హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : వేప, తులసి ఆకులతో నాచురల్ మాస్క్..ఈ బాబా ఐడియా అదుర్స్ కానీ..

Viral Video : వేప, తులసి ఆకులతో నాచురల్ మాస్క్..ఈ బాబా ఐడియా అదుర్స్ కానీ..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : కరోనా వైరస్ సోకకుండా రెండేసి మాస్క్ లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఈ బాబా మాత్రం తన రూటే సపరేటు అంటున్నాడు. ఈ బాబా తులసి, వేప ఆకులతో నాచురల్ మాస్క్ తయారు చేసుకున్నాడు.

కరోనా ఏ క్షణాన వచ్చిందో కానీ... ముఖానికి మాస్కు వచ్చి అతుక్కుంది. కొన్ని రోజులకు డిజైనర్‌ మాస్కులు వచ్చాయి. చొక్కా రంగు మాస్కు, డ్రెస్‌ డిజైన్‌ మాస్క్‌ అంటూ.. నాణ్యతను పక్కనపెట్టి లుక్‌ కోసం పాకులాడారు ప్రజలు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. డబుల్‌ మాస్క్‌ అంటూ రెండేసి పెడుతున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఒక సాధువు ఆకులతో మాస్క్‌ సిద్ధం చేశాడు. తులసి ఆకు, వేపాకుతో దాన్ని రూపొందించారు. రుపిన్‌ శర్మ అనే ఓ పోలీసు అధికారి.. ఆ సాధువు ముఖానికి ఆకుల మాస్కు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అందులో ఆయన నేచురల్‌ మాస్క్‌ ధరించి కనిపించాడు. అంటే పశువుల నోటికి వేసే జాలీ లాంటి దాంట్లో తులసి ఆకులు, వేప ఆకులు పెట్టి... ఆ సాధువు మాస్క్‌గా వినియోగిస్తున్నారు.

ఆ సాధువు వినియోగిస్తున్న మాస్కు ఎంతవరకు శ్రేయస్కరం అనేది తెలియకపోయినప్పటికీ... ఆ మాస్క్‌ వీడియో మాత్రం వైరల్‌ అవుతోంది. ‘మాస్క్‌.. ఔషధం’ అంటూ నెటిజన్లు ఈ మాస్కు ఫోటోలు, వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. ఆ మాస్క్‌లో వాడుతున్న ఆకులు ఎంతవరకు ఆరోగ్యానికి మంచివి అనేది ఆసాధువు వివరించారు. అంతేకాదు సర్జికల్‌ మాస్క్‌లు, క్లాత్‌ మాస్క్‌ల కంటే ఈ నేచురల్‌ మాస్క్‌లతోనే ఎక్కువ ఉపయోగం అని కూడా ఆయన చెప్పారు.

వేపాకు, తులసి ఆరోగ్యానికి చాలా మంచివని, ఎలాంటి అనారోగ్యాన్ని అయినా దూరం చేస్తాయని ఆయన చెబుతున్నారు. మన పెద్దవాళ్లు కూడా ఈ విషయాలు చెబుతుంటారు. ఆ మాటల్లో నిజం ఉన్నప్పటికీ ఈ మాస్క్‌ తయారీ, వినియోగం అంత సులభమేమీ కాదు. దాంతోపాటు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ఈ మాస్క్‌పై సోషల్‌ మీడియాలో మీమ్స్‌, కామెంట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. హెర్బల్‌, బయో డీగ్రేడబుల్‌, ఎకో ఫ్రెండ్లీ ఫేస్ మాస్క్ అంటూ ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే మోటివేషనల్‌ స్టోరీ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. మాస్క్‌ల విషయంలో ఇప్పటికే మనం చాలా చూశాం. మాస్క్‌లు పెట్టుకునే విధానంలో సెటైర్లు చూశాం. ఇప్పుడు నేచురల్‌ మాస్క్‌ ఆ కోవలోకి వచ్చేసింది.

First published:

Tags: Corona, Face mask, Viral Video

ఉత్తమ కథలు