THEY WONT BURY DEAD BODIES UNIQUE AND WEIRD WAYS OF BURIAL PEOPLE FOLLOW ACROSS WORLD SK
OMG: చనిపోయిన వారిని అక్కడ రాబందులకు విసిరేస్తారు.. ప్రపంచంలో వింత అంత్యక్రియల ఆచారాలు ఇవే
విచిత్ర అంత్యక్రియల సంప్రదాయాలు
Unique and Weird ways of burial: కొన్ని ప్రాంతాల్లో మనలాగా.. మృతదేహాలను పూడ్చిపెట్టారు. కట్టెలపై కాల్చరు. వారి సంస్కృతి, సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అంత్యక్రియల ఆచారాలు చాలా విచిత్రంగా ఉండే జాతులు, తెగల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పుట్టినవారు మరణించక తప్పదు. పక్షులైనా.. జంతువులైనా.. మనుషులైనా.. భూమిపై పుట్టిన ప్రతి జీవి... ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఈ లోకాన్ని విడిచి వెళ్లక తప్పదు. ఆత్మీయులను పోగొట్టుకున్న బాధ చాలా కష్టమైనా.. అందరూ మరణించక తప్పుదు. ఇది సృష్టి ధర్మం. చనిపోయిన వ్యక్తులకు తప్పనిసరిగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రతి మతం కూడా మృతదేహాల విషయంలో విభిన్నంగా వ్యవహరిస్తాయి. తమ సంప్రదాయాల ప్రకారం ఘనంగా తుది వీడ్కోలు పలుకుతారు. ఎవరి ఆచారం ఎలా ఉన్నా.. వారి అంతిమ ఉద్దేశం ఒక్కటే.. తమ వారికి మోక్షం లభించడం..! మోక్షాన్ని పొందేందుకు విభిన్న జాతుల వారు.. విభిన్న మార్గాలను అనుసరిస్తుంటారు.
భారత దేశంలో అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. హిందువైనా..ముస్లిమైనా.. క్రిస్టియనైనా..ప్రతి మతానికి వారి సొంత అంత్యక్రియల ఆచారాలు ఉన్నాయి. మన దేశంలో మృతదేహాలను ఎక్కువగా పూడ్చిపెడతారు. లేదంటే దహనం చేస్తారు. కానీ ప్రపంచంవ్యాప్తంగా ఎన్నో విచిత్ర సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనలాగా.. మృతదేహాలను పూడ్చిపెట్టారు. కట్టెలపై కాల్చరు. వారి సంస్కృతి, సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అంత్యక్రియల ఆచారాలు చాలా విచిత్రంగా ఉండే జాతులు, తెగల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
స్కై బరియల్:
ఈ ఆచారాన్ని ముఖ్యంగా టిబెట్, మంగోలియా ప్రాంతాలలో పాటిస్తారు. ఇందులో చనిపోయిన వారి శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి పర్వతంపైన లేదంటే చెట్టుపై వేలాడదీస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ త్వరగా స్వర్గ ద్వారాలకు చేరుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
ఫామ్డిహానా:
ఈ పద్ధతిని మడగాస్కర్‌లోని మలగసీ ప్రజలు అనుసరిస్తారు. ఇందులో చనిపోయిన వ్యక్తి శవాన్ని ముందుగా సమాధిలో పాతిపెడతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీస్తారు. స్నానం చేయించి.. శుభ్రమైన దుస్తులు వేస్తారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులంతా ఆ శవం చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తారు. నృత్య కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. మృతదేహాన్ని తిరిగి పాతిపెడతారు.
ఇష్టమైన వారి హత్య:
ఇది చాలా విచిత్రమైన సంప్రదాయం. చాలా వెనకబడిన ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ ఆచారం ప్రకారం.. చనిపోయిన వ్యక్తికి సన్నిహితంగా ఉండే వ్యక్తి గొంతుకోసి హత్య చేస్తారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే..ఏ వ్యక్తి కూడా ప్రపంచాన్ని విడిచి ఒంటరిగా వెళ్లకూడదు. అందుకే వారికి తోడుగా మరొకరిని పంపిస్తారు. వారికి ఇష్టమైన వ్యక్తులను చంపుతారు.
పర్వత శిఖరాలపై శవపేటికలు:
చైనా రాజవంశాలలో ఇలాంటి పద్ధతిని అనుసరించారు. ఇందులో మరణానంతరం శవాలను శవపేటికలో ఉంచి.. పర్వత శిఖరంపై ఉంచుతారు. చనిపోయిన తర్వాత శవాన్ని ఆకాశానికి దగ్గరగా ఉంచితే.. అది సులభంగా స్వర్గానికి చేరుతుందని వారు విశ్వసిస్తారు.
రాబందులకు ఆహారం:
నేటికీ పార్సీ సమాజంలోని ప్రజలు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహానికి స్నానం చేయించి.. తమ ప్రార్థనా స్థలం వద్ద విసిరేస్తారు. ఆ తర్వాత రాబందులు వచ్చి శవాన్ని పీక్కు తింటాయి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత.. వారి ఆత్మ ఖచ్చితంగా తన శరీరాన్ని విడిచిపెట్టాలి. రాబందులు ఈ విషయంలో మానవులకు సహాయం చేస్తాయని వారు నమ్ముతారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.