క్యాన్సర్(Cancer).. ఈపదం వింటేనే భయపడిపోతాం. ఇటీవల క్యాన్సర్ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మారుతున్న జీవన శైలి, జీన్స్ లోపాలు కారణంగా క్యాన్సర్ ముప్పు ఏటేటా పెరుగుతోంది. మనిషిలోని క్యాన్సర్ కణాలను కుక్కలు పసిగట్టతాయని గతంలో మనం విన్నాం. తాజాగా చీమలు(Ants) కూడా క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. అయితే ఇది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది.మనిషి శరీరంలోని క్యాన్సర్ కణాలను ఆరోగ్యవంతమైన కణాల నుంచి చీమలు వేరుస్తాయని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. గగుర్పాటుకు గురిచేసే ఇలాంటి వాటిని ఆసుపత్రుల్లో(Hospitals) ఒకరోజులో చేయాలంటే మరిన్ని క్లినికల్ టెస్ట్‌లు(Clinical Tests) నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్యాన్సర్‌ని గుర్తించడంలో సహాయపడటానికి ఒక రోజు మొత్తం చీమలను ఉపయోగించగలమా? ఇది అసాధ్యమనిపించవచ్చు.
అయితే పరిశోధనల బృందం దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. తక్కువ హానికరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ పరిశోధనలకు ఇది దారితీయవచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన సీఎన్ఆర్ఎస్, యూనివర్శిటీ సోర్బోన్ ప్యారిస్ నోర్డ్, ఇన్స్టిట్యుట్ క్యూరీ, ఇన్సెర్మ్ల పరిశోధకులు విస్తృతంగా పరిశోధించి ప్రత్యేక వాసన పసిగట్టగల ఫార్మికా ఫుస్కా చీమలను గుర్తించారు. ఇందుకు సంబంధించిన పరిశోధన వివరాలు iScience అనే జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.
పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు 36 చీమలను పరీక్షించారు. ఇవి మనిషిలోని క్యాన్సర్ కణాలను వాసనతో పసిగట్టుతున్నాయని మొదట గుర్తించారు. తరువాత పరిశోధకులు చీమలను రెండు వేర్వేరు వాసనలకు గురిచేశారు. ఒకటి కొత్త వాసన కాగా, రెండోది క్యాన్సర్ కణాల వాసన. దీంతో చీమలు క్యాన్సర్ కణాలను వాసనతో విజయవంతంగా పసిగట్టాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. క్యాన్సర్, ఆరోగ్యకరమైన కణాల మధ్య అలాగే రెండు క్యాన్సర్ లైన్ల మధ్య చీమలు వివక్ష చూపుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. శిక్షణ ఇచ్చిన తరువాత ‘ఫార్మికా ఫుస్కా’ చీమలు క్యాన్సర్ కణాల ద్వారా విడుదలయ్యే ఓలటైల్ ఆర్గానిక్ మిశ్రమాన్ని గుర్తిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
దీన్ని పెద్దఎత్తున్న అనుసరించే ముందు ఈ పద్దతి సామర్థ్యం ఏమేరకు పనిచేస్తోందో తెలుసుకోవాలంటే మనిషిపై క్లినికల్ ట్రయల్స్ చేస్తేగాని ఓ అంచనాకు రాలేమని ఓ ప్రకటనలో CNRS వెల్లడించింది. అయితే చీమల సామర్థ్యం అధికంగా ఉండడంతో త్వరగా నేర్చుకుంటున్నాయని... ఈ రకమైన పరిశోధనలు తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా చేయవచ్చని తమ మొదటి అధ్యయనంలో తేలిందని CNRS పేర్కొంది.
క్యాన్సర్ కణాలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు జంతువుల వాసనను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే చాలా సార్లు ఇలా పరిశోధనలు చేశారు.
రోగనిర్ధారణకు, నిర్దిష్ట క్యాన్సర్ కణాలను గుర్తించడానికి కుక్కుల ముక్కులు బాగా ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు. అయితే వాటికి ఈ విధంగా శిక్షణ ఇవ్వడానికి కొన్ని నెలలు పడుతుందన్నారు. అలాగే కీటకాలు కూడా ఇలాంటి పరిశోధనలకు బాగా ఉపయోగపడతాయని.. వీటిని అతి తక్కువ ఖర్చుతో నియంత్రిత పద్దతుల్లో సులభంగా పెంచవచ్చు. కీటకాల వాసన వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. శిక్షణ పొందిన కీటకాల సహాయంతో వందలాది మందిపై పరిమిత స్థాయిలో ట్రయల్స్ జరుగుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ants, Cancer cells, Eye science, Journal, Scientists, Trending news