THIS 19 YEARS TEENAGE BOY IN ENGLAND HAS THE EASIEST JOB HE DOES NOTHING HALF THE TIME GOES VIRAL PAH
అదృష్టమంటే ఇతనిదే భయ్యా.. అత్యంత ఈజీ జాబ్.. రోజులో సగం ఖాళీ.. అసలేం చేస్తాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
Easiest Job: ప్రస్తుతం మనలో చాలా మంది ప్రైవేటు ఉద్యోగాలే చేస్తున్నారు. వారికి సంస్థలు.. తక్కువ జీతం ఇచ్చి ఏకంగా 9 నుంచి 10 గంటల పాటు పని చేయించుకుంటాయి. పాపం వారిని పీల్చి పిప్పి చేస్తాయి. కానీ ఇక్కడో యువకుడు ప్రైవేటు ఉద్యోగం, సగం రోజు ఖాళీగానే ఉంటాడు.
Teenage Boy in England: ఇంగ్లండ్ లోని 19 ఏళ్ల యువకుడు.. స్మార్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతను ప్రైవేటు రంగంలోనే ఉద్యోగం చేస్తున్న ఏమాత్రం ఒత్తిడి లేకుండా పనిచేస్తున్నాడు. మన దగ్గర చాలా మంది ప్రైవేటు రంగంలోనే ఉద్యోగాలు చేస్తుంటారు. వీరి పనివేళలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రైవేటు సంస్థలు.. తక్కువ జీతం ఇచ్చి ఏకంగా 9 నుంచి 10 గంటల పాటు పని చేయించుకుంటాయి. ఇక.. శాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక్కొసారి వారి.. వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి మరీ పని చేయాల్సి వస్తుంది. పోనీ అంత కష్టపడిన... సరైన శాలరీ ఉంటుందా.. అది లేదు. ఇక పోరపాటున ఏదైన అవసరం వచ్చి సెలవులు తీసుకుంటే.. శాలరీలో కొత ఉండనే ఉంటుంది. కానీ ఇక్కడో యువకుడు చాలా స్మార్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
ఇంగ్లండ్ కు చెందిన 19 ఏళ్ల బాలుడు.. సైన్స్ బరీ సూపర్ మార్కెట్ లో.. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అతును రోజులో సగం ఖాళీగానే ఉంటాడు. చబ్బీ కిడ్ తన ఇన్ స్టాలో ఆసక్తికర టిక్ టాక్ లను వీడియోలను షేర్ చేస్తుంటాడు. చబ్బీకిడ్ ఇది తనకు ఇష్టమైన పని అని తెలిపాడు. తాను.. ఒక రోజులో.. 20 వరకు డెలివరీలను కస్టమర్ లకు సరైన సమయంలో చేరవేస్తానని తెలిపాడు. ఇక మిగతా ఖాళీ సమయంలో టిక్ టాక్ వీడియోలను పోస్ట్ చేస్తుంటానని పేర్కొన్నాడు.
సాధారణంగా 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న వారు కనీస 6.56 పౌండ్ల వేతనం చెల్లించాలని బొద్దు పిల్లవాడు తెలిపాడు. ఇక.. తనకు 11.50 పౌండ్లు చెల్లించారని తెలిపాడు. నేను నాకు ఇష్టమైనప్పుడు తింటా, తాగుతాను, పనిని ఎంజాయ్ చేస్తుంటానని తన ఆనందాన్ని పంచుకున్నాడు. డెలీవరీలో కస్టమర్లు ప్రవర్తన గురించి చబ్బీ కిడ్ మాట్లాడుతూ.. ఏ ఒక్క కస్టమర్ కూడా తన పట్ల దూకుడుగా వ్యవహరించలేదని అన్నాడు.
అందరితో బాగా ఉంటానని తెలిపాడు. ప్రస్తుతం..ఈ బాలుడికి అతని కంపెనీ మెనెజర్ పెద్ద ఫ్యాన్ అయ్యాడు. అయితే, ఇతన వీడియోలను అప్ లోడ్ చేశాక.. ఇతనిపై నెటిజన్లు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. నీలా ఎవిధంగా ఉద్యోగం పొందాలంటూ కామెంట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ చబ్బీకిడ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.