Home /News /trending /

THESE PEOPLE HOUSE SHIFTING AS SERIOUS SEE HILARIOUS VIRAL VIDEO BA

Viral Video: ఓర్నీ.. ఇల్లు షిఫ్ట్ చేయడం అంటే కర్రలు కట్టి మోసుకెళ్లిపోతున్నారే..

నాగాలాండ్‌లో ఇంటిని మోసుకెళ్తున్న దృశ్యం

నాగాలాండ్‌లో ఇంటిని మోసుకెళ్తున్న దృశ్యం

ఈ వీడియోను చూసిన వారంతో ఎంతో అభినందిస్తున్నారు. కొందరైతే అసలు తాను నమ్మలేకపోతున్నామని చెప్పారు. కానీ, ఈ వీడియో మాత్రం నెటిజన్లను చక్కగా ఆకట్టుకుంటోంది. 1.18 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పటి వరకు 19.5వేల వ్యూస్ పొందింది. 

    ఇల్లు మారాలి. అంటే అందరికీ ఇంట్లో సామాను మార్చాలి. అయితే, వారికి మాత్రం ఇల్లు మారడం అంటే.. ఒక చోట ఉన్న ఇంటిని మరో చోటకు మోసుకుని తీసుకుని వెళ్లడమే. ఔను. మీరు చదివింది నిజమే. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో కూడా చూస్తారు. కొందరు వ్యక్తులు ఓ ఇంటికి కర్రలు కట్టి మోసుకుని వెళ్తున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సుధా రమేష్ ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ఐకమత్యమే మహాబలం అనే నానుడిని వీళ్లు మరోసారి నిజం చేశారు. నాగాలాండ్‌లోని ఓ ఊళ్లో ఇది జరిగింది’ అని కామెంట్ చేశారు. ఆ వీడియోను గమనిస్తే చాలా కొండ ప్రాంతంలా ఉంది. ఆ ఇల్లు కూడా చెక్కలతో చేసిన ఇల్లులా కనిపిస్తోంది. ఆ ఇంటిని ఒక చోట నుంచి మరో చోటకు మోసుకుని వెళ్తున్నారు జనం. ఆ ఇంటికి నాలుగు వైపులా కర్రలు కట్టిన పురుషులు వాటిని అందరూ ఒకేసారి మోసుకుంటూ ‘అహోం అహోం భీ.. అహోం అహోం భీ’ అంటూ చక్కగా ఇంటికి ఒక దగ్గరి నుంచి మరో చోటకు తీసుకుని వెళ్తున్నారు.



    ఈ వీడియోను చూసిన వారంతా ఐకమత్యమే మహా బలం అనే మాటను అంగీకరిస్తున్నారు. మరికొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లు ఒక్కసారి చూడండి.





    కొందరు మాత్రం దీనిపై జోక్స్ వేస్తున్నారు. ఇల్లు ఈఎంఐ కట్టకపోతే ఇలా చేస్తున్నారా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.





    ఈ వీడియోను చూసిన వారంతో ఎంతో అభినందిస్తున్నారు. కొందరైతే అసలు తాను నమ్మలేకపోతున్నామని చెప్పారు. కానీ, ఈ వీడియో మాత్రం నెటిజన్లను చక్కగా ఆకట్టుకుంటోంది. 1.18 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పటి వరకు 19.5వేల వ్యూస్ పొందింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Nagaland S17p01, Viral Videos

    తదుపరి వార్తలు