెట్టారు.

ఈ షాపు మరో కొత్త ఆఫర్ ని కూడా ప్రారంభించింది. ఈ అతి పెద్ద కజ్జికాయను తినే పోటీని నిర్వహించింది. కేవలం 8 నిమిషాల్లో దీన్ని ఎవరైతే పూర్తి చేస్తారో వారికి చక్కటి బహుమతిని అందజేస్తామని కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. కేవలం ఇదే కాదు.. అతి చిన్న కజ్జికాయను కూడా వీరు తయారుచేశారట. బేబీ గుజియా అని పిలిచే ఈ కజ్జికాయ కేవలం 1.5 అంగుళాలు అంటే మన చూపుడు వేలులో సగం సైజులో ఉంటుందట.



చప్పన్ భోగ్ సంస్థ యజమాని రవీంద్ర గుప్తా ఈ గుజియా తయారీ గురించి వివరిస్తూ ప్రతి సంవత్సరం మేం ఏదో ఒక కొత్తదనాన్ని అందరికీ పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుంటాం. అందుకే కొత్త కొత్త వెరైటీలను పరిచయం చేస్తుంటాం. అందులో ఇది ఒకటి అని వివరించారు. ఈ సంస్థ వార్తల్లో నిలవడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా రూ.50000 కేజీకి అమ్మే ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన స్వీట్ ని అమ్మకానికి ఉంచి ఈ స్వీట్ షాప్ ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకుంది. దీనికి ఎక్సోటికా అని పేరు కూడా పెట్టింది. ఇందులో వివిధ దేశాల నుంచి వచ్చిన 7 నుంచి 8 ముడి పదార్థాలను ఉపయోగించడం వల్లే దానికి అంత ఖరీదు ఏర్పడింది. అమెరికా నుంచి బ్లూ బెర్రీలు, సౌత్ ఆఫ్రికా నుంచి మకడామియా నట్స్, యూరప్ నుంచి హేజల్ నట్స్ అలాగే వివిధ దేశాల నుంచి పైన్ నట్స్, కుంకుమ పువ్వు, మమ్రా బాదం వంటివి తెప్పించి దీన్ని తయారు చేస్తారట.
Published by:Sridhar Reddy
First published:

Tags: Holi 2021, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు