Home /News /trending /

THESE TWO MEDICAL OFFICERS FROM KARNATAKA ACT TOO MUCH WITHOUT TAKING CORONA VACCINE BA GH

Viral video: అబ్బబ్బా, ఆస్కార్ యాక్టర్స్.. కవరేజీ కోసం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు నటన

వ్యాక్సిన్ వేయించుకోకుండానే వేసినట్టు నటన

వ్యాక్సిన్ వేయించుకోకుండానే వేసినట్టు నటన

కర్ణాటకలోని తూముకూరు జిల్లా ఆసుపత్రిలో జనవరి 16న వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. అయితే ఇందులో భాగంగా తూముకూరు డీఎంఓ, గవర్నమెంటు కళాశాల ప్రిన్సిపాల్ రజనీకి వైద్యులు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ను అందజేయడానికి ప్రయత్నించారు.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఓ సమస్య. వచ్చిన తర్వాత మరో సమస్య మొదలైంది. కోవిడ్-19 వ్యాక్సిన్లు పంపిణీలో భాగంగా చాలా ప్రదేశాల్లో ఫ్రంట్ లైన్ కార్మికులు, అత్యవసర రోగులతో పాటు మరికొంత మంది సిబ్బందికి వ్యాక్సిన్ అందజేయడం ప్రారంభించారు. అయితే కొంత మంది మాత్రం వ్యాక్సిన్ ను తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. ఇందుకు ఉదాహరణే ఈ సంఘటన. కర్ణాటకలోని తూముకూరు డీఎంఓ, గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కోవాగ్జిన్ ను మీడియా కవరేజీ కోసం నటిస్తూ ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని తూముకూరు జిల్లా ఆసుపత్రిలో జనవరి 16న వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. అయితే ఇందులో భాగంగా తూముకూరు డీఎంఓ, గవర్నమెంటు కళాశాల ప్రిన్సిపాల్ రజనీకి వైద్యులు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ను అందజేయడానికి ప్రయత్నించారు. అయితే మీడియా కవరేజీ కోసం వ్యాక్సిన్ ను తీసుకున్నట్లు వీరిద్దరు నటించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తాకకుండానే వారు ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా కవరేజీ కోసం వీరు చేసిన ఓవర్ యాక్షన్ చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై విభిన్నంగా స్పందిస్తున్నారు ఔత్సాహికులు

వ్యాక్సిన్ పై వీరికే నమ్మకం లేనట్లుంది అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టగా.. ఉన్నతాధికారులే ఈ విధంగా నటిస్తే సామాన్యులకు వ్యాక్సిన్ పై నమ్మకం ఎలా ఉంటుదని మరో నెటిజన్ ప్రశ్నించారు. ముఖ్యంగా టీకా సమర్థత గురించి ప్రభుత్వం రుజువు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నతాధికారులు వ్యాక్సిన్ చేయించుకున్నారనడానికి ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. టీకాలు తీసుకున్న తర్వాత ఫొటోగ్రాఫర్ తీసే ఫోటోలకు మాత్రం ఫోజులిచ్చేస్తున్నారు.



డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(DCGI) ఈ ఏడాది జనవరిలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ల అత్యవసర వినియోగం కోసం అనుమతినిచ్చింది. కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ ను జనవరి 16న భారత్ ప్రారంభించంది. మొదటి దశలో మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ కార్మీకులకు టీకాలు వేయనున్నారు. 50 ఏళ్లు పైబడిన 27 కోట్ల మందికి, 50 ఏళ్లలోపు వారికి కూడా తర్వాత ప్రాధ్యానత ఇస్తారు. అయితే ఏదేమైనా కోవాక్జిన్ సమర్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇద్దరు మరణించారు. అయితే ఈ మరణాలకు, వ్యాక్సిన్ కు సంబంధం లేదని ప్రభుత్వ స్పష్టం చేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Corona Vaccine, COVID-19 vaccine, Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు