హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Followers For Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌లో టాప్‌ 10లో ఎవరున్నారో తెలుసా.. లిస్ట్‌లో మొదటి స్థానం అతడిదే..

Followers For Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌లో టాప్‌ 10లో ఎవరున్నారో తెలుసా.. లిస్ట్‌లో మొదటి స్థానం అతడిదే..

పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆటతోనే కాకుండా ప్రవర్తనతోనూ అభిమానులను ఆకట్టుకుంటాడు. అందుకే అతనికి ప్రపంచ వ్యాప్తంగా జనాదరణ లభించింది.

  పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆటతోనే కాకుండా ప్రవర్తనతోనూ అభిమానులను ఆకట్టుకుంటాడు. అందుకే అతనికి ప్రపంచ వ్యాప్తంగా జనాదరణ లభించింది. ఎంతగా అంటే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన్‌స్టాలో 400 మిలియన్ల(40 కోట్ల మంది) Followersతో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ 37 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ సెప్టెంబరు 2021 నాటికే 237 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ అందుకున్నాడు. అప్పటికే అదే రికార్డు. కేవలం 6 నెలల కాలంలోనే 400 మిలియన్ల ఫాలోవర్లను అందుకోవడం విశేషం.

  LIC IPO: త్వరలోనే ఎల్​ఐసీ ఐపీవో.. ఈ భారీ ఆఫరింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏవంటే..

  ఈ సమయంలో దాదాపు 163 మిలియన్ల ఫాలోవర్లను పెంచుకున్నాడు. ఇప్పటి వరకు రొనాల్డో తన ఇన్‌స్టాలో 3242 పోస్టులు పెట్టగా ప్రతి పోస్టుకు లక్షల్లో లైక్స్ లభిస్తున్నాయి. సగటున ఒక్కో పోస్టుకు 10 మిలియన్ల లైక్స్ అందుకుంటున్నాడు. ఇన్‌స్టాలో ఇంత ఫాలోయింగ్ ఉన్న రొనాల్డో కేవలం 500 మందిని మాత్రమే అనుసరిస్తున్నాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఒకప్పుడు రియల్ మాడ్రిడ్‌కు ఆడిన రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాకు కూడా 469 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కేవలం 98 అకౌంట్లను మాత్రమే ఈ సంస్థ ఫాలో అవుతుంది. ఇప్పటివరకు తన అధికారిక అకౌంట్‌లో 7049 పోస్టులను పెట్టింది.

  ఇన్‌స్టాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తులు..

  - క్రిస్టియానో రొనాల్డో 400 మిలియన్ల మంది ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

  - కైల్ జెన్నర్‌కు 309 మిలియన్ల ఫాలోవర్లు

  - లియోనల్ మెస్సీకి 306 మిలియన్లు

  - సెలీనా గోమేజ్‌కు 395 మిలియన్లు

  - డ్వైన్ ద రాక్ జాన్సన్‌కు 295 మిలియన్లు

  - అరియానా గ్రాండేకు 294 మిలియన్లు

  - కిమ్ కార్డాషియాన్‌కు 284 మిలియన్లు

  - బియాన్సేకు 237 మిలియన్లు

  - జస్టిన్ బీబర్‌కు 220 మిలియన్లు

  - ఖోలే కార్డాషియాన్‌కు 219 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

  Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

  Justin Bieber (@justinbieber) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది  తాజాగా రొనాల్డో 37వ పుట్టినరోజున అతని లైఫ్ పార్ట్నర్, ప్రముఖ ఫ్యాషన్ మోడల్ జార్జినా రోడ్రిగ్జ్ బ్లాక్ కలర్ కాడిలాక్ ఎస్కలేడ్‌ లగ్జరీ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఇందులో రొనాల్డో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన లగ్జరీ గిఫ్ట్‌ను చూసి ఆశ్చర్యపోతున్నట్లు కనిపించింది.

  First published:

  Tags: 5 crores followers, Christiano Ronaldo, Instagram

  ఉత్తమ కథలు