Home /News /trending /

THESE ARE THE MYSTERIES THAT NO ONE IN THE WORLD HAS EVER SOLVED FIND OUT ABOUT THEM HERE GH VB

Unsolved Mysteries: ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ ఛేదించని మిస్టరీలు ఇవే.. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Unsolved Mysteries: ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ ఛేదించని మిస్టరీలు.. ఇంకా కొనసాగుతున్న పరిశోధనలు.. పూర్తి వివరాలు ఇలా..

మన ప్రపంచం(World) అనేక రహస్యాలు(Secrets), చిక్కుముళ్లతో నిండి ఉంటుంది. ఇలాంటి వాటిని ఛేదించేందుకు ప్రతిభావంతులైన చరిత్రకారులు, అంకితభావం కలిగిన నిధి అన్వేషకులు, క్రిప్రోగ్రాఫర్లు(Cryptographers) ఎంతో కృషి చేస్తుంటారు. అయినా కూడా వీటిలో కొన్ని మిస్టరీస్ (Mysteries) ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే.. ఈ వివరాలు చదవండి.

బెర్ముడన్ ట్రయాంగిల్‌
ఇది ఒక అనూహ్యమైన ప్రదేశం. గత 500 ఏళ్లుగా దీని సమీపంలోకి వచ్చిన విమానాలు, పడవలు అన్ని అనూహ్యంగా మాయమైపోతున్నాయి. ఈ బెర్ముడా ట్రయాంగిల్‌ లేదా దయ్యపు త్రికోణం వెనుక ఉన్న మర్మమేంటో ఇప్పటికీ తెలియదు. ఇది బ్రిటీష్‌ ప్రాదేశిక సముద్ర ప్రాంతం బెర్ముడా, అమెరికాలోని ఫ్లారిడా మయామి, ప్యూర్టో రికో- అమెరికా సరిహద్దు దగ్గర ఉంది. దీని గురించి శాస్త్రవేత్తలు నిపుణులు రకరకాల సిద్ధాంతాలు చెప్పారు. సముద్ర దయ్యాల నుంచి గుర్తించని ఎగిరే వస్తువుల వరకు అనేకం చెప్పారు. కానీ ఇంతవరకు ఆ మిస్టరీని మాత్రం కనిపెట్టలేకపోయారు.

గ్రీస్‌ – యాంటీక్యాతేరా మెకానిజం
కంప్యూటర్‌ లాంటి ఈ పరికరాన్ని గ్రీస్‌ శాస్త్రవేత్తలు క్రీ.పూ. 150 – క్రీ.పూ 100 మధ్య రూపొందించినట్లు నమ్ముతారు. దీన్ని గ్రీక్‌ ద్వీపం యాంటీక్యాతేరా తీరంలో 2000 ఏళ్ల నాటి పాత పడవ శిథిలాల్లో కనుగొన్నారు. ఈ పరికరాలన్ని గ్రహణాలను గుర్తించేందుకు, గ్రహాల స్థితిగతులను అంచనా వేసేందుకు నాటి శాస్త్రవేత్తలు రూపొందించి ఉంటారని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త చరిత్రకారుడు డెరిక్‌ జె డి సోలా ప్రైస్‌ 1959లో తెలిపారు. కానీ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరం మరొకటి ఏదీ 14వ శతాబ్దం వరకు కనిపించలేదు. దానికి కారణంగా ఇప్పటికీ తెలియదు.

Chinese Phone Companies: చైనీస్ స్మార్ట్​​ ఫోన్ కంపెనీల నయా ప్లాన్.. విచారణలో నమ్మలేని నిజాలు..


అమెరికా – ఏరియా 51
అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మారుమూల ఉన్న యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కేంద్రం ఎన్నో రహస్యాలకు నిలయం. కుట్ర సిద్ధాంతకర్తలు, UFO వాదుల ప్రకారం ఈ ప్రదేశం భూమిపై కూలిన ఒక గ్రహాంతర వాహనానికి స్జోరేజ్‌గా ఉందనే నమ్మకం ఉంది. అంతే కాదు భూగ్రహంలో ఉన్న సైనిక కేంద్ర గ్రహాంతర టెక్నాలజీ గురించి ప్రభుత్వం పరిశోధన చేస్తోందనే నమ్మకం కూడా ఉంది. అక్కడ ఏం ఉంది, ఏం జరుగుతోంది అనేది ఇప్పటికీ అపరిష్కృత రహస్యమే.

స్కాట్‌లాండ్ – లోచ్‌ నెస్‌ మాన్‌స్టర్‌
లాస్‌ నెస్‌ లాంటి రాక్షస జీవి ఉంటాడని మీరు ఊహించగలరా? పురాణాల ప్రకారం అది ఒక పౌరాణిక జలచరం. అది స్కాట్‌లాండ్‌లో కనిపిస్తుంది. అది డైనోసర్ల తరహాలో ఉండే భారీ జంతువు అని కొంతమంది నిపుణులు అభిప్రాయపడతారు. ఈ రాక్షస జీవికి సంబంధించినదిగా నమ్ముతున్న తొలి ఫొటోగ్రాఫిక్‌ ఆధారం 1934లో లభించింది. కానీ అది నకిలీదని 1994లో తేలింది. గ్లోబల్ వార్మింగ్‌ కారణంగా ఈ జీవి అంతరించిపోయి ఉంటుందని 2008లో అంచనా వేశారు. కానీ ఇటీవలి కాలంలో అసలు ఆ రాక్షస జీవి ఉందా లేదా అని నిర్ధారించేందుకు పర్యావరణ DNA ఉపయోగించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై శాస్త్రవేత్తలు చర్చిస్తున్నారు.

ఇంగ్లాండ్‌ – షగ్‌బరో ఇన్‌స్క్రిప్షన్‌
ఇది ఇంగ్లాండ్‌ స్టాఫోర్డ్‌షైర్‌లో ఉన్న 18వ శతాబ్దం నాటి గొర్రెల కాపరి విగ్రహం. దూరం నుంచి చూస్తే ఇది సాదాసీదా విగ్రహంలాగానే కనిపిస్తుంది. కానీ దగ్గర నుంచి చూస్తే దాంట్లో ఏదో తెలియని భాషలో ఉన్న అక్షరాలు కనిపిస్తాయి. DOUOSVAVM – అనే కోడ్‌ను ఇప్పటికీ పరిష్కరించలేదు. పవిత్ర గ్రెయిల్‌కు సంబంధించి వీరయోధులు అందించిన క్లూ ఇది కావచ్చన్నది కొంత మంది నిపుణుల అభిప్రాయం. మరికొందరు ఈ కోడ్‌ డీకోడ్‌ చేసేందుకు ప్రయత్నించారు కానీ ఎటువంటి ఫలితాన్ని రాబట్టలేకపోయారు.

పాకిస్థాన్‌ – మొహంజొదారో
ఇది UNESCO గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. దీన్ని సుమారు క్రీ.పూ. 2500లో నిర్మించి ఉంటారు. సింధు లోయ నాగరికతలో ఇది ఒక పెద్ద జనావాసం. అంతే కాదు ప్రపంచంలోని అతి ఆరంభ నగరాల్లో ఒకటి. ధ్వంసం అవడానికి ముందు సింధు నది ప్రవాహం కారణంగా ఇది ఒక సారవంతమైన ప్రదేశం. 1911 వరకు దీన్ని ఎవరూ గుర్తించలేదు. ఇక్కడి నాగరికత, ప్రజల గురించి అనేక సిద్ధాంతాలను నిపుణులు తెలియజేసినప్పటికీ ఇప్పటికీ అది రహస్యంగానే ఉంది.

ఇంగ్లాండ్‌ – స్టోన్‌హెంజ్‌
చరిత్రకు పూర్వం నుంచి ఉన్న ఈ విగ్రహాన్ని రూపొందించేందుకు నాటి నవీన రాతియుగపు నిర్మాణవేత్తలు 30 మిలియన్ గంటల పాటు కష్టించి ఉంటారని అంచనా. సార్సెన్‌, బ్లూస్టోన్‌ అనే రాతితో రూపొందించిన విగ్రహం ఇది. దీన్ని దక్షిణ ఇంగ్లాండ్‌లో చూడవచ్చు. ఇది UNESCO గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. మంచు యుగం నాటి హిమనీనదాల ఈ రాళ్లను ఇంత ఎత్తుకు లేపి ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. ఏది ఏమైనా ఎందుకు ఈ నిర్మాణాన్ని చేపట్టారన్నది ఇప్పటికీ రహస్యమే.

Word-Guessing Game: అత్యధిక యూజర్లను ఆకర్షించిన గేమ్ ఇదే.. పూర్తి వివరాలు ఇలా..


ఇటలీ – ష్రోడ్‌ ఆఫ్‌ టూరిన్‌
పురుషుడి ఆకారం కలిగిన ఒక లెనిన్‌ వస్త్రపు ముక్క ఇది. అది జీసస్‌ ఆఫ్‌ నజరెత్‌ శవంపై కప్పిన వస్త్రం కావచ్చని కొందరు నమ్ముతారు. ఇది ఇటలీలోని టూరిన్‌లో ఉన్న సెయింట్‌ జాన్‌ చర్చిలో ఉంది. అనేక మంది శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని పరీక్షించారు, DNA పరీక్షలు సహ అనేక పరీక్షలు నిర్వహించారు. 2018 జూలైలో వెలువడిన ఒక నివేదిక.. ఈ వస్త్రం నకిలీది కావచ్చని తెలిపింది. దానిపై ఉన్న రక్తం మరకల తీరు అవాస్తవికంగా ఉందని అభిప్రాయపడింది. ఏది ఏమైనా ఆ వస్త్రం ఒక మతపరమైన చిహ్నంగా నిలిచింది. కానీ దాని వెనుక మిస్టరీ మాత్రం అలాగే ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు