THIEF SHOWS HOW HE BREAKS INTO HOUSE THROUGH BARRED WINDOW IN VIRAL VIDEO PVN
Viral Video : మీ ఇంటికి కూడా ఇలాంటి కిటికీ ఉందా..అయితే దొంగలకి ఈజీ
కిటికీలో నుంచి తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించిన దొంగ
Thief Viral Video : ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దొంగ తెలివిగా తాళం వేసి ఉన్న ఇంట్లోకి ఎలా చొరబడి దొంగతనానికి పాల్పడతానదేది ఈ వీడియోలో మనం చూడవచ్చు. వీడియోని చూసిన నెటిజన్లు దొంగ నైపుణ్యానికి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి కిటికీల విషయంలో జాగ్రత్తలు తీసుకోపోతే రేపు మన ఇంట్లోకి కూడా ఇలాగే చొరబడతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Thief Viral Video : ఈ రోజుల్లో ఇళ్లల్లో దొంగతనాలు సాధారణమైపోయాయి. ఇళ్లల్లో చోరీల ఘటనలు మనం తరుచూ వింటుంటూం కానీ ఆ దొంగతనం ఎలా జరిగిందనేది మాత్రం లైవ్ లో చూడలేం. ప్రజలు తమ ఇళ్లలో దొంగతనం ఎలా జరిగిందో చాలా అరుదుగా చూస్తారు. అయితే దొంగలు ఇళ్లల్లోకి చొరబడటంకి సంబంధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దొంగ తెలివిగా తాళం వేసి ఉన్న ఇంట్లోకి ఎలా చొరబడి దొంగతనానికి పాల్పడతానదేది ఈ వీడియోలో మనం చూడవచ్చు.
రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో... ఓ దొంగ కిటికీ ద్వారా ఇంట్లోకి ఎలా ప్రవేశించాడో పోలీసు అధికారులకు చూపించడాన్ని చూడవచ్చు. ఒక నిమిషం నిడివిగల వీడియోలో... యూనిఫాం ధరించిన అధికారి ఒకరు దొంగ తన టెక్నిక్‌ని ప్రదర్శించడానికి వెళుతున్నప్పుడు అతడి చేతికి సంకెళ్లు తొలగిస్తున్నట్లు కనిపిస్తోంది. అనంతరం దొంగ అని ఆరోపించబడిన వ్యక్తి కిటికీలోని ఒక చతురస్రాకార భాగం ద్వారా అతని శరీరాన్ని వికర్ణంగా అమర్చాడు. మొల్లగా తన శరీరం స్పాంజితో చేసినట్లుగా కిటికీ గుండా ఇంట్లోకి వెళ్లడం కనిపిస్తోంది.
ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే...అతను ఒక నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఎటువంటి శబ్దం లేకుండా ఇంట్లోకి ప్రవేశించగలిగాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్లు దొంగ నైపుణ్యానికి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు ఆ దొంగ నైపుణ్యాన్ని మొచ్చుకుంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తుండగా..మరొందరు అయితే ఇలా అయితే ఇంటి కిటికీల విషయంలో జాగ్రత్తలు తీసుకోపోతే రేపు మన ఇంట్లోకి కూడా ఇలాగే చొరబడతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో గురించి ఓ నెటిజన్.. నేను దీనిని వేరే సందర్భంలో చూస్తున్నాను. నేను నిజంగా స్లిమ్‌గా ఉండాలనుకుంటున్నాను. #zerofigureఅని కామెంట్ చేయగా మరో నెటిజన్.. “అతను వ్యాయామశాలలో ఉండాలి అని కామెంట్ చేశాడు.
ఈ నెల ప్రారంభంలో, అస్సాం పోలీసులు ఆకలితో ఉన్న దొంగను అరెస్టు చేయడం గురించి చేసిన ఓ ట్వీట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. గౌహతిలోని హెంగేరాబరి ప్రాంతంలో ఓ దొంగ దొంగతనానికి వెళ్ళి వెళ్ళిన పని మరిచిపోయి కిచిడీ వండడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న పప్పులను చూసి కిచిడీ వండే పనిలో పడ్డాడు. ఇరుగుపొరుగు వారు అతని ఉనికిని గమనించి ఆ ఇంటి యజమానులు లేరని గుర్తించారు. దొంగ ప్రవేశించిన ఇంట్లోని వంటగది నుండి శబ్దాలు వినిపించడంతో ఇంటి యజమానులు దూరంగా ఉన్నారని తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు దొంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు దొంగను పట్టుకున్నారు.
దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ చేసిన పనికి పోలీసులు కూడా నవ్వుకున్నారు. వింత దొంగ చేసిన దోపిడీ ప్రయత్నాన్ని అస్సాం పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కిచిడీ దొంగ యొక్క ఆసక్తికరమైన కేసు అని అస్సాం పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు . అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దొంగతనానికి ప్రయత్నించినప్పుడు కిచిడీ వండటం మీ శ్రేయస్సుకు హాని కలిగించవచ్చు అంటూ పేర్కొన్నారు పోలీసులు. గత ఏడాది, ఆలయంలోని విరాళాల పెట్టెను దొంగిలించడానికి ముందు దేవుని ఆశీర్వాదం కోరిన దొంగ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.