కుక్కలు లేదా ఆవుల శరీరంపై మన కంటికి కనిపించే అనేక కీటకాలను చూస్తుంటాం. అవి వాటి శరీరంపైనే పెరుగుతుంటాయి. వాటి రక్తాన్ని పీల్చుకుంటాయి. వాటి శరీరాలపై జీవిస్తాయి. జంతువుల శరీరాలపై ఈ రకంగా జీవించే కీటకాలు ఉంటాయని మనకు తెలసు కానీ.. మన శరీరం మీద కూడా అలాంటి కీటకాలు ఉంటాయని.. అవి కూడా మన శరీరం మీదే జీవిస్తాయనే విషయం మనలో చాలామందికి తెలియదు. వినడానికి ఇది వింతగానే అనిపించినా.. ఇది నిజమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తల నుండి రక్తాన్ని పీల్చే పేనులను మన చూశాం. కానీ కంటితో చూడలేని చాలా చిన్న జీవులు శరీరంపై నివసిస్తుంటాయి. అందులోనూ ఈ సూక్ష్మజీవులు మన ముఖం మీదే తమ జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. అయితే ఈ విషయం తెలుసుకుని మనం పెద్దగా భయపడాల్సిన పనిలేదు. వేల సంఖ్యలో మైక్రోస్కోప్లో కనిపించే జీవులు మన ముఖం మీద సంచరిస్తున్న మాట వాస్తవమే.
ఈ కీటకాలు ముఖం మీద స్పైడర్, టిక్ లైక్ మైట్స్ జాతికి చెందినవని వోక్స్ వెబ్సైట్ యొక్క నివేదిక పేర్కొంది. 99.9% మంది వ్యక్తుల ముఖాలపై ఈ పురుగులు ఉన్నాయని US డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్కు చెందిన మైట్ సైంటిస్ట్ రాన్ ఓచోవా చెప్పారు. ఈ కీటకాలు మన ముఖాలపై ఎక్కువగా ఉంటాయని.. కానీ శరీరంలోని వెంట్రుకల మూలాల్లో అవి మన శరీరం అంతటా ఉంటాయని నివేదిక వెల్లడించింది. మనిషి శరీరంలో లక్షలాది క్రిములు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పగటిపూట ఈ పురుగులు ముఖ వెంట్రుకల మూలాలలో నివసిస్తాయి. మన తైల గ్రంధుల నుండి వెలువడే సహజంగా లభించే నూనెను తింటాయి. రాత్రి వేళల్లో అవి మూలాల నుండి బయటకు వచ్చి, ముఖంపై తమ సహచరుడితో పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి. ఈ పురుగులు 1842 సంవత్సరం నాటికి తెలిసినవే.
కానీ శాస్త్రవేత్తలకు ఇప్పటికీ డెమోడెక్స్ ఫోలిక్యులోరమ్, డెమోడెక్స్ బ్రీవిస్ అనే ఈ పురుగుల గురించి పెద్దగా తెలియదు. శరీరం అంతటా కోట్లాది పురుగులు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే వాటి గురించి ఇంకా పూర్తి సమాచారం లేదు. అవి వెంట్రుకల దగ్గర, ముక్కు దగ్గర, కనుబొమ్మలు ఇతర వెంట్రుకలపై కనిపిస్తాయి. అయితే అవి శరీరం అంతటా జుట్టు మూలానికి సమీపంలో ఎక్కడైనా నివసించవచ్చని నివేదిక వెల్లడించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.