THEY FOUND IT 130 YEAR OLD TIME CAPSULE FOUND IN BASE OF STATUE OF CONFEDERATE GENERAL GH VB
Copper Box: అది కేవలం రాగి పెట్టె అనుకుంటే పొరపాటే.. తెరిచిచూస్తే.. మతి పోవాల్సిందే..! వివరాలిలా..
రాగి పెట్టె
సోమవారం దొరికిన టైమ్ క్యాప్సూల్ చాలా పెద్దగా ఉంది. 1861-65 సంఘర్షణ సమయంలో దక్షిణాదికి రాజధానిగా ఉన్న వర్జీనియా నగరం రక్తమోడింది. వర్జీనియాలోని రిచ్మండ్లో 1890లో లీ విగ్రహం ప్రతిష్టించగా.. దాన్ని 2021 సెప్టెంబరులో తొలగించారు. ఈ రాగి పెట్టెకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని వర్జీనియా చరిత్రకారులు చాలా సంవత్సరాలుగా వెతుకుతున్న 130 ఏళ్ల క్రితం నాటి ఓ టైమ్ క్యాప్సూల్ ఎట్టకేలకు దొరికేసింది. సోమవారం నాడు అంటే నిన్న కార్మికులు వర్జీనియాలోని రిచ్మండ్లో కాన్ఫెడరేట్ జనరల్ రాబర్ట్ ఈ.లీ విగ్రహ పీఠాన్ని కూల్చివేయడం ప్రారంభించారు. ఆ ప్రదేశం నుంచి ఈ పీఠాన్ని తొలగించే క్రమంలో వారికి ఒక రాగి పెట్టె కనిపించింది. అయితే ఈ రాగి పెట్టె 1887లో భూగర్భంలో నిక్షిప్తం చేసిన టైమ్ క్యాప్సూల్ అని అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో వర్జీనియా గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఆ కాలం నాటికి సంబంధించిన వస్తువులు దొరుకుతాయని అందరూ భావిస్తున్నారు.
"వారు టైమ్ క్యాప్సూల్‌ను కనుగొన్నారు!" అని బాక్స్ ఫొటోలతో పాటు వర్జీనియా గవర్నర్ రాల్ఫ్ నార్తమ్ ట్వీట్ చేశారు. "ఇది ప్రతి ఒక్కరూ వెతుకుతున్న టైమ్ క్యాప్సూల్." అని ఆయన పేర్కొన్నారు. 1887 వార్తాపత్రిక కథనం ప్రకారం, అంతర్యుద్ధం సమయంలో ఉత్తర వర్జీనియా సైన్యానికి నాయకత్వం వహించిన రాబర్ట్ ఎడ్వర్డ్ లీ అనే అమెరికన్ కాన్ఫెడరేట్ జనరల్ విగ్రహం స్థావరంలో ఒక టైమ్ క్యాప్సూల్ దాచిపెట్టారు. ఇందులో బటన్లు, బుల్లెట్లు, కాన్ఫెడరేట్ కరెన్సీ, మ్యాప్‌లు, అరుదైన అవశేషాలు ఉన్నాయి. అలాగే 16వ అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఫొటోతో సహా ఇతర వస్తువులు ఇందులో ఉన్నాయని వార్తా పత్రిక తెలిపింది.
అయితే ఈ రాగి పెట్టె మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటలకు (18:00 GMT) ఓపెన్ చేశామని.. దీన్ని ఎక్స్-రే చేశామని నార్తమ్ మరో ట్వీట్లో తెలిపారు. " అంతర్యుద్ధానికి సంబంధించిన నాణేలు, పుస్తకాలు, బటన్లు, మందుగుండు సామగ్రి కూడా ఈ కాలనాళిక లో ఉండవచ్చునని నిపుణులు విశ్వసిస్తున్నారు," అని గవర్నర్ వెల్లడించారు.
They found it! This is likely the time capsule everyone was looking for. Conservators studying it—stay tuned for next steps! (Won’t be opened today) pic.twitter.com/3lWrsPGZd2
కొద్ది రోజుల క్రితం ఇదే విగ్రహం స్థావరంలో షూబాక్స్-సైజు ఉన్న వేరే కంటైనర్ కూడా లభ్యమైంది. దీన్ని గత వారం సంరక్షకుల పర్యవేక్షణలో ఓపెన్ చేశారు. అయితే అది 1887 వార్తాపత్రికలో పేర్కొన్న టైమ్ క్యాప్సూల్ కాదు. ఇందులో నీళ్లలో తడిసి ముద్దైన 3 పుస్తకాలు.. తడిసిన క్లాత్ కవర్లో ఒక ఫొటోగ్రాఫ్, ఒక నాణెం ఉన్నాయి. విగ్రహాన్ని నెలకొల్పిన కొందరు కార్మికులు భావితరాల కోసం ఈ వస్తువులు జ్ఞాపికలుగా వదిలిపెట్టి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సోమవారం దొరికిన టైమ్ క్యాప్సూల్ చాలా పెద్దగా ఉంది. 1861-65 సంఘర్షణ సమయంలో దక్షిణాదికి రాజధానిగా ఉన్న వర్జీనియా నగరం రక్తమోడింది. వర్జీనియాలోని రిచ్మండ్లో 1890లో లీ విగ్రహం ప్రతిష్టించగా.. దాన్ని 2021 సెప్టెంబరులో తొలగించారు. ఇది ఇటీవలి నెలల్లో తొలగించిన బానిసత్వ అనుకూల సమాఖ్యకు సంబంధించిన అనేక స్మారక చిహ్నాలలో ఒకటి. మిన్నెసోటాలో శ్వేతజాతీయుల పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని హత్య చేశారు.
X-rays give a first look inside the time capsule: Experts believe there may be coins, books, buttons, and even ammunition from the Civil War.
ఆ తరువాత ఈ విగ్రహం న్యాయం కోసం చేపట్టిన నిరసనలకు కేంద్రంగా మారింది. అంతర్యుద్ధం సమయంలో కాన్ఫెడరేట్ సౌత్ యునైటెడ్ స్టేట్స్ నుంచి విడిపోయింది. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాలు రద్దు చేసిన బానిసత్వాన్ని సజీవంగా ఉంచడానికి కాన్ఫెడరేట్ సౌత్ పోరాడింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.