Home /News /trending /

THESE PREGNANT WOMEN WILL GIVE BIRTH TO BABIES AND MAFIA WILL SELL THEM TO OTHER IN NIGERIA AK

ఈ అమ్మాయిలు పిల్లలను కంటారు.. ఆ తరువాత ఏం జరుగుతుందంటే.. ఊహించని దారుణం

పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిలు

పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిలు

ఈ వ్యాపారం నైజీరియాలోనే కాకుండా ఇండోనేషియా, ఉక్రెయిన్‌తో సహా అనేక ఇతర దేశాలలో కూడా జరుగుతోంది. ఆసుపత్రులు, అనాథాశ్రమాలు వంటి చోట్ల బిడ్డల పెంపకం వంటి వ్యాపారాలు రహస్యంగా జరుగుతాయి.

    ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ కొన్ని అరాచకాలు, దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం తప్పితే.. అలాంటి వాటిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి విషయాల గురించి తెలిస్తే.. ఎలాంటి మనుషులకైనా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఆఫ్రికాలోని ఒక దేశంలో పిల్లలు కోసం ప్రత్యేకంగా ఓ ఫ్యాక్టరీ ఉందనే విషయం వినడానికి కాస్త వింతగా ఉన్నా.. ఇది నిజంగా నిజం. నైజీరియాలో ఈ దారుణమైన కార్మాగారాలు ఉంది. పిల్లలను ఉత్పత్తి చేసే ఈ కర్మాగారాలు అక్కడ చాలానే ఉన్నాయి. 'బేబీ ఫార్మింగ్'గా పేరొందిన ఈ దారుణమైన వ్యాపారం అక్కడ జోరుగా సాగుతోంది. ఇక్కడ యువ ఆఫ్రికన్, ఇతర దేశ బాలికలను గర్భవతులగా మార్చి.. వారు బలవంతంగా పిల్లలు కనేలా చేస్తారు. వారిపై ఆ రకంగా ఒత్తిడి చేస్తారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

    అత్యంత దయనీయమైన విషయమేమిటంటే.. ఇక్కడ 14 ఏళ్లలోపు ఆడపిల్లలను కూడా తల్లులుగా మారిపోతున్నారు. ఇక్కడి అమ్మాయిలకు పుట్టే పిల్లలను ఏం చేస్తారనే సందేహం మీకు రావొచ్చు. వాళ్లే వీళ్ల అసలు వ్యాపారం. పిల్లలు లేని జంటలు కోసం ఈ వ్యాపారం ప్రారంభించారు. ఇక్కడ ఆడపిల్లలను తల్లులుగా చేసి అలాంటి జంటలకు పిల్లలను అమ్ముతున్నారు. ఇందుకోసం జంటలు భారీ మొత్తం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ కారణంగా పేదరికంతో బాధపడుతున్న చాలా మంది మహిళలు, బాలికలు డబ్బు దురాశతో వారి ఇష్టపూర్వకంగా ఇక్కడకు వస్తుండటం గమనార్హం.

    కొంతమంది ఇక్కడకు అక్రమంగా తరలించబడిన వారిలో ఉన్నారు. అలాంటి వాళ్లు ఇక్కడి వారి ఒత్తిడి మేరకు తల్లులుగా మారుతున్నారు. ఈ వ్యాపారం నైజీరియాలోనే కాకుండా ఇండోనేషియా, ఉక్రెయిన్‌తో సహా అనేక ఇతర దేశాలలో కూడా జరుగుతోంది. ఆసుపత్రులు, అనాథాశ్రమాలు వంటి చోట్ల బిడ్డల పెంపకం వంటి వ్యాపారాలు రహస్యంగా జరుగుతాయి. నైజీరియాలో పిల్లలు పుట్టే వ్యాపారం చాలా ప్రమాదకరంగా మారింది.

    తెలియని వ్యక్తితో డేటింగ్‌కు రెడీ.. ఓసారి వాడెవడో చూద్దామని గూగుల్లో సెర్చ్.. అంతే కాళ్ల కింద భూమి కంపించింది...

    Affair: భర్తను వదిలేసి మరొకరితో ప్రేమ.. కానీ అక్కడ కూడా తేడా కొట్టింది.. చివరికి

    గార్డియన్ వెబ్‌సైట్ 2011 నివేదిక ప్రకారం.. భద్రతా సిబ్బంది దాడిలో 32 మంది గర్భిణీ స్త్రీలను బలవంతంగా బందీలుగా పట్టుకుని ఇక్కడకు తీసుకువచ్చారు. ఇక్కడ ప్రసవించే అమ్మాయిలు 14 నుండి 17 సంవత్సరాల వయస్సు ఉన్నారు. ఇక వారు స్వయంగా అబార్షన్లు కూడా చేసుకోలేరు. ఎందుకంటే ఆ దేశంలోని చట్టం వారిని అలా చేయడానికి అనుమతించదు. ఇక్కడి మాఫియా.. ఇలాంటి అమ్మాయిలకు పుట్టే పిల్లలను 3-4 లక్షల రూపాయలకు అమ్మేస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు