Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ.. ఎక్కడో తెలుసా?

కరోనా నేపథ్యంలో బ్యాంక్‌లు, ఎఫ్‌డీ కంపెనీలు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. కొన్ని పెద్ద పెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును గరిష్టంగా 5.5 శాతంగా నిర్ణయించాయి.

news18-telugu
Updated: October 24, 2020, 9:06 AM IST
Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ.. ఎక్కడో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డబ్బును ఆదా చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలను వినియోగించుకోవచ్చు. కరోనా కాలంలో డబ్బు పొదుపు చేయడం ఎంత ముఖ్యమో మరోసారి జనాలకు తెలిసివచ్చింది. దీంతో రాబోయే కాలంలో డబ్బును ఆదా చేయాలని చాలా మంది భావిస్తున్నారు. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు పొదుపు చేయడం వల్ల పెద్దగా ఆదాయం రాదు. వాటితో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఎక్కువ. పెట్టుబడి భద్రత, రాబడి హామీ ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. అయితే కరోనా నేపథ్యంలో బ్యాంక్‌లు, ఎఫ్‌డీ కంపెనీలు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. కొన్ని పెద్ద పెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును గరిష్టంగా 5.5 శాతంగా నిర్ణయించాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ చోట ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతానికి పైగా వడ్డీ రేటు లభిస్తుంది.

అదేక్కడో కాదు.. కేరళలోని ట్రాన్స్‌పోర్ట్ అండ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో. ఇక్కడ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతానికి పైగా వడ్డీ రేటు పొందవచ్చు. అయితే ఇది నమ్మదగిన సంస్థేనా అనే అనుమానం కూడా కొందరికి రావచ్చు. అయితే ఇక్కడ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కేరళ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. రూ. 4,500 కోట్ల వరకు కేరళ ప్రభుత్వం హామీ కల్పించింది. దీంతో ఎటువంటి రిస్క్‌ లేకుండా ఇక్కడ డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు.

వడ్డీ రేట్లు ఇలా..
కేరళలోని ట్రాన్స్‌పోర్ట్ అండ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌.. ఒకటి నుంచి మూడేళ్ల కాలపరిమితితో డిపాజిట్లకు 8 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. అదే నాలుగు నుంచి ఐదేళ్లవరకు 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. అదే విధంగా సీనియర్ సిటీజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఒకటి నుంచి మూడేళ్లకు 8.25 శాతం, నాలుగు నుంచి ఐదేళ్లకు 8 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది

ఇక, ఫిక్స్‌డ్ డిపాజిటల్లపై ఎఫ్‌డీ కంపెనీలు, బ్యాంకులు ఎక్కవ మొత్తంలో వడ్డీ రేట్లు ఆఫర్ చేయ్యవు. కానీ కొన్ని చిన్న బ్యాంకులు చాలా మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయి. కానీ అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటారు. అది మన డబ్బులు భద్రతను ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం లేకపోలేదు. అందుకే తాము డబ్బులు ఫిక్స్‌‌డ్ డిపాజిట్ చేయాలనుకున్న సంస్థ గురించి అన్ని విధాలుగా తెలుసుకోవడం మంచిది.
Published by: Sumanth Kanukula
First published: October 24, 2020, 9:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading