ఆశ్చర్యం... అద్భుతం... చెట్టు నుంచీ వస్తున్న సంగీత స్వరాలు... మీరే వినండి...

Singing Ringing Tree : ఇంగ్లండ్‌లో 10 అడుగుల ఎత్తుండే ఆ సింగింగ్ రింగింగ్ ట్రీ... ధ్వనుల కళాఖండం. గాలి వచ్చినప్పుడల్లా దాని నుంచీ అద్భుతమైన సంగీత స్వరాలు వినిపిస్తాయి.

news18-telugu
Updated: February 16, 2020, 9:02 AM IST
ఆశ్చర్యం... అద్భుతం... చెట్టు నుంచీ వస్తున్న సంగీత స్వరాలు... మీరే వినండి...
ఆశ్చర్యం... అద్భుతం... చెట్టు నుంచీ వస్తున్న సంగీత స్వరాలు... మీరే వినండి... (credit - Youtube)
  • Share this:
Singing Ringing Tree in England : ఫొటోలోని కళాఖండం చూశారుగా. దాని పేరు సింగింగ్ రింగింగ్ ట్రీ. అసలు ఇలాంటి నిర్మాణం చేపట్టవచ్చనీ, ఇందులోంచీ సంగీత స్వరాలు వచ్చేలా చేయొచ్చనే ఆలోచనే అద్భుతం. ఇది చెట్టు కాదు కదా అన్న ప్రశ్న రావచ్చు. నిజమే ఇది చెట్టు కాదు. స్టీల్ ట్యూబ్‌లతో తయారుచేసిన క్లస్టరే. కానీ దీన్ని ప్రపంచం మొత్తం స్టీల్ ట్రీ అంటోంది. అందుకే దీని పేరు కూడా సింగింగ్ రింగింగ్ ట్రీ అని పెట్టింది. నిజమైన చెట్ల దగ్గరకు వెళ్లినప్పుడు మనకు నీడగా, హాయిగా ఎలా అనిపిస్తుందో... ఈ స్టీల్ ట్రీ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా అలాగే హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే... దీనివైపు గాలి వీటిందంటే చాలు... మనం మన కళ్లతో చూస్తూ కూడా నమ్మలేని సంగీత స్వరాలు వినిపిస్తాయి. (credit - Youtube)

ఆశ్చర్యం... అద్భుతం... చెట్టు నుంచీ వస్తున్న సంగీత స్వరాలు... మీరే వినండి... (credit - Youtube)
ఇంగ్లండ్‌లో సింగింగ్ రింగింగ్ ట్రీ (credit - Youtube)


10 అడుగుల ఎత్తున్న ఈ కళాఖండాన్ని 320 గాల్వనైజ్డ్ స్టీల్ పైపులతో 21 లేయర్లుగా నిర్మించారు. ఇంగ్లండ్‌లో ఈస్ట్ లంకాషైర్ ఎన్విరాన్‌మెంట్ ఆర్ట్స్ నెట్‌వర్క్ దీన్ని 2006లో నిర్మించింది. బెంట్ ట్రీని ఆదర్శంగా తీసుకొని అదే ఆకారంలో దీన్ని నిర్మించారు. అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించడం వల్ల... ఎప్పుడూ హోరు గాలి ఈ పైపుల గుండా వీస్తూనే ఉంటుంది. ఫలితంగా కంటిన్యూగా సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. (credit - Youtube)

ఇంగ్లండ్‌లో సింగింగ్ రింగింగ్ ట్రీ (credit - Youtube)
ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆర్కిటెక్ట్‌లు... మైక్ టాంకిన్, అన్నా లియు... ఇద్దరిదీ ఈ నిర్మాణం ఆలోచన. నిర్మించిన ఏడాదికే అంటే 2007లో వీరు... రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిటీష్ ఆర్కిటెట్స్ (RIBA) నుంచీ నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు. దీన్ని అద్భుతంగా నిర్మించారని RIBA మెచ్చుకుంది. (credit - Youtube)

ఇంగ్లండ్‌లో సింగింగ్ రింగింగ్ ట్రీ (credit - Youtube)


పదేళ్ల తర్వాత 2017 మార్చిలో... అమెరికా... టెక్సాస్‌లోని ఆస్టిన్ శివార్లలో... రెండో సింగింగ్ రింగింగ్ ట్రీని నిర్మించారు. మానోర్ అనే చిన్న పట్టణంలో దాన్ని నిర్మించారు. (credit - Youtube)
ఇంగ్లండ్‌లో సింగింగ్ రింగింగ్ ట్రీ (credit - Youtube)


సంగీతం ఎలా వస్తుంది : మనం వేణువు (ఫ్లూట్) ఊదినప్పుడు గాలి... కన్నాల్లోంచీ బయటకు వెళ్తూ ఎలా సంగీత స్వరాలు పలుకుతుందో... అలాగే ఈ స్టీల్ ట్రీలో కూడా గాలి స్టీల్ పైపుల్లోకి వెళ్లినప్పుడు... స్వరాలు వస్తాయి. దీని నిర్మాణంలో చిన్నా, పెద్ద... రకరకాల వంపులతో పైపుల్ని ఏర్పాటు చేయడం వల్ల... వినిపించే సంగీత స్వరాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. (credit - Youtube)

ఇంగ్లండ్‌లో సింగింగ్ రింగింగ్ ట్రీ (credit - Youtube)


దీన్ని నిర్మించినప్పటి నుంచీ ఇప్పటివరకూ పర్యాటకుల్ని ఇది ఆకర్షిస్తూనే ఉంది. ముఖ్యంగా లవర్స్ ఇక్కడకు వెళ్లి తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ప్రకృతి సంగీత స్వరాలు వింటూ ప్రేమలోకంలో విహరిస్తున్నారు. (credit - Youtube)

ఇంగ్లండ్‌లో సింగింగ్ రింగింగ్ ట్రీ (credit - Youtube)


కింది వీడియో ద్వారా మీరు కూడా ఆ స్వరాలు విని సర్‌ప్రైజ్ అవ్వండి మరి... (credit - Youtube)First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు