పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. కాని బిహార్(Bihar)లోని మూడో తరగతి (Third class)చదువుతున్న ఓ విద్యార్ధిని చూస్తే ఇందుకే ఈ సామెత పుట్టిందేమో అనుకుంటారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు పడే తాపత్రయం అంతా ఇంతా ఉండదు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ..మంచి స్కూల్(School)లో చేర్పించినప్పటికి కొందరికి చదువు అబ్బదు. పాస్ మార్కులు తెచ్చుకోవడానికి పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. కాని మసౌధి(Masoudhi)లోని నడ్వాచపూర్(Nadwachapur)కి చెందిన బాబీ రాజ్(Bobby Raj)మాత్రం నేను స్టూడెంట్‌ని మాత్రమే కాదు టీచర్(Teacher)ని కూడా అంటున్నాడు. అదెలా అని ఆశ్చర్యపోకండి ఈ స్టోరీ చూస్తే అతనెంత టాలెంటెడ్ స్టూడెంటో మీకే అర్ధమవుతుంది.
సరస్వతి పుత్రుడు..
చదువు కొందరికి ఎంత చెప్పినా బుర్రలోకి ఎక్కదు. కొందరికి పుట్టుకతోనే సరస్వతి పుత్రులుగా పుడతారు. అలాంటి వాళ్లు స్కూల్‌లో టీచర్ పాఠాలు చెప్పే ఒక్కసారి వింటే చాలు మెదడులో భద్రపరుచుకుంటారు. బిహార్ రాష్ట్రం మసౌరిలోని నడ్వాచపూర్ గ్రామానికి చెందిన మూడో తరగతి స్టూడెంట్ బాబీ రాజ్ కూడా అలాంటి కోవకు చెందిన వాడే. తాను చదువుతున్నది మూడో తరగతి అయినప్పటికి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్ధుల వరకు ట్యూషన్స్ చెబుతున్నాడంటే అతనికున్న జ్ఞానసంపద ఎంత గొప్పదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
స్టూడెంట్ కమ్ టీచర్ ..
పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని ఈ స్టూడెంట్ కమ్ టీచర్‌కి తల్లిదండ్రులు పెట్టిన పేరు బాబీ రాజ్ అయితే స్థానికులు, గ్రామస్తులు ఆ బుడ్డోడి మేథాశక్తిని మెచ్చుకుంటూ చోటే ఖాన్ సార్ కొందరు..లెక్కల మాంత్రికుడు అని మరికొందరు పిలుస్తున్నారు. ఎంత పెద్ద లెక్కనైనా ఇట్టే చేయగల సమర్ధుడు బాబీ రాజ్. ఈ బాలమేధావిని చూస్తే గతంలో పాట్నాకు చెందిన ఫస్ట్ క్లాస్ చదువుతూ ఐదో తరగతి పాఠాలు అప్పజెప్పిన సోను బీహార్ ప్రతిభను గుర్తుకు తేవడమే కాదు అతడ్ని మించపోయాడని అందరూ చెప్పుకుంటున్నారు.
బాల మేధావి..
బాబీరాజ్ కొద్ది పాట్నా జిల్లా మసౌధి సబ్ డివిజన్ పరిధిలోని చాపూర్ గ్రామంలో మూడో తరగతి చదువుతూనే అందర్ని తనకున్న విద్యాజ్ఞానంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. లెక్కల్లో ఏ సూత్రం అడిగినా ఠక్కున చెప్పే తెలివి తేటలు బాబీ రాజ్‌కే సొంతమయ్యాయి. అందుకే ఎక్కువ తరగతి చదువుతున్న విద్యార్ధులు సైతం మనోడి దగ్గరకు పాఠాలు చెప్పించుకోవడానికి , లెక్కల్లో డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు వస్తుంటారు. అంతే కాదు స్కూల్‌లో చెప్పే పంతుళ్ల కంటే వివరంగా , ఓపిగా ఫార్ములాలు, లెక్కలు చెబుతాడని టెన్త్ క్లాస్ స్టూడెంట్సే చెబుతున్నారు. బాబీ తండ్రి రాజ్‌కుమార్ మహ్తో వృత్తిరీత్యా లెక్కల టీచర్ కావడంతో కొడుకు పేరుతోనే ఓ ట్యూషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పేదలు, హాస్టల్‌లో ఉండే వారికి గణితం నేర్పిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Trending news, VIRAL NEWS