హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: ముఖం మెరవడానికి కుక్క మూత్రం తాగుతున్న యువతి.. వీడియో వైరల్

Viral: ముఖం మెరవడానికి కుక్క మూత్రం తాగుతున్న యువతి.. వీడియో వైరల్

కుక్క మూత్రం తాగుతున్న యువతి

కుక్క మూత్రం తాగుతున్న యువతి

Dog Urine: ముఖం మీద ముల్తానీ మట్టిలని.. కీర దోస ట్రీట్మెంట్ లని, ఫేస్ ప్యాక్ లని.. మహిళల హంగామా మాములుగా ఉండదు. అయితే ఈ యువతి మాత్రం అందంగా కనిపించడానికి ఎవరూ చేయని పనిచేస్తుంది. ఇంతకీ ఆమె ఏం చేస్తుందో తెలుసా..?

  • News18
  • Last Updated :

మహిళలు సౌందర్య ప్రియులు. అందంగా కనిపించడానికి వారు పడే తపన అంతా ఇంతా కాదు. అందం కోసం వేలకు వేలు దారపోస్తారు. బ్యూటీషియన్లు ఏం ఫుడ్ తినమంటే అది తింటారు. ఇక ముఖం మీద ముల్తానీ మట్టిలని.. కీర దోస ట్రీట్మెంట్ లని, ఫేస్ ప్యాక్ లని.. అబ్బో వాళ్ల హంగామా మాములుగా ఉండదు. అయితే ఈ మహిళ మాత్రం అందంగా కనిపించడానికి ఎవరూ చేయని పనిచేస్తుంది. ఇంతకీ ఆమె ఏం చేస్తుందో తెలుసా..? రోజూ కుక్క మూత్రం తాగుతుంది. ఛీ.. కుక్క మూత్రమా.. అనుకుంటున్నారా..? అవును. అది తాగితే ఆమె ముఖం మీద ఉన్న మొటిమలు తగ్గిపోయాయట.

వివరాల్లోకెళ్తే... అమెరికాకు చెందిన లీనా అనే యువతికి అందరిలోనూ అందంగా కనిపించాలని కోరిక. దాని కోసం ఆమె తరుచూ బ్యూటీ పార్లర్ లకు వెళ్లడం.. ఫేస్ ప్యాక్ లు వేయడం చేసేది. అయితే ఇటీవలే ఆమె ముఖంపై మొటిమలు కనిపించాయి. ఎన్ని ఫేస్ ప్యాక్ లు వేసినా ముఖం నుంచి అవి పోలేదు. తెలిసిన వారి దగ్గర దీని గురించి వాపోయిన ఆమెకు.. పలువురు బంధువులు ఒక సూచన చేశారు.

' isDesktop="true" id="722972" youtubeid="HnQDhjdChZ0" category="trending">

కుక్క మూత్రం తాగితే మంచిదని.. దాంతో ముఖం ప్రకాశవంతమవడమే గాక.. ముఖం మీద ఉన్న మొటిమలు తొలిగిపోతాయని సలహా ఇచ్చారు. దీంతో వెంటనే ఆమె తన పెంపుడు కుక్క మూత్రాన్ని గ్లాస్ లో పట్టి తాగడం మొదలెట్టింది. మిరాకిలో ఏమో గానీ.. అది తాగిన కొద్ది రోజులకే ఆమె ముఖం మీద ఉన్న మొటిమలు తొలిగిపోయి.. ముఖం కాంతివంతంగా మారింది. దీనిపై లీనా మాట్టాడుతూ.. ‘నేను కుక్కను పెంచుతున్నాను. దాని మూత్రాన్నే తాగుతున్నాను. కుక్క మూత్రంలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, కాల్షియం పుష్కలంగా ఉన్ానయి. దానికి క్యాన్సర్ ను నివారించే శక్తి కూడా ఉంది. అందుకే నేను కుక్క మూత్రాన్ని తరుచూ తాగుతున్నాను..’ అని చెప్పుకొచ్చింది.

మొదట్లో కుక్క మూత్రం తాగడం కొంత విరక్తిగా అనిపించినా తర్వాత అలవాటు అయిందనీ, దాంతో రోజుకు నాలుగైదు గ్లాసులైనా తాగుతున్నానని తెలిపింవి లీనా. ఇదిలాఉండగా.. ఈ వార్త నెట్టింట వైరలైంది. దీంతో చాలా మంది నిజంగానే కుక్క మూత్రంలో అన్ని పోషక గుణాలున్నాయా..? అంటూ గూగుల్ ను ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: America, Dog, Trending, Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు